KRSHNAM VAMDE JAGADGURUM

కృష్ణం వందే జగద్గురుం ************************* కృష్ణా నేను .ముస్తాబు చేయగలుగు కస్తూరిని కాను వక్షస్థలమందున్న కౌస్తుభమును కానేకాను సఖ్యత శిఖి చేరగ బర్హిపించమును కాను ముక్కు చివరి చక్కని ముత్యమును అసలుకాను .చల్లదనమును అందించగ చందనమును కాను వేణువునై నినదించగ వెదురును కానేకాను బెదరగొట్ట సేనల పాంచజన్యమును కాను చెదరని భక్తిగల పాంచాలిని అసలు కాను ఆరగింపును అందించిన అరటితొక్కను గాను అడిగి ఆరగించిన అటుకులు కానేకాను మిన్నతనము కన్నులుంచ మన్నైనా నేగాను వెన్నుడవని వెల్లడించ వెన్నపూస అసలుకాను ఉల్లము ఝల్లనిపించిన గోవర్ధన నగముగాను గజ్జెలు ఘల్లనిపించిన కాళియమర్దనము కానేకాను ద్వంద్వ యుద్ధము అందించిన జాంబవంతుడిని కాను ద్వాదశిఫలమును పొందిన అంబరీషుడిని అసలుకాను సూచనతో స్తుతియించగ శాంతనవుడిని కాను సూటిగా కీర్తించ సూరదాసుని కానేకాను ...