Posts

Showing posts from March 29, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SAPTASAPTIMAREECHIMAAN)-10

Image
  ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥   పూర్వభాగ పరిచయమును ముగించుకొని,ప్రస్తుత శ్లోకము నుండి మనము ఆ పరమాత్మ యొక్క నేకానేక గౌణ నామములద్వారా జగత్పాలనా విశషములను అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.  ఆదిత్యుడు,సవితుడు,సూర్యుడు,ఖగుడు,పూషుడు,గభస్తిమానుడు,హిరణ్యసద్రుశుడు,భానుడు,సువర్ణరేతస్సుడు,దివాకరుడు అనే నామ ప్రాశస్త్యము వివరింపబడుతోంది.  ఆదిత్య నమోనమః   ...............  దితి ఖండింపదగినది.విడదీయబడునది.దానికి విరుద్ధముగా అఖండముగా అవిభాజ్యముగా నున్నది అదితి.అదియే అఖండము.  అదియే "ఆత్మజ్ఞానము-అసలు వీడనిది."స్థిరముగా మనలో నిలిచి మనలను ఉద్ధరించునది.దానిని అనుగ్రహించువాడే ఆదిత్యుడు.  సవితః నమోనమః  .............  సువి ప్రాణ సవిత.ప్రసవము అని మనము ఉపయోగించు పదము సవితాశక్తియే.సృష్టి చేయుటకు,విస్తరించుటకు అనుకూలమైన సూర్యశక్తియే సవిత అని గౌణనామముగా ఉపయోగించబడుతున్నది.  సూర్య  ......  సువతి రమయతి సూర్య అన్నది ఆర్యోక్తి.సుష్టు ఇరయతి సూర్యః.వాయు సంచారమునకు తగిన ఉష్ణమును అందించువాడు సూర్యుడు...