RENDAVAMAJILEE-SARVAASAA PARIPOORAKAMU AMTE?

" షోడశ కళానిధికి షోడశోప చారములు జాడతోన నిచ్చలును సమర్పయామి" పరమేశ్వరి అనుగ్రహముతో ప్రయాణికుడు ఒక అంతస్తు అక్కగలిగాడు.చాలా అందమైన వికసిస్తున్న పదహారు రేకులతో గుండ్రముగా ఉన్నది ఆ ఆవరనము."సర్వాశా పరిపూరక చక్రము" అని దానిపేరు అనిచెప్పారు.అక్కడచేరిన వారికి పదహారు శక్తులు అన్ని కోరికలను తీర్చి ఆనందమయులను చేస్తారట. అణిమ సిద్ధి దేవత అహంకారమును ఏ వొధముగా తగ్గించుకోవాలో తెలియచేస్తూనే,అణూరణూనాం" అంటూ అణువు యొక్క గొప్పతనమును వివరించింది.అంతే కాక లఘిమా సిద్ధి అని శక్తిమాతను తోడుగా పంపించింది సహాయానికి.సర్వద్రావిణి అను ముద్రాశక్తి సైతము నన్ను సంస్కరించుటకు తాను వచ్చింది. ఇంతకీ ఇప్పుడు నా స్థూలదేహము నిద్రలోకి జారుకుంది.ఏమిచేయాలో తోచని నామనసు ఇప్పుడు సూక్ష్మదేహముతో జతకట్టి ఎన్నెన్నో అందమైన కలలను కంటున్నది అనుకుంటున్నాడు ఆ ప్రయాణికుడు తన మజిలీలో.ఇది స్వప్నావస్థ అన్నమాట.ఎన్నెన్నో వింత అనుభూతులు.కాని,తెల్లవారగానే మెలకువ వచ్చింది.కల కరిగి పోయింది.అదే జీవితము. చుట్టు తేరిపారచూశాను.పదహారు మంది మాత్రుమూర్తులు నన్ను పలకరిస్తున్నారు. ఇప్పుడు నా నడక విధా...