Tuesday, May 29, 2018

TIRUPAANNAI ALWAR

సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరిఆభరణములు
 ధర్మ సంస్థాపనమేలక్ష్యమైన మన ఆళ్వారులు

 ఉరైయూరులోని వరివెన్ను నుండి అయోనిజుడుగ
 ప్రశంసలతో ప్రకటితమైనది హరి శ్రీవత్సపు అంశ(పుట్టు మచ్చ)

 మాల దాసరి ఇంట గోక్షీరముతో  పెరుగుచు
 విష్వక్సేనునిచే పంచకర్మ సంస్కారములనందినది

 ఆలయ ప్రవేశము లేకున్నను, అద్భుత వీణాగానము
 సారంగ ముని భుజమునెక్కి యోగివాహనునిగా చేసెను

 పక్కకు తొలగలేదని ఆళ్వారును  రాళ్ళతో కొట్టగా
 చక్కని భక్తిని  తెలుపగ స్వామి తాను భరించెనుగా

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థము చాటిన  తిరుప్పాణాళ్వారు పూజనీయుడాయెగ.


శ్రీ తిరుప్పాణాళ్వారు శ్రీహరి శ్రీవత్సపు 9ఎదమీది పుట్టుమచ్చ) అంశగా గానముతో-వాద్యవిశేషములతో స్వామిని అర్చించు పనర వంశమున,శ్రీ రంగపట్టణ సమీపమునందలి అలకాపురిలో అవతరించెను.తన ఆరాధనలతో పెరుమాళ్ గా ప్రఖ్యాతిగాంచెను.
అంటరానితనమును అంటుకొనియున్న నాటి సమాజపు పెద్దలు తిరుపాణ ను ఆలయప్రవేశమునకు అనుమతించలేదు.అంతేకాదు వారు ఉపయోగించుకొను జలతీర్థములను తాకరాదని ఆంక్షలను విధించిరి.వారిని ఎదిరించు ఉద్ద్యేశములేని తిరువణ్ణ ఒకనాడు భగవద్గుణజలధిలో మునిగి,తాదాత్మ్యమును చెందుతూ,పరిసరములను పరిశీలించలేదు.దాని ఫలితమే స్వామి అర్చకునిచే విపరీతముగా దండింపబడినాడు.స్వామిని అనుగ్రహమునకుముందుగా ఆటంకములను తొలగించుటకు పరీక్షించినాడేమో.ఆలయమునకు తిరిగివెళ్ళిన అర్చకుస్వామి,రక్తసిక్తమైయున్న శ్రీరంగనాథుని చూసి
అపరాథముతెలియక,ఆందోళనతో నున్న సమయమును,సర్వము సాక్షాత్కరింపచేసెనట.పశ్చాతపుడైన అర్చకుడు మన ఆళ్వారుని తన భుజములమీద నెక్కించుకొని స్వామి దర్శనమునకు తీసుకొని వెళ్ళెనట.మునివాహన వందనములు.

జై శ్రీమన్నారాయణ.

KULASEKHARA ALWARU

 సంభవామి యుగే యుగే-సాక్ష్యములు  హరి ఆభరణములు
  ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు

  చేర రాజవంశములో దృఢ మహారాజు పుణ్యము
  పుత్రునిగ ప్రకటితమైనది శ్రీహరి  కౌస్తుభమణి

  ముదలి ఆళ్వారుచే  పంచ సంస్కారములను పొంది
  అవతారములలో  రాముని,అర్చావతారములలో వెంకటేశుని

  నిరతము భాగవతులలో  దర్శిస్తూ-సేవిస్తూ
  పెరుమాళ్ భక్తి  అనే  పెద్ద మడుగులోని చేపయై

  జీవిత నాలుగుదశలను  జీవుడిగా  తరియిస్తూ
  "కుల శేఖర పడి" పేరిట గర్భగుడి ముందర గడపగ

  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
  పరమార్థముచాటిన కుల శేఖర ఆళ్వారు పూజనీయుడాయెగ.

