Saturday, July 1, 2017

APPAA RAAMA BHAKTI....EMTOE GOPPARAA

" జానక్యా: కమలాంజలి పుటేయా: పద్మరాగయితా:
న్యస్తా రాఘవ మస్తకేన విలసత్లుంద ప్రసునాయతా:
స్రస్తా శ్యామల మస్తకాంతి కలితా యాఇంద్ర నీలాయుతా:
ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"
అప్పా!! రామభక్తి ఎంతో!!!!!!!
**********************************
స్వస్తి శ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర
చైత్ర శుద్ధ నవమి, బుధవారము
పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న
శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న
సీతారామ కళ్యాణములో
్్్్్్్్్్్్్్్్్్
తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా
జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత
వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి
అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు
కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు
ఇంతలో
మంగళ హారతినిస్తూ, మంగళ స్నానాలకై
పదపదమని వారిని పంపింది పరవళ్ళ గోదావరి
మగపెళ్ళివారము మేము అంటూ అహల్య
పరమ పావనపాదము అనుచు పారాణిని అద్దింది
రఘువంశ తిలకుడు అని కళ్యాణ తిలకమును దిద్దింది
రామచంద్రుడీతడని బుగ్గ చుక్క పెట్టింది
ఆడ పెళ్ళివారము మేము అంటూ మొల్ల
వేదవతి పాదము అని పారాణిని అద్దింది
పతివ్రతా తిలకము అని కళ్యాణ తిలకమును దిద్దింది
చక్కని చుక్క సీత అని బుగ్గ చుక్క పెట్టింది.
ఆహా.... ఏమి మా భాగ్యము
ఎదురుబొదురు వధూవరులు ముగ్ధ మనోహరము
తెరసెల్ల మధ్యనుంది చెరొక అర్థ భాగము.
ప్రవర చదువుతున్నారు వశిన్యాది దేవతలు
ప్రమదమందుచున్నారు పరమాత్ముని భక్తులు.
వివాహ వేడుకలను వివరించుచున్నారు విశ్వనాథ
ఎన్నిసార్లు వినియున్నా తనివితీరని కథ.
" మాంగల్యం తంతు నానేనా-లోక కళ్యాణ హేతునా"
పట్టరాని సంతోషము మ్రోగించె గట్టిమేళము
రాముడు కట్టిన సూత్రముతో మెరిసినది సీత గళము
తలపై పట్టు వస్త్రములతో, ముత్యాల తలంబ్రాలతో
తరలి వస్తున్నారు తానీషా వారసులు.
సుమశరుని జనకునకు సుదతి సీతమ్మకు
శుభాకాంక్షలై కురిసెను సౌగంధిక సుమములు.
వానతోడు తెచ్చుకున్న హరివిల్లు తళుకులుగా
హర్షాతిరేకముగా విరబూసెను తలంబ్రాలు.
"ఒకే మాట, ఒకే బాణం ఒకే పత్ని" రామునకు అని
మురిసిపోతున్నారు ముందు వరుసలోని వారు.
ఒడ్డుకు చేర్చు దేవుడని తెడ్డుతో నున్న గుహుడు
వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు
నారాయణుడితడంటు నారదునితో విభీషణుడు
ఆశీర్వచనము చేస్తూ ఆ విశ్వామిత్రుడు
దండము పెట్టేనురా కోదండపాణి చూడరా అని అండజుడు
సీతమ్మకు చింతాకు పతకమునిస్తూ రామదాసు
మా జానకిని చెట్టపట్టగానే మహరాజు వైతివని మేలమాడు త్యాగరాజు.
సీతా రాముల పెళ్ళంట- అంగరంగ వైభోగంగా
చూసిన వారికి పుణ్యాలు అంటూ అందరూ
తమని తాము మరచిపోతుంటే,
శ్రీరామ అను చిలుక సేసలు అందిస్తోంది
పందిరిలో పరుగిడుతూ సందడిగ బుడత ఉడుత
అక్షింతలు అందరి తలలపై వేసుకోమంటున్నది.
పానకమును అందిస్తున్నారు సనక సనందనాది మునులు
ప్రసాదము అని వడపప్పును పంచిపెడుతున్నారు
చూడ చక్కని జంట అని చూపు తిప్పుకోలేక పోతున్నామన్న
మాటలు వినబడి వారికి దిష్టి తగులుతుందేమోనని
సూక్ష బుద్ధితో వెంటనే అదిగో అటు చూడండిరా
సీతా రాములు
అలిసిపోయి ఉన్నారని వారికి ఆకలి అవుతున్నదని
పండ్లను తినిపిస్తున్నది పండు ముసలి ఆ శబరి.
చైత్ర శుద్ధ నవమికి ఈ నేత్రోత్సవమబ్బెనా
శుభలక్షణములను అభిజిత్ లగ్నము అందుకోగలిగెనా
ఆబాల గోపాలపు ఆనందము హెచ్చెనా
సీతారామ కళ్యాణము సురుచిరమై కొనసాగునా
చెప్ప నలవికాదురా " సీతారామ కళ్యాణ వైభోగము"
కంటి రెప్పవైన మా అప్పా!
రామ భక్తి ఎంతో " గొప్పరా."
శ్రీ రామరక్ష సర్వజగద్రక్ష.


