Friday, February 9, 2018

SIVA SANKALPAMU-87

      
 పొగడ్తలకు పొంగిపోతే ఉబ్బు లింగడు అని అంటున్నారు
  చిరాకును చూపిస్తుంటే చిందేస్తున్నాడంటున్నారు

 కోపముతో ఊగుతుంటే మూడోకన్ను తెరిచాడంటున్నారు
 చిట్టిచీమ  కుట్టగానే శివుని ఆన అంటున్నారు

 బిచ్చగాడివి నీవంటు ముచ్చటించుకుంటున్నారు
 శుచిలేనిది  చూస్తుంటే శివ శివ అంటున్నారు

 కలసిరాక దిగులుంటే గంగపాలు అంటున్నారు
 అలసత్వముతో ఉంటే అచ్చోసిన ఆంబోతు అంటున్నారు

 కన్నీళ్ళు కార్చుతుంటే నెత్తిన గంగమ్మ అంటున్నారు
 దిక్కుమాలిన ఉపమానాలతో నిన్ను తొక్కేస్తున్నారు

 మంచుకొండ దేవుడిలో మంచితనము ఏది అంటూ
 ఎక్కిరించారురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-86

మాతంగ పతిగ నీవుంతే ఏది రక్షణ వాటికి
 గణపతి అవతరించాడు కరివదనముతో

 అశ్వపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 తుంబురుడు వచ్చాడు గుర్రపు ముఖముతో

 నాగ పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 పతంజలి వచ్చాడు పాము శరీరముతో

 వానర పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 నారదుడు వచ్చాడు వానర ముఖముతో

 సిమ్హపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 నరసిమ్హుడు వచ్చాడు  సింహపు ముఖముతో

 పశుపతిగ నీవుంటే అశువుల రక్షణ లేకుంటే నేను
 మొక్కేదెలాగురా ఓ తిక్క సంకరా.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...