Posts

Showing posts from November 11, 2020

MEEDHUSTAMA SIVATAMA-16

    మీడుష్టమ శివతమ-16   **********************     న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.    ఆలోచనలో పడ్డాడు సాధకుడు.ఈ రుద్రుడు ఎంత చమత్కారి.ప్రతిదానిని తన చమత్కారముతో సమర్థిస్తు సత్యమునేచెప్పానంతాడు.అల అంటాడు-జలమంతాడు.రెండింటీ చేరువేరుగా భావించమంటాడు-భాషించమంటాడు-భాసించమంటాడు.   అల సముద్రము లోనిదే.జలము సముద్రము లోనిదే.అయినప్పటికిని సముద్రములోని జలము కెరటమై కొత్తరూపుదిద్దుకుని ఘోషిస్తూ ఉప్పొంగుతు ఉరకలువేస్తూ తీరమువరకు వస్తున్నది.తీరమును తాకగానే జలముగా మారి కడలిలో కలిసిపోతున్నది.తీరమును చేరగానే దాని నామరూపములు శబ్దములు సమసిపోయాయి ఎందుకంటే అదితీరమును దాటిరాలేని అసహాయురాలు.అయితే ఈ కడలి అలకు నా అభ్యర్థనకు కల సంబంధమేమిటి?నడుస్తూ నడుస్తూ తీరానగల జిలేబి కొట్టుదగ్గరకు వచ్చాడు సాధకుడు."న అమిత్రంచమే-అభయంచమే" అనికదానేను అర్థించాను.సరేనన్నాడు సాధనచేయమంటున్నాడు.   సరైనసమయమిదేనని సాక్షాత్కరించాడు రుద్రుడు.ఆవేశపడలేదు-ఆరోపణలు చేయలేదు ఈసారి సాధకుడు.అసలు రుద్రుడేమిచెబుతాడోచూడాలి అనుకుంటూన్నాడు.చమత్కారి కద చంద్రశేఖరుడు.జిలేబి బండి ద...

MEEDHUSHTAMA SIVATAMA-15

   మీడుష్టమ శివతమ-15 *********************  న రుద్రో రుద్రమర్చయేత్.  ఎవరెవరు ఎటువంటి వారో పరికించి-పరిశీలించి-పరీక్షించి పట్టికను సిధ్ధము చేయాలి.రుద్రునికి రాగానే అందించాలి.అభయమును పొదాలి అనుకుంటు ఫలానా వాడుకదా నామీద ఈర్ష్య పడతాడు.ఫలానా వాడుకదా నా మాటలు కోతలు అన్నాడు.ఫలానా వాడుకదా నా ముందు మంచిమాటలు మాటాడి,నా వెనుక విమర్శించినది.ఒక్కొక్కడిని కలిసి -కూపీలు లాగి-నాపైగల వైరభావమును తీర్మానిస్తాను అంటూ కదిలాడు సాధకుడు.  ముందరగా పక్కింటువాడిని కలవటానికి వాడి గుమ్మము దగ్గరికి వెళ్ళాడో లేదో అక్కద రుద్రుడు త్రిశూలధారియై కావలికాస్తున్నాడు.నన్ను లోపలికి అనుమతించుట లేదు.అదేదో గారడిచేసాడువాడు అనుకుంటూ ఎదురింటికి వెళితే అక్కద రుద్రుడు త్రిశూలధారియై కావలి కాస్తున్నాడు.ఎక్కడికెళితే అక్కద రుద్రుడు అడ్డుపడి వారిని కలిసి మాట్లాదనీయడములేదు.ఏదో మాయలా ఉంది.నాతో సరేనంటాడుకదా అలాగే వారితో కూదా సరేననింటాడు.నాకు పనిని అప్పగించి  కానీయౌండా అడ్డుపడుతుంటాడు.ఆరితేరిన మోసగాడు వాడు అంటూ అల్లకల్లోలమైన మనసుతో అలల తీరములో నడుస్తున్నాడు సాధకుడు.కనుకనే నేను వితరణగా వరములనిస్తానని వికిరిద అని స...