RAARAA MAA IMTI DAAKAA

రారా మాఇంటి దాక" రామా
**************************
"జానక్యా కమలాంజలి పుటే: యా పద్మరాగాయిత-న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయతే
శ్రస్త శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్ర నీలాయిత-ముక్తస్థ శుభద భవంతు భవతం శ్రీ రామ వైవాహికం"
స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర
చైత్ర శుద్ధ నవమి,శుక్రవారం
పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న
శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న ,
***************************************
అసమాన శివ ధనుర్భంగము గావించిన వానికి
అగ్ని పునీత వేదవతి,అయోనిజ సీతను ఇచ్చి
విదేహ మహారాజు చేయుచున్న ముదావహ "కన్యాదానము"లో
" వరుడు"
ఆ సూర్య వంశములో అగ్ని ప్రసాదముగా జన్మించిన వాడు
ఆ కౌశికునికి అగ్నికార్య రక్షణము కావించిన వాడు
అహమును తొలగించిన వాడు అహల్య పాలిట దేవుడు
గురు వాక్య పాలకుడు,సుగుణాభి రాముడు
ఆ లోక కళ్యాణములో
**********************
"నిధి చాల సుఖమా రాముని సన్నిధి కన్నా" కాదని
తరలినాడు భద్రుడు తాను పెళ్ళి వేదికగా
అర్ఘ్య పాద్యాలు,మంగళ స్నానాలకు
పరవళ్ళు తొక్కింది పదమని గోదావరి
విభీషణుని మృదు సంభాషణల వ్యాఖ్యానాలతొ
వశిన్యాది వాగ్దేవతలు మారారు బ్రహ్మలుగా
కోతి మూక చేయుచున్న కోటి నామ జపములు
మారు మ్రోగుతున్నాయి మంగళ వాయిద్యాలుగా
పట్టు వస్త్రాలను,నవరత్న తలంబ్రాలను
తలపై పెట్టుకుని తరలి వస్తున్నారు తానీషా వారసులు
కళకళలాడుతున్నాయి కళ్యాణ వేడుకలు
*****************************************
"ఒకే మాట,ఒకే బాణం,ఒకే పత్ని" వ్రతుడు" శ్రీరాముడు" అని
మురిసి పోతున్నారు ముందు వరుసలోని వారు
ఎందరెందరో అనఘులు,ఏనాటికిని ఘనులు.
(కీర్తి కాయులై కీర్తించు చున్నారు)
ఒడ్డునకు చేర్చు దేవుడవని తెడ్డుతో నున్న గుహుడు
వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు
చింతాకు పతకముతో నిశ్చింతగ రామదాసు
"మా జానకిని చెట్టపట్టగానే మహరాజు" పాడుతున్న త్యాగరాజు
ఎందరెందరో అనఘులు,ఎన్నటికైనా ఘనులు
(కన్నుల పండుగైన కళ్యాణ సుముహూర్తమును దర్శించండి-
జన్మను చరితార్థము చేసుకోండి)
పందిరిలో పరుగులిడుతు సందడిగ బుడత ఉడత
అక్షింతలు వేసుకోమంది అందరి తలలపై
"తారకము "అను పానకమును, "తాదాత్మ్యత" అను వడపప్పును
తనివితీర తాగమంది,తరియించగ తినమంది
అదిగో,అటు చూడండి..సీతారాములు
అలిసిపోయినారంటు,ఆకలి అవుతున్నదంటు
పండ్లను తినిపిస్తున్నది,పండు ముసలి ఆ శబరి
"శబరి"గా మారిపోయి (భక్తిలో)" శరణు" వేడుకొందామా
"రామ" (రాముడు, మరొక అర్థములో స్త్రీ రూపములోనున్న సీతమ్మ)
మమ్ములను" బ్రోవమని".
.శ్రీ రామ జయ రామ జయ జయ రామ

