Posts

Showing posts from January 10, 2026

TIRUPALLI ELUCHCHI-08

Image
     తిరుపళ్ళి ఎళుచ్చి-08    ****************   "కృపాసముద్రం  సుముఖం త్రినేత్రం    జటాధరం పార్వతీ వామభాగం    సదాశివం  రుద్రం అనంతరూపం    చిదంబరేశం హృది భావయామి"   సందర్భము   ********    ఆత్మనాథుని దర్శనభాగ్యమును పొందిన సౌభాగ్యవతులు మంగళనాథుని దర్శించుకుంటున్నారు.ఆత్మావలోకనముతో "బాహ్యాభ్యంతరస్థితుడైన" పరమాత్మ ఉనికిని తెలుసుకోగలుగు ఉపాధికి మంగళాశీస్సులు లభించుచుచున్నవి.    ఎళుచ్చి    ******అదుపళచువ ఎన అముదెన అరిదర్కు అళిదెన ఎళిదెన అమరరుం అరియార్ ఇదు అవన్ తిరువురు ఇవన్ అవన్ ఎనవే ఎంగళై ఆండుకొండు ఇంగెళుందు అరుళం మధువళిర్ పొళి తిరు ఉత్తరకోశ మంగై ఉళ్ళాయ్ తిరుపెరుంతురై మన్నా ఎదు ఎమ్మై పనికొళ్ళుం ఆరందు కేట్పోం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె ....... ఉత్తర కోశ మంగళనాథర్ పోట్రి ************************** అరుణగిరినాథర్ తో పాటుగ్ అ మాణిక్యవాచగరు చే ప్రస్తుతింపబడిన, మంగళాంబ సహిత మంగళనాథుని కోవెల తమిళనాడులోని పరమక్కడి సమీపములో పాండ్యరాజులచే నిర్మింపబడినది.ఈ దివ్య క్షేత్రము ఉత్తరకోశ గా ప్రసిధ్ధిచ...