పదిశక్తుల పరమార్థము-కమలాత్మిక
*****************************
పదిశక్తుల పరమార్థమును అర్థముచేచేసికొనుటకు మనము అమ్మతో చేయుచున్న ప్రయాణము గమ్యమును సమీపించినది,ఇక్కడే ఉండి చుట్టు ఏమిజరుగుతున్నదో మనసుతో చూస్తుంటే కమలాత్మిక తల్లి తత్త్వము అర్థమవుతుంది.గతి నుండి మనలను స్థితికి చేర్చినది.చుట్టూ చూద్దామా ఒకసారి!
తల్లికి నాలుగు ఏనుగులు బంగారు కలశములతో అమృతాభిషేకమును ఆపకుండ చేస్తున్నవి.ఈ దృశ్యమును ముందు మనము చూడలేదు.దీని భావము ఏమిటో? నడుస్తున్న కాలమును కమలాత్మిక నియంత్రించి దానిని నాలుగుదిక్కులుగా మనకు ఏనుగుల రూపములో తన నాలుగువైపులా ఉంచింది.కరుణతో ధర్మార్థ కామ మోక్షత్వమును తెలియచేసింది.అంతే అవి తృప్తితో వాటి మనసులనే అమృతకలశములను తీసుకుని,అనవరతము సుధలను వర్షిస్తున్నవి.జగమంతా సుధామయమైనది.
అంతే కాదు కమలాత్మికకు అష్టలక్షులకు భేదమును గుర్తించలేని మనము నది దగ్గరకు చిన్న పాత్ర తీసుకొనివెళ్ళి జలమును తెచ్చుకున్నట్లు అశాశ్వత వస్తువులను వరముగా అడిగి తృప్తి పొందుచున్నాము.అప్పుడు అమ్మ కూర్చున్న పద్మము బురదలోనున్న నేను దానినంటించుకోకుండా బుధ్ధితో అమ్మకు ఆసనమయ్యాను.అమ్మ అనంతసుధాసారాబ్ధి వర్షిణి.అందుకోలేకపోవుట మన అవివేకము.కమలాత్మిక శాశ్వతానందప్రదాయిని.సారస్వత విజ్ఞానఖని.తల్లినడుగవలసినవి జ్ఞాన-వైరాగ్యములు కాని ఇతరములు కావు అని బోధిస్తున్నది.
అదియేకదా త్రిగుణాతీత తురీయము.నిర్మల నిత్య ప్రకాశము.దశ మహావిద్యా తత్త్వమును అమ్మ మనకు ఇంకా అర్థమగుటకు చేతి పదివేళ్ళనే పదిశక్తులుగా భావించి,పరిశీలిస్తే పది వేళ్ళు ప్రతిసారి పనులలో పాల్గొనవు.కొన్ని తటస్థముగా ఉంటాయి మరి కొన్ని పనిచేస్తుంటాయి .ఉదాహరణకు దారి చూపటానికి ఒకవేలు చాలు.ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే మరొకవేలి సహకారము అవసరము.ఏదైనా వ్రాయాలంటే మూడు వేళ్ళు పనిచేస్తాయి.పూలమాల అల్లునపుడు నాలుగు వేళ్ళు. ప్రక్రియలో పదివేళ్ళు కలిస్తే నమస్కారము.దానినే కైదండ కైమోడ్పు అంటారు.విడిగా చూస్తే వేళ్ళు పది.అన్నిటిని కలిపి చూస్తే నమస్కార ముద్ర.ఎంతటి అద్భుతము దశవిద్యా తత్త్వము.తల్లి కరుణ తరలి వచ్చి మనకు అందించిన దసరా కానుక లో సూత్రధారులైన సాయినాథు నిమ్మగడ్డ,సాయి ప్రసన్న పర్స,ప్రసాదు నిమ్మగడ్డ ,శ్రీమతి శారద రమేషులకు నా కృతజ్ఞతాభివందములను తెలుపుకుంటూ,తల్లి మనతో ఉండి మనకు అమ్మను గుర్తించేశక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఇప్పటికి విరామము తీసుకుంటాను.మాతృ స్వరూపులైన మీ అందరి సహకారమును కోరుతు మీ సోదరి-నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.
ధన్యవాదములు.
శ్రీమాత చరణారవిందార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం,
న్యాయేన మార్గేణ మహిం మహీశాం,
గో బ్రాహ్మణభ్య శ్శుభమస్తు నిత్యం,
లోకా సమస్తా సుఖినో భవంతు.