ADITYAHRDAYAMU-14
ఆదిత్యహృదయము-14 *************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ****ఆతపీ మందల మధ్యస్థునిగా పరమాత్మను ప్రశంస్తూ,స్వామి విశ్వరచనా దక్షతను ఉత్తర-దక్షిణ అయన మార్గ సంచారమును వివరించిన,మహర్షి, ప్రస్తుత శ్లోకములో స్వామివిశ్వర రచనా వైభవమును,తన పర-వ్యూహ-విభవ-అర్చా-అంతర్యామి స్వభావ మును లోకవిదితము చేయుచున్నారు. శ్లోకము ******* 'నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి "ద్వాదశాత్మం నమోస్తుతే". ప్రస్తుత శ్లోకము నమోస్తుతే ఓ ద్వాదశాత్మన్ అంటూ, సూర్యభగవానుడు తన శక్తులను పన్నెండు విభాగములుగా ఏర్పరచి /వ్యూహరచనను చేసి,తద్వారా తన విభవమే సమస్తముగా మలచి,వానిలో తాను అంతర్యామియై,ప్రత్యక్ష అర్చనమునకు అనుగ్రహిస్తూ,అర్చామూర్తియై ఆరాధనములను అనునిత్యము గ్రహిస్తూ,మనలను అనుగ్రహిస్తున్నాడు. అనుసరిస్తూ,గ్రహించే అంతరిక్ష శరీరధారులే గ్రహములు.గోళాకారమును కలిగిన తొమ్మిది ముఖ్యగ్రహములు సూర్యలేక ఇతర నక్...