Saturday, January 20, 2018

ADIVO-ALLADIVO RAAMAANUJAARYULU


 సంభవామి  యుగే యుగే  సాక్ష్యములు హరి శయనములు
 ధర్మ సంస్థాపనమే  లక్ష్యమైన మన ఆళ్వారులు

 పెరుంబుదూరులో కాంతిమతి కేశవాచార్యులకు
 ఇళయపెరుమాళ్ళుగా ప్రకటితమైనది  ఆదిశేషువు

 కులవ్యవస్థను ఖండించె కంచిపూర్ణుని గురువుగ దలచె
 ఆళ వందార్  విశిష్తాద్వైత  బహుళ వ్యాప్తి చేసె

 అత్యంత గోప్యమనే  అష్టాక్షరి మంత్రమునే
 శ్రీ రంగరాజ గోపురమెక్కి అందరికి ఉపదేశించె

 యమునాచార్య హస్త సంకేతమును  గ్రహించి
 మూడు మంచిపనులతో  ముజ్జగములను బ్రోచె

 నిత్య నిర్గుణ నిరంజనుని  నిరతము మది నిలుపుకొని
 పరమార్థము చాటి రామానుజుడు  పూజనీయుడాయెగ.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...