SIVA SANKALPAMU

ప్రియ మిత్రులారా,
సచిద్రూపము (సత్తు-చిత్తు-రూపము) పరమాత్మను మనము సత్యం-శివం-సుందరం అని కీర్తించుచున్నాను.సత్యము అనగా శాశ్వతత్వము.సుందరము అనగా సంతోష ప్రదము.శాశ్వత సంతోషమే శివము.అదియే పరమాత్మ ప్రకాశము.
పాలు-మీగడ,పెరుగు,మజ్జిగ,వెన్న ఇలా రూపాంతరములు చెంది నెయ్యిగా మారుతుంది.పేరుకున్నా,కరిగించినా అది నెయ్యిగానే ఉంటుంది.రూపాంతరము చెందదు.అదే విధముగా
శాశ్వత సుందర తత్త్వమునకు ఆకర్షింపబడినవారు దానినుండి వెనుదిరగలేరు.అది మనదారిని మళ్ళించి వేస్తుంది.మహేశ్వరునితో మమేకము చేస్తుంది."దాసుని తప్పులు దండముతో సరి" అంటూ మనచే ఆడిస్తుంది.పాడిస్తుంది.మనసును జోకొట్టి శివుని నిందించేలా చేస్తుంది.మేల్కొలిపి స్తుతించేలాను చేస్తుంది మనసుతో దాగుడుమూతలు ఆడుకుంటూ,బుద్ధిని అందులో భాగస్వామిని చేస్తూ,నిందాస్తుతులను అందచేస్తుంది.సమయము,స్థలము తానేయైన కాశీనాథుడు కార్తీక మాస శుభ సందర్భముగా తన డమరుకము నుండి లక్షణ అక్షరవానలు కురిపించ దలిచాడు.అక్షయ ముక్తిఫలములను పంచుతు మనలను మురిపించదలిచాడు.దోసిలొగ్గి స్వీకరించి తరించుదాం.నా దోసములను శివకృపతో సవరించుదాం.మీ సోదరి

ఓం నమ: శివాయ-01


     ఓం నమ: శివాయ-01

    అర్హత ఉందో-లేదో  అసలేనేనెరుగను
    అర్చన అవునో-కాదో అదికూడా నేనెరుగను

    నమక-చమక అంతర్గత  గమకము నేనెరుగను
    కోట్ల అపచారములో షోడశోపచారములో

    అహంకార గద్యమో  అపురూప నైవేద్యమో
    అశక్తతా కళంకమో   భక్తి నిష్కళంకమో

    దు:ఖ నివృత్తియో ఇది సకృతియో నేనెరుగను
    దుష్ట పరిహారమో  ఇది ఇష్ట పరిచారమో

    కుప్పల తప్పులు చేస్తూ నే ఒప్పులుగా భావిస్తే
    గొప్పదైన మనసుతో నా తప్పిదములు క్షమియిస్తూ

    సకల దేవతలతో పాటు  సముచితాసనుడివై
    సన్నిహితుడుగ మారరా లోక సన్నుత ఓ శంకరా.

ఓం నమ: శివాయ-02


   ఓం నమ: శివాయ-02

  ధర్మాధర్మములా సకలదేవతలారా! ఇవి
  నిర్మితము శివునిచే నిమిత్తమాత్రము నేను

  మదముతోటి మాటలని నన్ను మన్మథునిగ చూస్తాడో
  వదరుబోతు పదములు అని ఆదరమే చూపుతాడో

  పుట్టుట-గిట్టుట నడుమ శివుని తిట్టుట అనుకుంటాడో
  కట్టుబాటు  నేర్పించగ మెట్టుదిగి  వస్తాడో

  ప్రమథ గణములకు  నన్ను పరిచయమే చేస్తాడో
  ప్రమదములో ముంచుతాడో-ప్రమాదమే  అంటాడో

  కాలకూట విషముకన్న కఠినము తానంటాడో
  కన్నతండ్రిని  అని క్షమించి వదిలేస్తాడో

  మితిమీరిన ప్రేమతో తిక్క శంకరుడని అన్నానంటూ
  నా పక్కనే ఉంటాడో ఆ తిక్క శంకరుడు.

