చిదానందరూపా-కులచిరాయ నాయనారు
*********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
"మనమేర్కుడి" గ్రామపెద్ద శివభక్తుడు కులచిరాయ
అనవరతము వినపడును అతనినోట " నమః శివాయ"
కులమత భేదమును మరచి శివకులమొకటే అని అను
చిన్న-పెద్ద తేడాలు చిన్నబుచ్చుట అతడు ఎరుగడు
మంత్రి పదవి వరించెను శివభక్తిని వ్యాపించగ
జ్ఞాన సంబంధరును తెప్పించెను రాజుకన్ను తెరిపించగ
స్వచ్చత నిండిన మనము స్వచ్ఛంద శివమయమాయెగ
సద్గతినొందగ ఇతరులకు సన్మార్గము చూపుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.