NA: PRAYACHCHAMTI SAUKHYAM.

నః ప్రయచ్చంతుంసౌఖ్యం-09 *********************** ఓం కులాలేభ్యః నమోనమః. _____________________________ మృత్తిక-కుమ్మరి చక్రము-మట్టిపాత్రలు-కుమ్మరి అన్ని తానైన పెద్ద కుమ్మరికి నమస్కారములు. ముజ్జగములను మృత్తికను,కాలభ్రమణమనే చక్రమున బంధించి,తన హిరణ్య బాహువులతో బహు సుందర పాత్రధారులుగా మలచి,ప్రాణశక్తి అను అగ్నితో దానిని కాల్చి,లీలా వినోదమును తిలకించు గొప్ప కుమ్మరి ఆ గౌరీపతి.ఏ కుండకు ఎంత జీవనమో తెలిసినను ఏమితెలియనట్లుండు బహు చమత్కారి.ఏ జీవి రూపము ఎన్నేళ్ళో,ఏ కుండ పనితనము ఎన్నాళ్ళో.ఎవరు చెప్పగలరు? క్షీరసాగర మథనంబున జనించెను హాలహలము అతి భీకరమై క్షీర లింగేశ్వరుడు తన గళమున ధరించెను అది శ్రీకరమై. గరళ ధరుని కరకమలములు కొలిచిన వారి కరతలామలకములు. అని నిరంతర నామస్మరణతో సంతుష్టుడై ఉండెడివాడు. చిదంబర ప్రాంతములో ఒక కుమ్మరి శివభక్తుడు ఉండేవాడు.నిరంతర శివనామ స్మరణము పలుకుచు,స్వామి హాలాహల భక్షణము గురించి,తన్మయత్వముతో తనతోటి వారికి వివరించుచు తరించుచుండెడివాడు ...