ఓం నమ: శివాయ-03

శివ సంకల్పము-03

 కాసులేని వాడివని ఏవేవో రాసేస్తున్నాను
 బేసికన్నులను చూసి నే రోసిపోయి ఉన్నాను

 దోసములే నీ పనులని నే ఊసులెన్నో చెప్పాను
 వేసమేమిటో అంటూ నేను ఈసడించుకున్నాను

 కైలాసమును ఎత్తిన వాడు నీ విల్లు ఎత్తలేక పోయాడు
 సహకారము ఈయనిది అతని అహంకారమేగ శివా

 అహంకారమును వదిలేస్తే అధీనుడిని అంటావు
 ధీటులేని నీ భక్తితో రాటు చేస్తుంటావు

 స్వల్ప కాలిక లయముతో(నిద్ర) శక్తిని ఇస్తుంటావు
 దీర్ఘ కాలిక లయముతో ముక్తిని ఇస్తుంటావు

 నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి
 మొక్కనీయరా భక్తితో ముక్కంటి శంకరా

ఓం నమ: శివాయ-04


     శివ సంకల్పము-04

  కన్నతండ్రి లేనివాడు,కలికి తండ్రిని కూల్చినోడు
  ఉదరములో ఉన్నవాడు,ఆదరణ మరచినోడు

  ఆత్మస్తుతికి లొంగినోడు,ఆతంలింగమునిచ్చినోడు
  నక్రగ్రహిని మెచ్చినోడు,చక్రమునే ఇచ్చినోడు

  పార్థుని పరీక్షించినోడు,పాశుపతమును ఇచ్చినోడు
  పర్వత అల్లుడు వాడు,సర్వము చూస్తుంటాడు

  పెద్ద నిద్ర తెస్తాడు,మద్దిలాగ మారతాడు
  చివరియాత్రకు వస్తాడు నిమిరి చేరదీస్తాడు

  మరియాదస్తుడో మరి కొలువలేని వ్యస్తుడో
  మర్మము నెరుగని మనుజులనుచున్న మాటలు

  సదాచారమేలేనిది  సదాశివునికే నంటే,నే
  ఎక్కి ఎక్కి ఏడ్చానురా ఓ తిక్క శంకరా. 

ఓం నమ: శివాయ-05

ఓం నమ: శివాయ -05

అమ్మ గర్భశిశువు వలె,అలలలోని జలము వలె
పాప నోటి పంటి వలె,పాలలోని వెన్న వలె

చేనులోని పంట వలె,మేనులోని మేధ వలె
భూమిలోని నీటి వలె,భూరుహుముల పండు వలె

ఆయువగు గాలివలె సాయమగు జాలివలె
వ్యక్తమవని శక్తివలె,వ్యక్తి లోని యుక్తి వలె

కొయ్యలోని బొగ్గు వలె,కొమ్మలోని పువ్వు వలె
సూక్ష్మమైన స్థూలము వలె,స్థూలములోని సూక్ష్మము వలె

స్థాణువున చలనము వలె,సాధించిన సంకల్పము వలె
గుడ్డులోని పిట్ట వలె,విడ్దూరపు భూభ్రమణము వలె

విత్తులోని చెట్టు వలె,చిత్తులోని పట్టు వలె
నిక్కి నిక్కి చూస్తావురా ఓ తిక్క శంకరా

ఓం నమ: శివాయ-06

ఓం నమ: శివాయ -06

తిండి ధ్యాస నేర్పావు తినమంటు చీమకు
దాచుకుంటుంది తప్ప దానమేది దానికి

భిక్షాటన నేర్పావు శిక్ష అంటు పుర్రెకి
అడుక్కుంటున్నది తప్ప ఆతిథ్యమేది దానికి

పట్టుబడుట నేర్పావు పరుగుతీయు లేడికి
కవి చమత్కారము తప్ప కలిసొచ్చిందేమి దానికి


పొర విడుచుట నేర్పావు కుబుసముల పాముకి
పై పై అందము తప్ప పరమానందమేది దానికి


పంచుకొనుట నేర్పావు మాతల్లి పార్వతికి
గురుదక్షిణ సగమైతే సగ భాగమే మిగిలింది


పరిహాసపు గురువునీవు పరమ గురువులందరి
లెక్కలోకి రావురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-07

