Friday, December 31, 2021

PASURAM-16

నూతన సంవత్సర శుభాకాంక్షలు ------------------------------ తిరు చిట్రంబలం-పాశురం-16 ************************** మున్ ఇక్కడలి చురుక్కి ఎళందుడియాళ్ ఎన్న తిగలైదెమ్మ ఆరుడయాల్ ఇట్టడియన్ మిన్ని పొళందె ఎం పిరాట్టి తిరువడిమేల్ పొన్నం చిలంబర్ చిలంబర్ తిరుప్పురవం ఎన్న శిలై కులవి నందమ్మై ఆరుడయాళ్ తన్నిల్ పిరవళా ఎణ్ కోమణ్ అంబర్క్ మున్ని అవళ్ నమక్కు మును శురుకు ఇన్నరుళే ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్ ----- " ఆనందామృతాకర్షిణి-అమృత వర్షిణి హరాది పూజితే శివే భవాని పోట్రి" సలిలం వర్షయ వర్షయ "ఒరురకాల్" పాశురములో తనను తాను ఆవిష్కరించుకొనుటకు అంతర్ముఖమైన చెలి,అమ్మ అనుగ్రహముతో అమృతాకర్షిణియై-ఆనందామృత వృష్టిలో మునిగి పులకించినదై,తాను పొందిన దివ్యానుభవమును తన చెలులకు సైతమును అందింపచేయుతకై బహిర్ముఖమైనట్లున్నది. కనకనేతన చెలులతో చెలులారా! రండి రండి.మనమందరము, ఎన్నపొళయాయ్ ఎన్నగలేని/ఎంచలేని మళయేలో-వర్షములో రెంబావాయ్-మునకలు వేస్తూ/మునిగితేలుదాము అంటూ పిలిచినది. బయట నున్న చెలి బాహ్యములోని బహిరాకాశమును చూస్తూ తన అనుభూతిని వివరిస్తున్నది. బాహ్యమును అధిగమించిన వేళ నీవు/మనము /మన హృదయములలోని దహరాకాశము కురిపిస్తున్న అమృత వర్షములో తడుస్తూ-తరిద్దాము అంటున్నది. నామ-రూపములు ఒక్కటే అయినప్పటికిని,జీవునకు అందించు అనుగ్రహములు అనేకములు. వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా ఇది బాహ్యము. వానల్లు కురవాలి వామదేవుడా వ్యామోహం తొలగాలి మనకు జీవుడా ప్రస్తుత పాశురమును తిరుమాణిక్యవాచగరు, మున్నై కడలి సురుక్కి ఎళుందురాయ్ అన్న వాక్యముతో ప్రారంభించారు. తాదాత్మ్యస్థితికి కించిత్ దూరముగా నున్న చెలి తన చెలులతో , నేను చూస్తూ గమనిస్తున్నాను ఈ వింతను. ఇప్పుడే సూర్య కిరణములు నింగి నుండి కడలిని ప్రవేశించి , సురుక్కి-నీటి స్థూల పరిమాణమును తమ వేడితో తగ్గించి వాటికి ఆవిరి అను కొత్తరూపమును అందించినవి. సముద్రజలము తాను సూక్ష్మరూపముతో నింగివైపునకు,/ఊర్థ్వముఖముగా తన పయనమును సాగించుటకు సిధ్ధమగుచున్నది . అనగానే మరొక చెలియ దానిని సమర్థిస్తూనే తనకు కలిగిన ఆలోచనను ఇది కూడా సమజసమేనేమో అంటూ, శివశక్యైరూపముగా నున్న పరమాత్మ మన కొరకు కరుణకిరణములుగా మారి ,భవసాగరమనే సంసారములో నున్న మనలను ఉధ్ధరించుటకు ఇందులోని మాలిన్యములను కరిగించివేసి,మన మనసులను తేలిక చేసి ,మన కుండలినిని జాగృతము చేస్తూ మనలను సహస్రారము చేర్చుటకు సిధ్ధపరుస్తున్నదేమో అన్న పూజ్యభావము కలుగుచున్నది అనగానే చెలులందరు మరింత ఉత్సాహముతో , మళైంద-మళైంద అంటు సలిలం వర్షయ వర్షయ వర్షయ అని ఆకాశమును మరికొంత నిశితముగా పరిశీలిస్తూ,వారి అనుభవములను/అనుభూతులను పరస్పరము పంచుకుంటున్నారు. వారి బాహ్యనేత్రములు దర్శించుచున్న దృశ్యములే వారి దహరాకాశములో దివ్యమంగళ స్వరూపమైన,అమ్మ ఇట్టడియన్-సన్నని నడుమును తిరువడిమేల్-దివ్యపాదపద్మములను తిరుప్పురవం-మంగళతోరణముల వంటి కనుబొమలను మేఘముగా-మెరుపుగా-హరివిల్లుగా దర్శనమిస్తూ,వారిని తన్నిల్ పిరవిళా-అమ్మ భావన నుండి విడదీయలేని వారిగా అదియును, అంబర్కు తన్నిల్ పిరవిళా-ప్రేమయను పాశముతో కట్టబడి విడదీయలేని వారిగా అమ్మ చేతులలో ఒదిగిపోయి మురిసిపోయే అమృతవర్షమును కురిపిస్తున్నది వారిపై అమ్మదయ. వారు సంభాషించుచుండగా ఆకాశములో ఉరుములు ఉరుముతున్న శబ్దమును వినగానే ఒక చెలి భయముతో తన చెవులను మూసుకొని,వేరొక చెలిదగ్గరకు చేరగానే,ఆమెను అనునయిస్తూ, చెలి! ఒక సారి నీహృదయములోనికి తొంగిచూడు. మన తల్లి మన శ్రవణేంద్రియమును అనుగ్రహించుటకై తన, తిరువడివేల్ పొన్నం శిలంబ శిలంబ మనలను ఆహ్లాదపరచుటకై తన దివ్యచరణారవిందములకు అలంకరిం పబడి ధన్యతతో కీర్తించుచున్నబంగరు మువ్వలసవ్వడిని మనకు వినిపించుచున్నది అని దహరాకాశమును దర్శించమంటున్నది. ఉరుమును తరుముతూ ఆకాశమున కనబడిన సన్నని మెరుపును చూడగానే కొంచము అంతర్దర్శనమును చేయుట ప్రారంభించినందులకేమో వారికి ఆ మెరుపు మెరుపుగా మాత్రమే కాక, మిన్ని పొళందె-ఆకాశములోని మెరుపు ఇట్టిడియన్-అమ్మ నడుముగా లక్షరోమ లతాధార తా సమున్నేయ మధ్యమా గా దర్శనమిచ్చింది. ఎంతటి భాగ్యశాలులు వారు.కనుకనే వారు మేఘము-మెరుపులో పార్వతీపరమేశ్వరులను దర్శించగలిగారు. పునీతులైన వారి మనోనేత్రములకు అవ్యాజానుగ్రహము అందమైన హరివిల్లై హర్షాతిరేకముతో ముంచివేసినది.నిజమునకది హరివిల్లా అవునేమో.కాదు కాదు అంతకు మించిన అనుగ్రహమేమో. మంగళతోరణములైన అమ్మ కనుబొమ్మల కళలవి. తిరుపురవం ఎన్న శిలై కులవి. అనగానే నిజమే చెలి ఇది అంబరవర్షముకానేకాదు. మన మదిలో కదులుచున్న సంబరవర్షము అని మురిసిపోతూ చెలులందరు సంతోషముగా శివనోము నోచుకొనుటకు కదులుచున్నారు. అంబే శివే తిరువడిగలే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...