Monday, December 27, 2021
PASURAM-12
తిరుచిట్రంబలం-పాశురం-12
************************
ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం
తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం
కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం
కాత్తు పడైత్తు కరందు విళయాడి
వార్తయుం పేశి వలై శిలంబ వారళైగళ్
ఆర్పరవం సెయ్య అణుకుణల్ మేల్ వండార్ప
పూత్తిగణుం పొయిగై కుడైదుడై యాన్ పొర్పాదం
ఏత్తి ఇరుంచులై నీరాడేలో రెంబావాయ్
*****
ఆర్తా విషణ్ణా శిధిలాస్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమాన
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఖః సుఖినో భవంతు
భగవన్నామ సంకీర్తనమే భవరోగమును హరింపచేయగల ఔషధము.భవరాశి యనుగడ్డివాములను దహింపచేయగల అగ్నికనము.భవసాగరమును సులభముగా దాటింపగల నావ.భవతారకము.
జీవులకు ఆర్తిని కలిగించుచున్న కలతలను పెంచుచున్న కష్టములను కనుక మనము గుర్తించగలిగితే అవి
శ్రీ అదిసంకరులు భజగోవిందములో వచించినట్లు,
పునరపి జననం-పునరపి మరణం
పునరపి జనని జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయా పారే పాహి మురారే
పిరవి-తిరిగి తిరిగి,
తుయిర్ కెడ-బాధలలో మునిగి
సంసారమనే జలధిలో బంధములనే మొసలిచే పట్తుకొనబడి,దానిని విడిపించుకొనలేక/చేతకాక
మనలను మనము రక్షించుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది చెలులారా.
తుయిర్కెడనాం-బాధలను/ఆర్తిని తొలగించు
ఆర్తాదుం-నర్తకుడు
సాటిలేని మేటి నర్తకుని
పొర్పాదం-బంగారుకాంతులీనుచున్న పాదమును పట్టుకుని,
వార్తయుం పేశిం-లీలావిషేషములను సంకీర్తించుదాము.
ఆ అసమాన నర్తకుకి నాట్య విశేషములే ,
కూత్తం ఇవ్వానం-ఆకాశమును సృష్టించుట,
కువలయమున్-భూమందలమును సృష్టించుట
భూమ్యాకాశములతో పాటుగా సమస్తమును సృజించి,
కాత్తు-సృష్టికార్యమును చేసి,
పడైత్తు-దానిని స్థితికార్యముగా పోషించుట,
తరువాత,
మూడవ భాగముగా,
పడైందు-తనలో లీనము చేసుకొనుట అను మహత్తర నాట్యమును
విళయాడి -అవలీలగా చేస్తూ మన ఆర్తిని/భవబంధములను తొలగించుచున్నాడు.
స్వామి నృత్య రూపముగా చేస్తున్న ,
నృత్యములోని భంగిమలను కనుక ఒక సారి పరిశీలిస్తే,
చేతిలోని డమరుకము-సృష్టికార్యమునకు చిహ్నముగా, కుడివైపు పైనున్న అభయహస్తము స్థితికార్య సూచకముగా,
ఎడమ ఊర్థ్వ హస్తములోని అగ్ని సంహార సంకేతముగా,
భూమికి ఆనించిన కుడిపాదము తిరోధానపు గుర్తుగా,
సగము ఎత్తి ఉంచిన వామపాదమును అనుగ్రహ అర్థముగా పెద్దలు భావిస్తారు.
ప్రపంచకదలిలకు పరమేశుని కదలికల ప్రతిబింబములే కదా.
స్వామి అగ్నిపాత్రను వామహస్తమున పట్తుకుని నర్తనమును చేయుటలోని ఆంతర్యమును అనుభవజ్ఞులు అందించిన ప్రకారము,
నేను-నాది అను అహంకారముతో/అజ్ఞానముతో భ్రమను నిజమనుకునే జీవులను జనన-మరణ వలయమును చిక్కుకొని కొట్టుమిట్టాడుచున్న వారిని,ఉధ్ధరించుటకై (ఒకసారి దర్శించినంత మాత్రముననే) జన్మరాహిత్యమునందించుటకై,
నటనం ఆడునే,
ఆ పరమశివుడు
భవ తిమిర హరుడు
నటనా వతంసుడై
తకధిమి తకధిమి యని,
అని సంకీర్తించువేళ,
మన చేతికడియాలు,నడుమునకు ఉన్న ఒడ్డాణము,
వళి-వార్కళైగళ్ శిలంబ ఇక్కడ ఆభరణములు బాహ్యములుకావు.అంతఃకరనములు.నాభినుండి వెలువడు ఓంకారమే ఒడ్డాణపు సవ్వడి.భక్తిభావ కైమోడ్పు కంకణముల ధ్వని.
ఆ నామ మాహాత్మ్యమో/నామి మాహాత్మ్యమో తెలియదు కాని చెలి,
మన
అణి కుణల్-పువ్వులచే అలంకరింబడిన కేశములు
మంత్రమయములై మాహేశుని ప్రణ వముతో పలవరించుచున్నవి .
ప్రణవనాదము చేయు తుమ్మెదలను ఆకర్షించగా ఆనంద డోలలూగుతూ ,మన మాంస స్ శరీరములు మంత్రశరీరములగుచున్నవేళ శివ నోమునకు సిధ్ధమగుదాము.
అంబే శివే తిరువడిగళే శరణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...