TANOTU NAH SIVAH SIVAM-08@SIVATANDAVASTOTRAMU
తనోతు న#హ్ శివః శివం-08 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ." స్వామి ప్రకాశమైతే అమ్మ వ్యాపినీ వివిధాకార /ఆ ప్రకాశమును సర్వత్రా వ్యాపింప చేసే విమర్శ.స్వామి స్థావరమైతే అమ్మ జంగమాత్మకము.స్వామి జంగమయైతే అమ్మ స్థావరముగా స్వామిలో ఒదిగి పోతున్నది.స్వామి తాందవిస్తున్నాడు.తల్లి స్థిరముగా తానుండి స్వామిని తాందవింపచేస్తున్నది.ఒకపరి అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ.మరొకపరి స్వామి స్వామి భిభర్తు భూత భర్తరి.అర్థనారీశ్వర పరమార్థము అనిర్వచనీయము. " జటా భుజంగ పింగళః స్పురత్పణా మణిప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిక్వధూముఖే మదాంధ సింధుర స్పురత్వగుత్తరీయమేదురే మనోవినోదమద్భుతం భిభర్త్ భూత భర్తరి." 1.స్వామి జటలలో భుజంగము పడగలమీది మణులు ఎరుపుతో కూడిన పసుపువర్ణమైన పింగల వర్ణముతో ప్రకాశించుచున్నవి.అవి మంగలకరమైన "పసుపుకుంకుమలా" అనిపిస్తున్నవి.స్వరూపమునుతో పాటుగా తమ స్వభావమును సైతము మార్చుకుని జగత్కళ్యాణమునకై, 2.కదంబ కుంకుమద్ర...