ఓం నమ: శివాయ -07

పాట పాడుచు నిన్నుచేర పాటుపడుచు ఒక భక్తుడు
నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒక భక్తుడు

నాట్యమాడుచు నిన్ను చేర ఆరాటపడే ఒక భక్తుడు
కవిత వ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు

తపమాచరించుచు నిన్ను చేర తపియించుచు ఒక భక్తుడు
ప్రవచనముల నిన్ను చేర పరుగుతీయు ఒక భక్తుడు


చిత్రలేఖనముతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు
నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు


నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒక భక్తుడు
అర్చనలతో నిన్నుచేర ముచ్చటించు ఒక భక్తుడు


ఏ దారిలో నిన్ను చేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు,నువ్వు
నక్కతోక తొక్కావురా ఓ తిక్క శంకరా.
........................................................

ఓం నమ: శివాయ-08

ఓం నమ: శివాయ  -08

అరిషడ్వర్గాలను ఆహా నువ్వు బెదిరిస్తుంటే
అహముతో అసురగణము నిన్ను బెదిరిస్తోందా

బ్రహ్మ పుర్రె పట్టుకొని నువ్వు బిచ్చమెత్తుతుంటే
బ్రహ్మర్షులు చిత్రముగా నిన్ను బిచ్చమడుగుతున్నారా

పొంగుచున్న గంగను నువ్వు జటలలో బంధిస్తే
పంచాక్షరి వింతగ నిన్ను పట్టి బంధిస్తోందా


ఆ నందిని కైలాస కాపరిగ నువ్వు నియమిస్తే
బాణుడు శోణపురి కాపరిగా నిన్నే నియమించాడా


పరమ గురుడు శివుడు అని నేను స్తుతులు చేస్తుంటే
అఖిలజగము పరిహసిస్తు విస్తుబోయి చూస్తుందా 


బందీలు ఎవరో తెలియని నా సందేహము తీర్చకుంటే
నిక్కము అనుకుంటానురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-09



    ఓం నమ: శివాయ-09
ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
భక్తి మకరందమును గంధముగా పూయనా
ఆది, అనాది నీవంటూ బూదిని నే పూయనా
శాంతి,సహన పుష్పాలతో పూజలు నేచేయనా
పాప రహితము అనే దీపమును వెలిగించనా
పొగడ్తల పూల వాసనలు అను పొగలను నే వేయనా
లబ్బు-డబ్బు శబ్దాలతో స్తోత్రములను చేయనా
ఉచ్చ్వాస-నిశ్వాస వింజామరలనే వీచనా
అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా
హరహర మహదేవ అంటు హారతులనే ఈయనా
దాసోహం దాసోహం అంటు ధన్యతనే పొందనా
నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా.

ఓం నమ: శివాయ-10


     ఓం నమ: శివాయ -10

  బావిలోన నీవున్నావని  భక్తుడిగా నేవస్తే
  బావిలోన కప్ప నిన్ను తనతో పోల్చుకుంది

  కొండమీద నీవున్నావని కొలువగ నేవస్తే
  బండరాయి కూడ నిన్న తనతో పోల్చుకుంది

  బీడునేలలో నీవున్నావని తోడుకొరకు నేవస్తే
   జోడువీడు అంటు బీడు తనతో పోల్చుకుంది

  అటవిలోన ఉన్నావని  అటుగా నేవస్తే
  జటలను   చూపిస్తు అటవి తనతో పోల్చుకుంది

  చెట్టులోన ఉన్నావని పట్టుకొనగ నేవస్తే
  పట్టులేక ఉన్నావని చెట్టు తనతో పోల్చుకుంది

  సఖుడివి నీవై సకలము పరిపాలిస్తుంటే
  ఒక్కరైన పొగడరేల  ఓ తిక్క  శంకరా.

