Tuesday, November 23, 2021

KALIKAMBA NAAYANAAR

కలికాంబ నాయనారు *************** " నీ పాదకమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయసేయకదె" సహజకవి బమ్మెర పోతన. ఆదిశంకరులు అమ్మ వారి పాదరేణువు మహాత్మ్యమును సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తావిస్తూ,ప్రశంసించిరి. అన్నమాచార్చార్యులు సైతము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమురా నీ పాదము అని సర్వాంతర్యామి పాదపద్మములను సన్నుతించిరి. నవవిధ భక్తులలో నాల్గవదైన పాదశేవనము భక్తుని నిరహంకార నిశ్చల మనోసేవలకు ప్రతీకగా అనుకోవచ్చును. సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనసు చపలత్వముతో అటు-ఇటు జరుగవచ్చును /అహంకారమునకు దాసోహమవ వచ్చును కాని,నిండైన విస్తరి నెమ్మదిగానే ఉంటుంది అన్నట్లుగా నిరంతరము శరీరమును మోస్తున్నప్పటికిని,నడుస్తున్నప్పటికిని,పరుగులు తీస్తున్నప్పటికిని లేదా స్థిరముగా నున్నప్పటికిని అన్ని అవస్థలను సమానముగానే స్వీకరిస్తూ,సహనముతో ఉండేవి పాదములు. స్వామి అంఘ్రియుగళ సేవనము సూచిస్తూ శ్రీదేవులపల్లి వారు సైతము, శివపాదము మీద నీ శిరమునుంచరాదా అని , అహంకార-మమకార పోరాటములలో అహంకారము తొలగాలంటే అది మమకారమును ఆశ్రయించవలసినదే.దానిచే ఆశీర్వదించబడ వలసినదే. పాదసేవనమును ప్రముఖ సేవగా స్వీకరించిన వారిలో,పెన్నుగదము లోని కలికాంబ నాయనారు దంపతులు స్వామి కరుణను లోకవిదితము చేసిన వారు. కలిక్కాంబ/కలికంబర్/కలికంబనార్/కలియాంబ/ అను వివిధ నామములతో పిలువబడు పరమశివభక్తుడు.న-కలి-లేనిది.కలి-ఉన్నది. వైశ్యజాతిలో పుట్టినప్పటికిని ఉన్నదానితో సంతృప్తిని చెంది,శివభక్తులను సాక్షాత్తు శివ స్వరూపముగా భావిస్తూ,వారిఉపాధిని ఎంచక ,పాదసేవనమును పరమ భక్తితో చేసేడివాడు. పరమ సాధ్వి అయిన నాయనారు ధర్మపత్ని పాదసేవనమునందు పతిని అనుసరిస్తూ,పాత్రలోని జలమును అతిథిని సాక్షాత్తు పరమేశునిగా భావిస్తూ,పరమ వినయముతో, " పాదయోః పాద్యం సమర్పయామి" అన్న పవిత్ర భావనముతో పూజించేది. మన నాయనారుకు పరమేశునిపై గల ంపరమభక్తియే బలము శివుని లీలకు అది బలహీనముగాను మారుతుంది.కాదనగలవారెవరు కాముని ఆనను. క్రమక్రమముగా కలికంబర్ మనసులో తానే కాక తన కుటుంబము సైతము నిశ్చలభక్తితో పరమేశుని పాదశేనములో పాల్గొనాలనె ప్రగాఢ వాంఛ ప్రబలినది. " అజాయమానా-బహుధా విజాయతే" నిరాకారుడు భక్తులను పరీక్షించుటకై తనకు నచ్చిన నామరూపములను ధరిస్తాడు.తనంతట తానే దగ్గరగా వస్తాడు.భ్రమలను కల్పిస్తాడు.ఉన్నది లేదనిపిస్తాడు.లేనిది అవుననిపిస్తాడు. అదేజరిగింది నాయనారు ఇంటిలో.మధ్యాహ్న వేల అయింది.