Friday, October 15, 2021

AMMA KAAMAAKSHI TAAYI-11

శ్రీ మాత్రే నమః ******************* ఎత్తనై జననం ఎడుత్తేనో తెరియాదు ఇబ్బూమి తన్నిలమ్మా ఇనియాకిలుం కృపై వైతెన్ని రక్షియుం ఇని జననం ఎడుత్తిదామల్ ముక్తితర వేణుమేన్ ఉన్నయో తొళుదునాన్ ముక్కాలం నంబినేనే మున్ను పిణం తోణాదా మణితరై పోలనీ ముళితిరుక్కదేయమ్మా వెట్రిపెర ఉన్మీదిల్ భక్తియాయ్ సొన్నకవి విరుత్తంగళ్ పడినుండ్రియుం విరుప్పముడ నీకేట్టి అళిదుడుం శెల్వత్తె విమలనార్ ఏసపోరార్ అత్తరిడ వాగత్తె విట్టువందెన్నరుం కురైగళై తీరునమ్మా అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. ****************** 11ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. విరుత్తములోని పదవ భాగములో కామాక్షి తల్లి భక్తుని కోరికను తీర్చదలచి,హంసవాహినియై ముందుకు వచ్చి నిలిచి సాక్షాత్కరించినది.సాధకునిలో సత్వగుణము ప్రచోదనమైనదేమో,త్రికరణ శుధ్ధుడై అమ్మను అర్చించుచున్నాడు. "పాలించు కామాక్షి పావని పాపసమని" అని ప్రస్తుతించుచున్నాడు. తల్లీ నీవు సుజనులకెల్లా సంతోష ప్రదాయినివి(ఇహములో) మనోరథప్రదాయినిగా పేరుపొందితివి. దశరథములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు పంచేంద్రియములు మన ఉపాధి అను రథమును అమ్మ అందించుచున్న శక్తితో, తల్లి కరుణ అనే సారథితో బహుముఖములుగా నడిపించుచు తేజోవంతము చేయుచున్నవి. వీటిలో రథము-రథనిర్మాణ పరికరముల్లు-రథ సారథి-రథ గమనము-రథ గమ్యము అన్నీ కామాక్షి తాయి కరుణయే. రుద్రనమకములో చెప్పినట్లు, " రథేభ్యో-రథపతిభ్యశ్చవ" నమో నమః. అమ్మ కామాక్షి తాయి విరుత్తమును పఠించిననౌ-వినినను-మననము చేసికొనినను సకల సౌభాగ్యప్రదము. అసలు తమిళమే తెలియని నాచే కుప్పలుకుప్పలుగా దొరిలిన తప్పులను సవరించినను సభక్తిపూర్వక అర్చనయే.సౌభాగ్య ప్రదమే. ఆ తేజస్సు వాటిది కాదు.తల్లి తేజోమయ కీర్తి విస్పూర్తివంతమై మనలోని దశ ఇంద్రియములను మన మనోరథము ఈప్సితమును నెరవేర్చుకొనుటకు సహకరించునట్లు చేయునది తల్లి సాక్షాత్కారము. ఫల స్తుతి/ఫలశృతి ------------------- విరుత్తానుగ్రహము సర్వత్ర విజయప్రదము.అమ్మ కృపావీక్షణము అనవరతము అతులిత శుభప్రదము. మిత్రులారా! నా ఈ చిన్ని ప్రయత్నము పెద్ద మనసుతో ప్రోత్సహించిన మీ అందరికి పేరునా ధన్యవాదములు. మీ సోదరి,నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి .

