Wednesday, January 31, 2024

ADITYAHRDAYAM SLOKA-04

  శ్లోకము-03

 *********

 "రామ రామమహాబాహో శృణు గుహ్యం సనాతనం

  ఎన సర్వాన్ అరీన్ "వత్స" సమరేవిజయష్యసి"


 పదవిభాగము

 **********

 వత్స-వాత్సల్య సంబోధనము.

  అగస్త్యునిచే పలుకబడినది రాముని ఉద్దేశించి

 రామ-ఓ అంతర్యామి

 రామ-దశరథ నందన రామ

  మహాబాహో.

 అజానుబాహో-స్వరూపము

 మహాబాహో-సామర్థ్యము

  ఇప్పుడు స్తోత్రఫలితము చెప్పబడుతోంది.

  ఎందుకంటే "ఆదిత్యహృదయ స్తోత్రము"

 గుహ్యత-సనాతనత అను రెండు శుభలక్షణములను కలిగియున్నది.

 శృణు-దీనిని విని-ఆచరిస్తే

 సర్వాన్+అరీన్-సర్వశత్రువులను

  బాహ్య శత్రువులను-అంతః శత్రువులను,

  రావణాసురుడు-బాహ్యశత్రువు

  చింత-శోకమును కలిగించు అంతః శత్రువు

 వీటిమధ్యన జరుగుచున్న సమరములో

 సమరే విజయష్యసి-నీవు విజయమును పొందెదవు.

 ఈ శ్లోకమును స్తోత్ర ఫలశృతిగా పెద్దలు భావిస్తారు.

  విశేషపదములు

  ***********

 వత్స-ఆవుదూడ

   ఆవు శాఖాహారి అయినప్పటికిని తన సంతతిమీదిప్రేమతో దాని మాయను నాకితీసివేస్తుంది.తపోసంపన్నుడైన అగస్త్య మహాముని సైతము "మంత్రోపదేశము" రామునికిచేయుట తనకర్తవ్యముగా భావించియుద్ధస్థలికి వచ్చినాడు.

 గుహ్యము

 'మననాత్ త్రాయతే మంత్రః"

   జపించిన వానిని రక్షించు స్వభావము కలది మంత్రము.సులభము-సురక్షితము-సుగమము-సుభగముకనుక గుహ్యము.

 సనాతనము

 ఎప్పుడు ఆవిర్భవించినదో కాల నిర్ణయము చేలేనిదైనప్పటికిని ఎప్పటికిని నూతనముగానే విరాజిల్లునది.

 మనము కనుక కాలము-ధర్మము అను రెండు అంసములను పరిశీలించినచో,

 కాలము-సత్యము-మార్పులేనిది.కాని,

 ధర్మము-యుగములనుసరించి మారునది.

 సనాతనమంటే ఏ కాలమునందైనను పఠించినచో ఏ ధర్మమునందున్నప్పటికిని సంపూర్ణ ఫలితమును అనుగ్రహించగల శక్తివంతమైన స్తోత్రము.

 తం సూర్యం ప్రణమాయహం.






.

 


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...