Posts

Showing posts from August 7, 2018

MAARGABAMDHU STOTRAMU

  భవానీ సమేతం- భజే మార్గ బంధుం *********************************************   శంభో శివా ప్రాపు నీవు   దయా సింధో నా దారి చూపు   శంభో మహాదేవ దేవా   శివా శంభో మహదేవేశ శంభో  ...........   తరిమింది జాబిలిని శాపం   తలదాచుకొమ్మంది కరుణా సముద్రం   సిగపూవునే  చేసింది   మార్గం   భవానీ సమేతం -భజే మార్గబంధుం..భజే మార్గబంధుం   ............   తాగినది విషజ్వాల సర్పం   వెన్నంటి నడిచింది  హరుడే  సమస్తం   ఆభరణమునే  చేసింది మార్గం   భవానీ సమేతం-భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.   ........    తొలగినది భవబంధ పాశం    కరుణించె నను కోటి సూర్యప్రకాశం    మమేకమే  చేసినది మార్గం    భవానీ సమేతం -భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.       ( ఏక బిల్వం శివార్పణం.)   నిర్హేతుక కరుణ మార్గబంధు స్తోత్రమును వినిపించి,నన్ను కలముగా మలచుకొని పై స్తుతిని వ్రాసుకొనినది.  అద్వైత సిద్ధాంతమును అవగతము చేసికొ...