శ్రీహరి కౌస్తుభమణి అంశయే చేరరాజుకు కులశేఖరునిగా అవతరించినది.స్వామిభక్తులలో సాక్షాత్తు స్వామిని దర్శించి-సేవించగలిగిన మహానుభావుడు.తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి గర్భగుడి గదపగా,"కులశేఖర ఆళ్వారుపడి"గా నేటికిని స్వామిని సేవించుకుంటున్న ముకుందమాలను మనకు ప్రసాదించిన పెరుమాళ్ళు వీరు.

జై శ్రీమన్నారాయణ.

TIRUMASAI ALWAAR

అదివో అల్లదివో-తిరుమళిశై ఆళ్వార్

 సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరి ఆయుధములు
 ధర్మ సంస్థాపనయే  లక్ష్యమైన మన ఆళ్వారులు

 తిరుమళిశై నగరములో కనకాంగి-భార్గవ మునికి
 చిరు  మాంసపు ముద్దయాయె  శ్రీ హరి సుదర్శనము

 లక్ష్మి-నారాయణుల అనుగ్రహము లక్షణ బాలుని సేయగ
 పంకజవల్లి-తిరువాలన్ దత్త పుత్రుడాయె ధర్మమై

 వృద్ధ దంపతులను కరుణించగ క్షీరమును సేవించి
 కణి కృష్ణుని అనుగ్రహించె ఆనందమును కలిగించె

 భక్తిసారుడు అనుపేర భగవత్తత్త్వమును చాటగ
 తన మూడవ కన్నుతో ముక్కంటితో తలపడెగ

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థము చాటిన తిరుమశై ఆళ్వార్ పూజనీయుడాయెనుగ.

శ్రీవైష్ణవ సంప్రదాయం ఆయన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చక్రాయుధం, సుదర్శనం అవతారంగా భావిస్తారు. తిరుమళైశాయిలోని జగన్నాథ పెరుమాళ్ ఆలయంలో భగవత్ కృపచే జన్మించారని నమ్ముతారు.
తిరువాలన్, పంకయా చెల్వి అన్న పిల్లలు లేని, గిరిజన దంపతులు కట్టెలు కొడుతుండగా బాలుడిని చూసి, ఇంటికి తెచ్చుకున్నారు. దంపతులకు కనికణ్ణన్ అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతను తిరుమళిశై ఆళ్వారు శిష్యుడు అయ్యారు.
తిరుమళైశాయి ఆళ్వార్ తాను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య & శూద్ర వర్ణాలకు చెందినవాణ్ణి కానని చెప్పుకున్నారు, ఒకానొక ద్విపదల్లో తనను తాను అవర్ణుడిగా అంటే కులం లేనివానిగా లేదా దళితునిగా పేర్కొన్నారు. భార్గవ మహర్షి, కనకాంగి దంపతులకు, తల్లి గర్భంలో అసహజమైన 12 నెలల గర్భవాసం అనంతరం జన్మించారు. కాలుసేతులు, ప్రాణం లేని శరీరంగా శిశువు బయటకు వచ్చాడు. దంపతులు తీవ్రంగా నిరాశ చెంది, అయిష్టంగానే ఓ వెదురుపొద కింద వదిలేసి, ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమై ఆ మృతశిశువుకు మాంసం, ప్రాణం ఇచ్చి ప్రాణమున్న మనిషిని చేశారు.
అతనికి చేతులు, కాళ్ళు కూడా ఏర్పడ్డాయి, ఆప్యాయంగా ఓ గిరిజనుడైన తిరువళన్ తీసుకుని పెంచుకోవడం ప్రారంభించారు. పుణ్య దంపతులైన తిరువళన్, పంకజవల్లి ఆ బిడ్డను తమకు ప్రసాదించిన భగవంతుని కృపకు పట్టరాని సంతోషం పొందారు. పిల్లాడు పెరిగి తిరుమళిశై ఆళ్వార్ అయ్యారు.విష్ణుతత్త్వమును వివరించి జగతిని ఉధ్ధరించిన పూజనీయులు.

జై శ్రీమన్నారాయణ.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...