SAUNDARYA LAHARI-92
సౌందర్య లహరి-వైష్ణోదేవి పరమపావనమైన నీ పాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము మహాశక్తి వెలిసినది ఊర్థ్వభాగపు శిలగా ముగురమ్మలు నెలకొనిరి అథోభాగ శిలగా ఏనుగు దంతాకారము లక్ష్మీ సంకేతము త్రిజగములబ్రోచుతల్లి త్రికూటాచలము హంసవిల్లి-బాణగంగ-పాదుకాతీర్థములు- ఆదికుమారి-కోల్ కండోలి మా-సేవా పరమార్థములు మాయాసతి శిరోభాగము మహిమాన్విత జ్వలనముగా వైష్ణవీదేవి కరుణ మనలను పిలుచుచున్న వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ! ఓ సౌందర్య లహరి. " అధాత: సంప్రవక్ష్యామి కుమారీ కవచం శుభం త్రైలోక్య మంగళం నామ మహాపాతక నాశనం." శ్రీధరుని కరుణించిన కౌమారిదేవి అతనికి దర్శనమిచ్చి,అన్న సంతర్పణమును చేయమని కోరినది.పేదరికముతో స్నేహముచేయు అతడు అమ్మ మాటలకు విస్తుపోయి,తల్లి ఆనను శిరసావహించి,అన్న సంతర్పణకు ఊరిజనమునందరిని ఆహ్వానించి,ధ్యానమగ్నుడాయెను.అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లేకదా.భావనా మాత్రముచేతనే బహుపదార్థములు ప్రత్యక్షమాయెను.పంక్తి భోజనమును కౌమారి మాతృ...