ఓం నమ: శివాయ-11


   ఓం నమ: శివాయ-11

 చక్కదనపు నలుగునిడి స్నానము చేయిద్దామనుకుంటే
 పుక్కిలింత నీళ్ళతో సొక్కిపోయి ఉంటావు

 పట్టుపుట్టాలు నీకు కట్టాలనుకుంటేను
 గట్టిగా విడువనంటూ  పట్టుకుంది పులితోలు

 కనక భూషణములను కంఠమున వేయాలనుకుంటే
 కాలకూట విషపు పాము కౌగలించుకుందాయె

 ప్రేమతో  పరమాన్నము తినిపిద్దామనుకుంటే
 పచ్చి మాంసపుముక్క పచ్చి యనక ఉందాయె

 పక్కింటివాళ్ళతో  ఆడుకోమంటేను
 నాకు పక్కిల్లే లేదని బిక్కమొగము వేస్తావు

 ఎవరు నీకులేరను వారికి ఎరిగించు నిజమును
 అక్కను నేనున్నానని  ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-12


   ఓం నమ: శివాయ-12

 ఎత్తైన కొండలలో భోగ నందీశ్వరుడవని అంటారు
 చేరలేనంత  ఎత్తులో చార్ ధాం లో ఉంటావు

 లోయలలో హాయిగా త్రిసిల్లిరి మహాదేవుడనని అంటావు
 దూరలేనమత గుహలలో అమరనాథుడవై ఉంటావు

 కీకారణ్యములో అమృతేశ్వరుడనని అంటావు
 కనుమల దగ్గర కామరూప కామాఖ్యుడిని అంటావు

 జలపాతాల లోతులలో బాణేశ్వరుడనని అంటావు
 భూగర్భమున దాగి హంపి విరూపాక్షుడినని అంటావు

 ఈదలేనంత గంగ ఒడ్దున ఈశ్వరుడిని అంటావు
 గడ్డిపరక కొన పరిమాణమున గారడి చేస్తూ చేస్తూ

 నా మదిని వదిలేసావు దయలేక, తెలియదుగా
 నెకు ఎక్కడ ఉండాలో  ఓ తిక్క శంకరా.


ఓం నమ: శివాయ-13



   ఓం నమ: శివాయ-13

  గుర్తించిన పురుగు కరిపాములకు  గుడినే కట్టించావు
  గుడి గోపురమును చూసిన  పాప నాశనము అన్నావు

  గుడ్డితనమును  పోగొట్టి చూపు నిస్తుంటావు
  గుర్తించనివారికిని భక్తి గుళికలు అందిస్తుంటావు

  గురువుగా మారి ఎందరినో తరియింపచేస్తావు
  గుడిలోన కూర్చుని  గురుతర పూజందుకుంటావు

  గుహుని తండ్రిగా మారి అహమును తొలగిస్తావు
  గుగ్గిల నాయనారు భక్తిని గుబాళింపచేసావు

  గుణనిధిని కరుణించి గుండెలో దాచుకుంటావు
  గుచ్చిన బాణము చూపి  పాశుపతమునిచ్చావు

  గుక్క తిప్పుకోకుండా ఎక్కి ఎక్కి ఏడ్చుచున్న నన్ను,నీ
  అక్కున చేర్చుకోవేమిరా  ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-14


      ఓం నమ: శివాయ-14

    ఉదారతను చాటగ  ఆ అసురుని  ఉదరములో నుంటివి
    గంగిరెద్దు మేళము నిన్ను కాపాడినది  ఆనాడు

    కరుణామయుడవన్న ఆ అసురుని హస్తమున అగ్గినిస్తివి
    మోహిని  ఆకారము నిన్ను  కాపాడినది ఆనాడు

    భోళాతనమును చాటగ రావణునికి ఆలినిస్తివి
    నారద వాక్యము నిన్ను కాపాడినది  ఆనాడు

    ఆత్మీయత అనుపేర ఆత్మలింగము నిస్తివి
    గణపతి చతురత నిన్ను కాపాడినది  ఆనాడు

    భ్రష్టులైన వారిని నీ భక్తులు అని అంటావు
    రుసరుసలాడగలేవు,కసురుకొనవు  అసురతను

    మ్రొక్కారని రక్కసులకు గ్రక్కున వరములనిస్తే
    పిక్క బలము చూపాలిరా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-15


   ఓం నమ: శివాయ-15

   నీ నియమపాలనలో భక్తి నిగ్గుతేల్చాలని
   అత్యంత ప్రేమతో వారిని అక్కున చేర్చుకోవాలని

   అగ్గిలో కాల్చావు  ఆ భక్త నందనారుని
   అంబకము అడిగావు  ఆ బోయ తిన్నడిని

   అఘోర వ్రతమన్నావు ఆ చిరుతొండనంబిని
   అర్థాంగిని ఇమ్మన్నావు ఆ అయ్యలప్పను

   అంత పరీక్షించావు అమ్మాయి గొడగూబను
   దొంగతనము నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకు

