Friday, March 16, 2018

SAUNDARYA LAHARI-46


  సౌందర్య లహరి-45

 పరమపావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 బిందువుగా  సృష్టి ప్రారంభమును కేంద్రీకరిస్తూ
 దయా సింధువుగా  పంచభూత తత్త్వముతో  వ్యాపిస్తూ

 శ్రీచక్ర సింహాసినివై  ఋతువులను  ఋతముచేస్తూ
 సర్వకాల సర్వావస్థలలోను నీ అస్థిత్వమును ప్రకటిస్తూ

 జగములను మోడుబారనీయని తోడునీడగా వీడక
 అండ-పిండ బ్రహ్మాండములలో నిండిన అండవని తెలియక

 జనన- మరణములు చర్విత చరణమగుచుండగా
 శిశిరమైన చిత్తమునకు  చైత్రము నీవైన  వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

' " మృణాల మృదుదోర్లతా' అనియు," బిసతంతు తనీయసీ " అనియు శ్రీ లలిత సహస్ర నామములలో తల్లిని కీర్తిస్తారు.మృణాలము అంటే తామరతూడు.తామరతూడు కంటే మృదువైన మృదుత్వము కలవి అమ్మ చేతులు.అందుకే అవిఆశ్రిత మందారాలు.ఇక్కడ మన సుషుమ్నా నాడి షట్చక్రములనెడి పద్మములతో ప్రకాశించుచు,ఇళ-పింగళ నాడులు రెండు రెండు చేతులుగా మనలకు ఆధారమగుచున్నవి.సుషుమ్నా నాడి అను పద్మభరిత కాండమునకు గల రెండు మృదువైన కొమ్మలు.నయన మనోహరముగా జడమునకు జీవనము ప్రసాదించుతల్లి నిత్య వసంతమే కదా.పచ్చదనమైన తల్లి బిందు వాసియై,ప్రపంచ వృత్తమున ఋతువులనే నిజమును (ఋతమును),సంచరింపచేయుచు.సదా రక్షించుచున్న వేళ,నా మనసులోని శిశిరము అనే దిగులు మాయమై,నీ దివ్య సందర్శన చైత్రము లభించిన సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...