Saturday, April 14, 2018

SAUNDARYA-VISAALAAKSHI


 సౌందర్య లహరి-విశాలాక్షి

 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఆదిదంపతుల నివాసము ఆనంద కాననము
 సర్వ క్షేత్ర సమగ్రము- సాక్షాత్ మోక్ష ప్రదము

 వారణ-అసి నదుల సంగమ అవిముక్త క్షేత్రము
 అహంకారి వ్యాసునికి అందించినది  బహిష్కరణము

 అర్థనారీశ్వర  ప్రకాశముతో  ఆధ్యాత్మిక మైనది కాశి
 "అహం కాశి గమిష్యామి" అనగానే నిలువెత్తు పుణ్యరాశి

  మాయాసతి మణికర్ణిక పడినచోటు  మహామోక్షపురములో
  సదా షోడశి విశాలాక్షి  నన్ను సంస్కరించుచున్న వేళ

  నీమ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం
   విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా
   సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం
   వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ
   అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః
   త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."

   గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.
"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.'వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

   మణికర్ణిక అను పదమునకు కర్ణమునకు (చెవికి) ధరించిన మంగళప్రద ఆభరణము.మాతసతి చెవిపోగు ఇక్కడపడిన ప్రదేశములో ప్రకటింపబడిన తల్లి కనుక "మణికర్ణికా దేవి" అని కూడా తల్లిని కొలుస్తారు.మణికర్ణికా ఘాటు   విష్ణువుచే నిర్మించబడినదిగా ఒక కథ ప్రచారములో ఉంది.విశాలాక్షి తీర్థము భక్తుల పాపప్రక్షాళనము చేస్తోంది.
 అసి వరుణ అనే నదులు గంగలో సంగమిస్తాయి.అసి-వరుణ మధ్యనున్న ప్రదేశమును వారణాసి అంటారు.ఇరుకైన సందుల గుండా విశాలాక్షి అమ్మవారి గుడికి భక్తులు చేరుకుంటారు.గర్భగుడి ముందు భాగములో ఆదిశంకరులు ప్రతిష్టించిన శ్రీచక్రము సువాసిని పూజలను అందుకుంటుంటుంది.సర్వాభరణ,సర్వ పుష్పాలంకృతయై,సర్వాభీష్ట ప్రదాయినిగా సాక్షాత్కరిస్తుంది తల్లి.అమ్మవారి మూర్తి వెనుక మరొక మూర్తి మహిమాన్వితయై మనలను కాపాడుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...