   మహదేవుని కాళ్లను నరికించావు కఠినముగా
   మల్లిఖార్జునికి కళ్ళను పీకించావు కటకట

   భక్తులకు పరీక్షలను ఈ కఠిన శిక్షలు,ఇక
   అక్కరలేదనవేరా  ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-16


    ఓం నమ: శివాయ-16

  సగము  మహాదేవుదట-సగము మహాదేవి అట
  సగము తేట తెలుపట- మరొక సగము పసిడి పసుపట

  సగము చంద్ర బింబమట-సగము మల్లెదందలట
  సగము జటాజూటమట-సగము థమ్మిల్లమట

  సగము బూది పూతలట-సగము కస్తురి తిలకమట
  సగము నాగ హారములట-సగము నానా హారములట

  డమరుక దక్షిణ హస్తమట-వరద వామ హస్తమట
  సగము పులి తోలేనట-సగము చీనాంబరములట

  సగము తాండవ పాదమట-సగము మంజీరములేనట
  చెరిసగము స్త్రీ పురుషులట-కొనసాగును సృష్టి యట

  నగజ-అనఘ సగములో మిగిలిన సగమేది అంటే
  దిక్కులు చూస్తావేమిరా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-17



   ఓం నమ: శివాయ-17

    నీకు పూజచేస్తే పున్నెమని విని వినయముగా
    కాళ్ళు-చేయి కడుగ నీళ్ళకెళితే గంగ కస్సుమన్నదిరా
    స్నానమెట్లు చేయిస్తు? సముదాయించర గంగను

    నిన్ను కూర్చోమనగానే  వేటకు తుర్రుమన్నదిర పులి
    జందెమైన ఇద్దమన్న చరచర  పాకింది పాము

    కట్టుకోను  బట్టలన్న  కనుమరుగైనదిర కరి
    నైవేద్యముచేయబోవ  విషజంతువులన్నీ  మాయము

    వెతుకులాడి వెతుకులాడి వేసారితినిరా శివా
    అక్కజమేమున్నదిలే నీ అక్కర తీరినదేమో
    ఒక్కటైన కలిసిరాదు నీకు చక్కనైన పూజసేయ

   మాయతొలగిపోయె  నేడు  మానసపూజలు చేతు
   దిక్కులనే ధరించిన  ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-18


     ఓం నమ: శివాయ్-1
8

 పొట్టచీల్చి  గజాసురుని  మట్టి కరిపించావు
 చుట్టుకుంది  అతని తల  నీ సుతుని  శరీరమునే

 కన్నుతెరిచి  మన్మథుని  కన్ను మూయించావు
 కన్నుల పండుగ అయినది  నీ కళ్యాణములో

 బాణమేసి   వరాహము  ప్రాణమే  తీసావు
 పాశుపతము చేరింది  అర్జునుని  చేతికి

 హరిని  అస్త్రముచేసి  త్రిపుర సం హారము చేసావు
 విరచితమైనది జగతి వీరముగా  హరిమహిమ

 దారుణ మారణ కాండలను కారుణ్యము అంటుంటే
 ఎటుచూసిన నీ గతము పాతకముగ మారుతుంటే

 "మహాదేవం-మహాత్మానాం-మహా పాతక నాశనం" ఏమిటంటే
  చక్క బరచుట అంటావురా  ఓ తిక్క శంకరా. 

ఓం నమ: శివాయ-19


   ఓం నమ: శివాయ-19

 నారి ఊడదీయమనగానే  జారిపోవ చేశావు
 అమ్ములు  దాచేయమనిన గమ్మున దాచేశావు

 విల్లు కనబడకూడదనిన  వల్లె అని అన్నావు
 పినాకమే కానరాని  పినాకపాణివి నీవు

 మంచపుకోడును కాడ కనిపించకుండ చేశావు
 ఖట్వాంగధారివైన ఖండోబా దేవుడవు

 లేశమైన లేకుండా ఆశాపాశములను తీస్తావు
 పాశుపతాస్త్రములేని  పశుపతివి నీవు

 పరశును మొద్దుచేయమంటే పదును తీసేసావు
 ఖండ పరశు కానరాని కపర్దివి నీవు

 రుద్రములో చెప్పారని  వద్దనక చేస్తుంటే,నిన్ను
 తెలివి తక్కువ అంటారురా ఓ తిక్క శంకరా.  

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...