amma kamakhi umaye-10

శ్రీ మాత్రే నమః ************** పారదని ఉళ్ళళవుం బాగియత్తోడెన్నై పాంగుడని రక్షిక్కవుం భక్తియాయ్ ఉన్ పాదం నిత్తము దరిశిత్త బాలరుక్కరుళ్ పురియవుం శీర్పెట్రిదేగతి శిరుపిడిగిలను గామ శెంగలియ అనుగామలం సేయనిడ బాగియం శెల్వంగళైతల్లి జయంపెట్రు వాళ్వి వరవుం పేర్పెట్ర కాలనై పిన్ తొడర ఒట్టామల్ పిరియమాయ్ కాతిదమ్మా పిరియమాయ్ ఉన్మీదు సిరియ నాళ్ సొన్నకవి పిళ్లైగళై పొరుదు రక్షి ఆరదనిల్ మనల్ కువిదు అరియపూజై సేత ఎన్నమ్మ ఏకాంబరి నీయే అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే , అమ్మ కామాక్షి ఉమయే . ******************* 10.తారకము నీవని నమ్మినట్టి నన్ను సరగున రక్షించవే భక్తితో నీపాద నిత్యదర్శనముల భాగ్యమే కడురమ్యము దేహదోషంబులను చెంతరానీయనను అభయహస్తము నీయుమా భక్తితో స్తుతియించు భాగ్యమ్ముతో పాటు జయములను వర్షించుమా యమునిపాశము నన్ను దరిచేరలేని కడుప్రేమతో బ్రోవవమ్మా పటుతరము కాని నా స్తుతిదోషమెంచక "చుట్టు శ్రీరామ రక్ష" సైకత మహదేవుని మనసార కొలిచిన మాతల్లి ఏకాంబరియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. ***************** " విరుత్తము తొమ్మిదవ భాగములో సాధకుని అనుగ్రహించుటకు అమ్మ హంసవాహినియై జ్ఞాన స్వరూపముగా దర్శనమిచ్చినట్లున్నది. నిందించుటను మాని,తల్లిని ఆర్తితో అర్చిస్తున్నాడు."తపోకామాక్షిని" తన్మయత్వముతో సంకీర్తిస్తున్నాడు సాధకుడు. తల్లీ ఏకాంబరి నువ్వు తప్ప నన్ను రక్షించగల సమర్థులెవరు/ అనుచు "ఏకామ్రేశ్వరుని అర్థాంగిని ఏకాంబరి అంటు వేడుకుంటున్నాడు. కాంచిలోని ఆమ్రవృక్ష విశిష్టతను వివరిస్తున్నాడు.ప్రళయకాలాంతర సైతము ఆ చెట్టు ఏమాత్రము చెక్కుచెదరక ఒకేఒక విధమైన ఫలమును నిరంతరముగా అందిస్తుంటుందట .అదియే జ్ఞానమనే ఫలము. ప్రళయానంతరము శివప్రసాదుడైన చిరంజీవి మార్కండేయుడు కాంచిలో తిరుగుచు,ఆమ్రవృక్షమునెక్కి జ్ఞాన ఫలమును తినుచున్న సుబ్రహ్మణ్యుని చూసి,ధన్యుడైనాడని పెద్దలు చెబుతారు. ఈ విషయమును ముచ్చటించుకుంటుంటే, మనకు,సాక్షాత్తు అమ్మ స్వరూపమైన శ్రీ ముత్తుస్వామి దీక్షితారు దర్శించి,అందించిన "కంజ దళాయతాక్షి" కీర్తన స్పురణ కు వస్తుంది.అమ్మ , " ఏకానేకాక్షర స్వరూపమును" ప్రస్తుతిస్తుంది.తల్లి నీవు ఏకాక్షరస్వరూపమే అయినప్పటికిని అనేకాక్షరములుగా (మంత్ర స్వరూపములుగా విస్తరిల్లుతూ) విరాజిల్లుతుంటావు. అంతే కాదు నీవు గుహ్యమాతవు. కామాక్షి తాయి! ఓ ఆదిపరాశక్తి! నీవు కేవలము "ఏకానేకాక్షరివి మాత్రమే కాదు." ఏకానందామృత లహరివి. బ్రహ్మానందమున భక్తులను అనవరతము ఓలలాడించే కరుణాంతరంగవి. పరాత్పరి-పరమేశ్వరి నీవు, ఏకానేకాక్షరి-ఏకానందామృత లహరివి మాత్రమే కాదు, ఏకాగ్ర మనో లయకారివి ఏకాగ్రతతో నిన్ను ఆరాధించు సాధకుని మనమును నీ పాదపద్మముల యందు లగ్నము చేయించి,తరింపచేయు ఏకాంబరివి. " ఏకం బ్రహ్మం న ద్వితీయం" బ్రహ్మమొక్కటే-పర బ్రహ్మమొక్కటే అని తరించాడు అన్నమయ్య. అనేకత్వములలో దాగిన ఏకత్వము నీవు.