అతిథి-అభ్యాగతులను అర్చించే సమయమాసన్నమయినది. రానే వచ్చాడు రాగ-ద్వేషములను కలిగించుటకు ,యోగమును నిరూపించుటకు నిటలాక్షుడు. సాదర్ముగా ఎదురేగాడు నాయనారు స్వాగతించుతకు అతిథిని.సాలోచనగా ఆగిపోయింది అతనిని చూసిన గుర్తులను పలక్స్రిస్తూ నాయనారు భార్య. ఒకరిని ఇహము-మరొకరిని పరము ప్రభువు ఆనగా పలకరిస్తున్నది.పలకరిస్తూనే ప్రభావితము చేస్తున్నది. అతిథిని కూర్చుండ్ అబెట్టినారు ఆసనము మీద.పాదములను కింద పీట మీద నిలిపారు. నాయనారు కన్నులకు దేవుడు కనిపిస్తున్నాడు సదాశివునిగా. నాయనారు భార్య కన్నులకు జీవుడు ఉపాధితో సహా కనిపిస్తున్నాడు తన దగ్గర పనిచేసిన సేవకునిగా. మధురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా అంటూ సేవకు ఉపక్రమిస్తున్నాడు కలికంబరు. అథమం శివ వేషం అర్హతలేదులే ఓ మనసా అంటూ నిరాకరణను నిర్ణయించింది నాయనారు భార్య. పరస్పర విరుధ్ధ భావనలు పాదసేవనమునకు ఆయత్తమగుచున్న వేళ అది. పుణ్యము/పాపము చెరో వైపుకు జరుగుతున్న జాము అది. జంగమదేవర జటాధారియై జరుగవలసిన దానిని జరుపుతున్నాడు. " మహాదేవ జగన్నాథ భక్తానాం అభయప్రద పాద్యము గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్దయ గంగాధరాయ నమః పాదయో పాద్యం సమర్పయామి" ప్రసన్న మనస్కుడై పాదప్రక్షాలనమునకై సిధ్ధమయ్యాడు నాయనారు. దాసుని కాళ్లుకడుగుటయా? దానికి ధర్మపత్నిగా నేను జలధారనందించుటయా? ధర్మ సంకటము స్వామి మర్మమును తోసివేసి,కరములను శుభకరములు కానీయటము లేదు. వేచి చూస్తున్నాడు అతిథి.జలధారకై వేచిచూస్తున్నాడు తన పతి.తోచుకోనీయటములేదు పరిస్థితి. అంతే.అహము ఆమెను దాసోహము చేసుకున్నది.పాదపూజలేల యని వాదమును చేసింది. నీలకంఠుని పూజను నిరాకరింప చేసినది. ఇంద్రియములను మందము చేసినది.అదే అనందమనిపించేటట్లు ఆడిస్తోంది. ఆగ్రహము కట్టలు తెంచుకుని వస్తోంది నాయనారుకు భార్య వింతప్రవర్తనను చూసి. అతిథినిసత్కరించమని అనునయిస్తున్నాడు.వాడు మన సేవకుడు.నేను యజమానురాలిని.సేవలను స్వీకరించే అర్హత వాడికి లేదు అన్నది . అంతే.కట్తలు తెంచిన క్రోధము ఆమె కరములను తుంపించేసింది. చేతులారంగ శివుని పూజింపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనముగా నేలకొరిగినది నాయనారు భార్య. వెనుక ముందు ఆలోచించక తానే జలమును పోసి,తానే పాదప్రక్షాలమును గావించి,అర్చించాడు. అర్థనారీశ్వరునికి అర్థాంగి సహిత పూజలను సమర్పించలేకపోయితినన్న దిగులుతోనున్న నాయనారును అనుగ్రహించదలచిన ఆదిదంపతులు ప్రత్యక్షమయి ఆశీర్వదించారు. నాయనారు పాదసేవనాతత్పరతను లోక విదితము చేసిన ఆదిదంపతుల అనుగ్రహము మనలను సదా రక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం.

