Posts

Showing posts from January 9, 2018

JAI SREEMANNAARAAYANA-30

Image
 వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై  తింగళ్ తిరుముగత్తు చేయిడైయార్ శిన్రిరైంజి  అంగప్పఱై కొండవాత్తై అణిపుదువై  ప్పైంగమల త్తణ్డెరియల్ బట్టర్పిరాన్ కోదైశొన్న  శంగత్ తమిళ్మాలై ముప్పదుం తప్పామే  ఇంగిపరిశురై పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్  శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాత్  ఎంగుం తిరువరుళ్పెత్తు ఇంబురువ రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-30 అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది. శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము. పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను ...

JAI SREEMANNAARAAYANA-29

Image
 శిత్తం శిరుకాలే వందు ఉన్నై  చ్చేవిత్తు ఉన్  పొత్తామరై యడియే పోట్రుం  పొరుళ్ కేళాయ్  పెత్తం మెయ్ త్తుణుం కులత్తిల్ పిఱందు నీ  కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు  ఇత్తైపఱై కోళ్వాన్ అన్రుకాణ్ గోవిందా  ఎత్తెక్కుం ఏడేడ్ పిఱవిక్కుం ఉందన్నోడు  ఉత్తోమేయావోం ఉనక్కే నామాళ్ చెయివోం  మత్తైనం కామంగళ్ మాత్తు ఏలో రెంబావాయ్.  ఓం నమో నారాయణాయ-29 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది పశువులు మేసిన తరువాతనే తాము భుజించెడివారైన మన గోపికను కలుపుకొనిన శ్రీ విల్లిపుత్తూరు గోపికలలో పాలు-పెరుగు-వెన్న-నెయ్యి రూపు మారిన పాలైన కొద్ది కొద్దిగ తమ మనసును దిద్దుకొనుచున్న గోపికలలో తామర పూసల మాలికలు గళమున ధరించిన వాడైన తామర నేత్రును కొలిచిన నారాయణత్వములో "వంగక్కడల్ కడైంద" మాధవ-కేశవ చింతనమైన అటు-ఇటు ఏడుతరములను కూడమంటున్న గోపికలలో పరాన్ముఖము ప్రత్యన్ముఖమగు పడతులార రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె భావము సర్వేంద్రియములు భక్తిభావముతో నిండిపోయి, సర్వస్య శరణాగతి ప్రకటనమే గోప...

JAI SREEMANNAARAAYANA-28

Image
 కఱ్వైగళ్ పిన్ శెన్రుకానం శేరుందుప్బోం  అఱివొన్రు మిల్లాద ఆయుక్కులత్తు ఉందన్నై  ప్పిఱవి పిఱందనై పుణ్ణియం యాముడయోం  కుఱైవొన్ఱు మిల్లాద గోవిందా! ఉందన్నోడు  ఉఱవేల్ నమక్కు ఇంగొళిక్క ఒళియాదు  అఱియాద పిళ్ళైగళోం అంబినాల్ ఉందన్నై  చ్చిఱుపేరరైత్తనవుం  శీఱి యరుళాగే  ఇఱైవా ! నీ తారాయ్ పఱై యేలోరెంబావాయ్    ఓం నమో నారాయణాయ-28 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది నల్లనయ్య పుట్టిన గొల్ల వంశములో పుట్టినామన్న పున్నెమున్నవారైన కల్ల-కపటము తెలియని అల్లరి రేపల్లె గోపికలలో " కఱ వైగళ్ పిన్ శెన్ఱు కానం" అని అంటున్న వారైన "అంబినాల్" దూరముగానుంచుట కుదరదంటున్న గోపికలలో "గోవింద-గోపాల "అని చిన్న చిన్న పేర్లతో పిలుచుచున్న వారైన వీళ్ళా! అని చిన్న చూపు చూడకూడదంటున్న గోపికలలో "అనన్య శరణత్వం-ఉపాయత్వం-భోగత్వం" అకారత్రయమైన సర్వస్య శరణాగతినొందిన శుద్ధ సత్వ గోపికలలో రాసలీలలాడుదాము రమణులారా రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె. భావము గోపికలు శ్రీకృష్ణునితో గొల్ల కులములో పుట్టిన...