అనేక నామములకు గల ఏకనామివి నీవు. అనేక గుణములలో దాగిన నిర్గుణము నీవు. అనేక వర్ణములలో దాగిన నిరంజనము నీవు. అనేకాకారములో దాగిన నిరాకారము నీవు. తల్లీ నీవు, నామ-రూపములను- గుణదోషములను- వెలుగు-నీడలను, పాప-పుణ్యములను కల్పిస్తున్నప్పటికిని వీటికి అతీతమైన దానవు.అని తెలిసికొంటినమ్మా. తల్లీ వాగ్భవకూటములో విరాజిల్లుతున్న తామరరేకుల వంటి కన్నులు జ్ఞాన సంకేతములై జగములనేలుచున్నవి ఓ కంజదళాయతాక్షి. నీవు కమలా మనోహరిగా కమలామనోహర రాగములో ప్రస్తుతింపబడుతు నామ-రూపములకు అతీతముగా అలరారుచున్నావు. నీ కృపాకటాక్షమే వాణి-లక్ష్మి తదితర శక్తిస్వరూపములు. కనుకనే లలితా రహస్య సహస్ర నామము " శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా" అని ప్రస్తుతిస్తున్నది. ఆదిశంకర విరచిత సౌందర్య లహరి, " శివే శృంగారార్థే" అంటు నీ దృక్కుల విలక్షతను వివరిస్తున్నది. తల్లీ నిన్ను భక్తి ," మామవ శివ పంజర శుకి" శివత్వము అను పంజరములో నున్న చిలుకగా చాటుతూనే,నిన్ను కుంజర గమనే అని ప్రస్తుతిస్తున్నది. పంజరములోని చిలుక ఎగురగలదా( సాధారణమైనదైనచో) కాని నీవు సకల జగములకు స్థితి కార్యమైన క్రియాశక్తివి.శివుడు సూత్రధారునిగా స్థిరత్వముతో నుంటూ నీచే ముజ్జగములను పరిపాలింప చేస్తున్నాడు. నిర్వహణ కర్తిగా నీ ఠీవితో కూడిన నడక గజగమనమును అనుగ్రహిస్తున్నట్లున్నదమ్మా.కాని నిజమునకు, అది నీచే కదిలింపబడుచున్న జగముల నడక తల్లీ. జగధ్ధాత్రి! నీ కనుసన్నలచే పదునాలుగు భువనములను సంరక్షించు,నీ అనుగ్రహము ఈ దీనుని అనుగ్రహించలేదా? తల్లీ నీ స్వభావము చల్లని వెన్నెల వంటిదని,పున్నమి చంద్రుని వంటి ముఖము నీదని నేననుకోను.అ పోలికలు నీవు వాటికి అనుగ్రహించిన వరములు. వేడి లేని వెలుగులతో నున్న నీ ముఖము వేడిన్వెలుగైన పరమేశుని మూడవ కన్ను నుండి వెలువడిన అగ్నిచే దహింపబడిన వేళ,వేడిలేక కేవలము వెలుగును మాత్రమే ప్రసాదించు నీ ముఖమునుండి వెలువడిన కరుణ యను వెన్నెల మన్మథుని,పునర్జీవితుని కావించినట్లు, పాపాగ్నితో దహించబడుచున్న నన్ను నీ వెన్నెల కిరణములతో అనుగ్రహించమని వేడుకునుచున్న సాధకుని,అనుగ్రహించుచున్న "తాయి కామాక్షి దివ్య తిరువడిగళే శరణం." నరియ నరియ వణక్కంగళ్. అమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న మనము, అమ్మ దయతో రేపు విరుత్తములోని చివరి భాగమును తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...