cheraman nayanar

ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) చిదానందరూపా-చేరమాన్ నాయనారు *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను వీతరాగుడు తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె పశుపక్ష్యాదులు సైతము ప్రశాంతముగ పరవశించె రతిపతిని కాల్చినవానిని రాజు రజకునిలోన గాంచె విశ్వేశ్వరుడీతడేనని వినయ నమస్కారమును గావించె తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్తుడు కానందున వయసురాగానే సన్యసించి తిరువంజక్కళములో శివపూజాదులతో నిశ్చింతగా నుండెను.శివుని ఆదేశమైనదేమో ఆ దేశపు రాజైన సెన్ గోల్ పోరయాను తపోదీక్షను కోరి రాజ్యమును విడిచివేసెను.వారసులు లేనందునప్రజలు మన నాయనారును రాజ్య పాలన చేయమని వేడుకొనగా శివాజ్ఞగాభావించి, స్వీకరించి సుభిక్షముగా నుండునట్లు పరిపాలించుచుండెను. చేరమాను శ్రద్ధాభక్తులకు మెచ్చి, సుందరేశుడు తనశిష్యుడు బాణాపతిరారు ద్వారా ఆశీస్సులను పంపాడు.మనో వాక్కాయ కర్మలను నటరాజార్పణము చేసిన నాయనారును కనకసభనుండి తన మువ్వల సవ్వడితో ఆశీర్వదించెడివాడు.ఒకరోజు మువ్వల సవ్వడి వినిపించలేదు.స్వామికి అపచారము జరిగినదేమో అని చింతించుచున్న నాయనారుతో స్వామి,తాను తన మిత్రుడు నంబి అరూరారు సంకీర్తనములో మైమరచి మువ్వలసవ్వడిచేయుటలో ఆలస్యము జరిగినదని చెప్పగానే కుదుటపడ్డాడు. తనలో లీనముచేసుకోవాలనుకొన్నాడు.దానికి లీలగా సుందరారుని పిలిచి,చేరమాను సుందరారును అనుసరించునట్లు చేసి కైలాసమునకు రప్పించాడు కాని దేవుడు వరమిచ్చినా పూజారి కూడా ఇవ్వాలి అన్నట్లు ద్వార పాలకులు నాయనారును అడ్డుకున్నాడు.వడ్డించేవాడు మనవాడైతే విస్తరి ఎక్కడ వుంటేనేమి అన్నట్లు పరమేశ్వరుడు తన వాహనమైన కరుణా వీక్షణముతో తనదగ్గరకు పిలిపించుకొని లాలించినట్లు మనలందరిని లాలించుగాక. ( ఏక బిల్వం శివార్పణం.) తక్కువ చూపు

