Posts

Showing posts from February 2, 2026

ADITYAHRDAYAMU-15

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-15  *********************   ప్రార్థన   "జయతు జయతు సూర్యం- సప్తలోకైకదీపం   కిరణసమిత  పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యవర్ణం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  *******  ఆకాశాధిపతి ప్లవంగము( దక్షిణదిశ వైపునకు)వలెదుముకుతూ,వేదవేద్యుడై,వేదపూజ్యుడై,కరుణ నిండిన కరిమబ్బులతో వర్షములను గురిపిస్తూ,జలములను సమృద్ధి పరచుచున్నాడన్న,అగస్త్యుడు,  ప్రస్తుత శ్లోకములో సూర్యమండలమును సంకీర్తిస్తూ,పరమాత్మ పింగళ వర్ణుడై ఉత్తరాభిముఖుడై,ఉత్తర దిశగా తన గమనమును సాగిస్తూ,అనురక్తితో విశ్వ నిర్మాణమును స్థితి సంహారములను గావిస్తున్నాడో వివరిస్తున్నారు. అదియే మండల విన్యాసము.సామూహిక శక్తుల సమన్వయము.  శ్లోకము  ******  " ఆతపీ మండలీ మృత్యుః పింగళః  సర్వ తాపనః    కవిః విశ్వో మహాతేజః రక్త సర్వ భవోద్భవః."   భవిష్యోత్తర పురాణము శ్రీకృష్ణార్జున సంవాదముగా,  " యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం    ఉత్పత్తి రక్ష ప్రళయ ప్రగల్భం    యస్మిన్ జగత్ సంహర లేఖనంచ    ...