Sunday, January 8, 2023

AALO REMBAAVAAY-25

 


 పాశురము-25

 ***********

"అఖిలాండ రక్షణముగా చేసితివి మాకొరకై అజ్ఞాతము

 అనవరతకటాక్షముగాద  అవతార రహస్యజ్ఞానము."

ఇరవై ఐదవ పాశురం

*****************

ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్

ఒరుత్తు మగనాయ్ ఒళిత్తు వళర


తరుకిల్లానాంగి తాంతీంగు నినైన

కరుత్తై పిళ్ళైపిత్తు క్కంజన్ వయిత్తిల్


నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై

అరుత్తిత్తు వందోం ; పరై తరుదియాగిల్


తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి

వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!


   ఏకము-అనేకముగా అనుగ్రహిస్తున్న వైనమును గోపికల ద్వారా మనకు తెలియచేస్తున్నది.వారు,

1.మగిళిందు వందోం-సంతోషముగా వచ్చారట

2.శెల్వముం-సేవగమం యాంపాడి-నీ యొక్క పరాక్రమము సంపదను పాడుతూ వచ్చాము.అంటున్నారు.

 వారి సంతోషమునకు కారణము

 ఓర్ ఇరవిల్ అంటున్నారు.

 ఒక రాత్రి వారి సంతోషమునకు కారణమై ప్రకాశిస్తున్నదట.

 బాహ్యమునకు విరుద్ధము.

చీకటి తొలగితే కాని మనము ప్రకాశమును కాంచలేము.కాని వీరికి చీకటి ప్రకాశముగా భాసిస్తూ,ప్రమోదమును కలిగిస్తోందట.

  పైగా మాకే కాదు ఆ ఒకే ఒక రాత్రి,


1.మధురా నగరమునకు సంతోషమును కలిగించినది జన్మస్థానమై.

2.దేవకీదేవికి సంతోషమును కలిగించింది స్వామి నిత్యవిభూతి సాక్షాత్కారముతో.ఎవ్వనిచే జనించు జగము-ఎవ్వని లోపలనుండు.

3.చెరసాలకు సంతోషమును కలిగించినది అచేతనములని మనము భావించు ద్వారగడియలకు చేతనత్వమును ప్రసాదించి

4.నందుని సంతోషపరచినది స్వామి వాహన భాగ్యమును ప్రసాదించి

5.యమునను సంతోషపరచినది స్వామిని స్వాగతించు సౌభాగ్యముతో

6.ఆదిశేషుని సంతోషింపచేసినది స్వామికి ఆఛ్చ్హాదనముగా

7.యశోదమ్మను సంతోషపరచినది-నందుని సతి యా యశోద ముందరనాడెదవు --ప్రారంభమునకు లీలావిభూతిగా.

8.రేపల్లెను సంతోషపరచినది -తాను ఆడిపాడగా 

9.గోకులమును సంతోషపరచినది గోవిందుని చేరి మురియగా.

10.అంతెందుకు మమ్ములను ఏశాస్త్రమును అధ్యయనము చేయని గోపకాంతలను సంతోషపరచినది ఆ 

 ఓరు అరియల్

 ఆ అర్థరాత్రి అంటున్నారు.

బాహ్యమునకు ఎవరిపేరు చెప్పినా స్వామికి ప్రమాదము తలపెడతారనే అమాయకత్వము.

 నిన్నేమని పిలవాలి-నిన్నెవరని కొలవాలి-అన్నీ నీవే అయినప్పుడు అన్న అవతార రహస్యము

 చక్కగా తెలియచేసినది గోదమ్మ.

 స్వామి పిరందు అని జన్మించాడని పాడింది.

 అంటే జననము-అవతారము ఒకటికాదా అనే సందేహమునకు సమాధానము చెబుతున్నారు గోపికలు.

1.పిరందు-అవతారము/జన్మము/

ఏమిటా జన్మమునకు గల ప్రత్యేకత?

పూర్వజన్మ కర్మములను అనుభవించుటకు వాటి ఫలితములను మూటకట్టుకుని తమతో పాటుగా జన్మించుట చేతనులది.

పూర్ణానుగ్రహముతో కరుణను పెద్దమూటగట్టుకొని సంకల్పమాత్రమున సారూప్యతను సంతరించుకొనునది స్వామి ఆవిర్భావము.స్వామి తనమూలతత్త్వమునుండి(నిరాకారతను విస్మరించి) సాకారుడై సాక్షాత్కరింపచేసుకొనిన అదృష్టము ఆ అర్థరాత్రిది.


 సంతోషము స్వామి అవతార రహస్య జ్ఞానము లభించినందులకు అయిన వారిదగ్గర ఇంకను విచారమున్నదట.దానిని పోగొట్టుకోవాలని వచ్చారట.అంతటి జ్ఞానమును ప్రసాదించిన స్వామి అమాయకముగా ఇంతకు మీరు పర కావాలన్నారు అది మీకిస్తే సంతోషమేనా అని అడిగాడు స్వామి వారి మనోభావాలను మరింత స్పష్టము చేయాలని.దానికి వారు

ఓ నెడుమాలే! ఉన్నై

అరుత్తిత్తు వందోం ; పరై తరుదియాగిల్

  నీవు సంసారమనే కంసుని సంహరించినావి భావార్థము.నీ మేనమామ అయిన (శారీరక సంబంధములు అను కంసుని) గుండెలో కుంపటివై భస్మము చేసినావు.

ఓ నెడుమాలే

 నిండుగా వ్యాపించియున్న భక్తవాత్సల్యమా!

  నీ అనుగ్రహము వలనే

1.మేము నిన్ను చూదగలుగుతున్నాము.

2.నీతో మాట్లాడగలుగుతున్నాము

3.నీవిభవమును కీర్తించగలుగుతున్నాము.

4.నిన్ను అర్థించగలుగుతున్నాము.

5.నీ దయచే మేము నిన్నే సాక్షాత్తుగా నిన్నే కోరుదామని వచ్హాము.

 నీవు గొల్లలో గొల్లనిగా,గోవులలో గోవుగా,గోపికలలో గోపికగా మాతో పాటుగా ఆడుతూ-పాడుతూ మునిగితేలని.

"పరను" అనుగ్రహించుట నీ ఇష్టము.

" పరమాత్మనే అనుగ్రహముగా పొందుట మా అభీష్టము".

అని వేడుకుంటున్న గోపికలతో పాటుగా నున్న,

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.







TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...