HAPPY INDEPENDENCE DAY

72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ******************************************** శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక . అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము మడమతిప్పుటెరుగని మన నాయకుల వ్యూహము భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ "తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను కశ్మీర సిందురమే" కాషాయపు రంగు." ******** బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా "వందేం అహింసా పరమో ధర్మ:" అను శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు". ********* పంచభూతములు శుచిగ, పంచభక్ష్య రుచులుగ కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా "సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను పచ్చతోరణపు కుచ్చు, మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు." ************ నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో జనగణమన గళముతో, జనగణముల మంగళముతో "జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో కన్నులపండుగగా కశ్మీర ప్రాంగణములో కోటలలో పేటలలో కోటి కోటి కాంత...