SOMASIRA MAARAN NAYANAR

సోమశిర నాయనారు ******* " రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం." శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. " యజ్" అను ధాతువుకు ఆరాధనచేయువాడు/అర్పణమును చేయువాడు అను అర్థమును కనుక గమనిస్తే యజ్ అను కర్త చేయు కార్యమును యజ్ఞముగాపరిగణింపవచ్చును.అగ్నిసాక్షిగా,అగ్ని సహాయమును కోరుతూ,యాగాగ్నిని ఉద్దీపింపచేసి అర్చించే వైదిక కార్యక్రమము. ఇందులో అగ్నిహోత్రుడు మనము అర్పించిన పదార్థములను దైవసమర్పణ మునకు అనుకూలమగు హవిస్సుగా మార్చి వారికి అందచేస్తాడు.వారు హవిస్సును స్వీకరించి ఆశీస్సులతో సుభిక్షమును కలుగచేస్తారు. ఇక్కడ మహేశ్వరత్వమే మహేంద్రత్వము.అది పరిపూర్ణమైనది విరాత్పురుషుని అవయవములే దేవతలుగా మనచే పిలువబడు శక్తులు.మహేశ్వరుడు కరుణాంతరంగుడై కర్తవ్యపాలనకై కొన్ని శక్తులను తననుండి ఆవిర్భవింపచేసి,వాటికి చేయవలసిన పనులను-విధానమును ఆదేశించి,వాటిచే అమలు చేయిస్తున్నాడు.సాధకుల ప్రయత్నములను (యజ్ఞములను) సమర్థవంతము చేస్తున్నాడు .ఈ విషయమును గ్రహించిన జిజ్ఞాసువులు తమ యజ్ఞ హవిస్సులను,తమ మనస్సులను,తమ సాధనలను బీజమైన వానికి-ఫలప్రదము చేయువారికి సగము సగము సవినయముగా సమర్పించుచున్నారు. యజ్ఞప్రక్రియలు బహువిధములు గా భాసిల్లుతూ బహుళార్థ ప్రయోజనములనందించుచున్నవి.అట్టివానిలో ఒకటి సోమరసమును హవిస్సుగా అర్పిస్తూ,వేదమంత్రములతో అగ్నిసాక్షిగా చేయు వైదిక ప్రక్రియ.సోమలతలు ముంజవత పర్వతములో ఆవిర్భవించినవని ఒక దివ్య పక్షి ద్వారా సోమలతలు స్వర్గమునుంది భూ మికి తేబడినవని ఋగ్వేదములో చెప్పబడినది.వీటి ఆకులను అరచేతిలో పెట్టుకుని రసమును తీసి దేవతలకు హవిస్సుగా అర్పించే విధానమును సోమసి అని అంటారు. స-ఉమ-సోమ ఆరాధనా అగ్నికార్యము , " పూర్ణంచమే-పూర్ణతరంచమే అక్షితిశ్చమే-అన్నంచమే" అని చమకము యజ్ఞము యొక్క ప్రశస్తిని వివరిస్తున్నది. అంతే కాకుండా, " శక్వరీరంగుళయో దిశశ్చమే" అంటూ విరాత్పురుచుని వేల్లుగా గా దిక్కులు-విదిక్కులు తమ కార్యములను శక్తితో నిర్వర్తించును అన్న నమ్మకముతో సోమసి యజ్ఞమును నిష్కళంక మనముతో నియమానుసారముగా నిర్వర్తించు, సోమశిర నాయనారు, తిరువంబారులోని బ్రహ్మణ కుటుంబములో జన్మించెను.బ్రహ్మజ్ఞాని కనుక ప్రతిఒక్కరిలో బ్రహ్మమును దర్శించగలవాడు. మారన్ అను నామాంతరమును కలిగిన నాయనారు సోమసి అను యజ్ఞ/అగ్నికార్యమును అనన్య భక్తితో నిత్యము సలుపుటచే సోమసి/మన తెలుగులో సోమయాజిగా ప్రసిధ్ధికెక్కెను. సోమసి యజ్ఞ అనుగ్రహముగా పరిసరములు పరిశుభ్రమై,పర్యావరణము రోగనిరోధక శక్తితో రాజిల్లుచుండును. భూమాత అన్నముతో పాటు ఔషధములను కూడ అత్యంత అధికస్థాయిలో ఉత్పత్తి చేసే సామర్థ్యమును కలిగి ఉంటుంది.తత్ఫలితముగా అకలిదప్పులు అగుపడని ఆనందము అన్యాయమును-అపార్థములను దరికి రానీయదు. సోముని శిరమున ధరించిన వాని కరుణ మన నాయనారుని సుందరారుతో జత చేసింది.జనులను చైతన్యవంతులను చేసింది. సొమశిర నాయనారు కులవ్యవస్థను ధిక్కరించటం అప్పటి ఛాందసవాదులకు నచ్చలేదు.వారిని నమ్మించదలచాడు నాయనారు ద్వారా పరబ్రహ్మము.సుందరారు అరోగ్యమును సహకరించనీయలేదు. వారు నాయనారును పరీక్షించదలచి,యజ్ఞహవిస్సును పరమేశ్వరునికి నాయనారు తమ సోమసి ద్వారా అర్పించగలిగితే సర్వజనుల సమానత్వమును అంగీకరిస్తామన్నారు , కాదు కాదు అనిపించాడు అర్థనారీశ్వరుడు. అత్యంత భక్తితో ఆదిదేవునికి హవిస్సును అర్పించాడు నాయనారు.అంబతో సహా ప్రత్యక్షమై అందరిని అనుగ్రహించారు ఆదిదంపతులు. శివాజ్ఞ మేరకు శివచింతనతో నుండి అంత్యమున శివసాయుజ్యమును పొందిన మన నాయనారుని ఆశీర్వదించిన ఆదిదంప తులు మనలనందరిని అనిశము రక్షించెదరు గాక. అంబే శివే తిరువడిగలే శరణం ఏక బిల్వం శివార్పణం

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...