సౌందర్య లహరి-59
పరమ పావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అమ్మ మహిమ గుర్తించని చిమ్మచీకట్లలలో
విజ్ఞత వివరము తెలియని యజ్ఞ వాటికలలో
విజ్ఞత వివరము తెలియని యజ్ఞ వాటికలలో
అటు-ఇటు పరుగులిడు తలపులను ఇటుకలతో
సంకల్ప-వికల్పములను సుక్కు-శ్రవములతో
సంకల్ప-వికల్పములను సుక్కు-శ్రవములతో
విచక్షణారహితమను సంప్రోక్షణలతో
కుతంత్రాల తతులనే కుటిల మంత్రాలతో
కుతంత్రాల తతులనే కుటిల మంత్రాలతో
తమస్సులో తపస్సులను బహులెస్స హవిస్సులతో
నా అజ్ఞానము సర్వము యజ్ఞముగా మారుచున్న వేళ
నా అజ్ఞానము సర్వము యజ్ఞముగా మారుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
" యజ్ఞ ప్రియా-యజ్ఞ కర్తీ-యజమాన స్వరూపిణీ" అని శ్రీమాతను శ్రీ లలితా సహస్ర రహస్య నామావళి కీర్తించినది.యజ్ఞమును ఇష్టపడి-కావలిసినవి సమకూర్చి-యజమానిగా తల్లి వ్యవహరిస్తుందట.స్థితికారిణి యైన తల్లికి మనము కృతజ్ఞతను తెలియచేసుకొనుటకు తల్లి ఇచ్చిన అవకాశము యజ్ఞము.మనము అమ్మకు గోరుముద్దలు తినిపించి పులకరిమ్హిపోతున్నట్లు.ఎంతటి మహా భాగ్యము ! యజుర్వేద విధానముగా ,ఋగ్వేద మంత్రసహితముగా నిర్వర్తించు అగ్ని కార్యము "యజ్ఞము"." యజ్ఞాత్ అన్న సంభవ " అని భగవద్గీత ప్రశంసించుచున్నది.అగ్నికార్యము ద్వారా దేవతలు యజ్ఞ ద్రవ్యములను సమర్పించగా వారు సంతసించి స్వీకరించునదియే "హవిస్సు".అగ్నికార్య సమయమును ఆజ్యమును ఇతర ద్రవ్యములను సమర్పించుటకు ఉపయోగించు గరిటల వంటివి సుక్కు-శ్రవములు.తల్లీ నేను పటుత్వములేని ఇటుకలతో నిర్మించిన యజ్ఞవాటికలో,నిలకడలేని తలపులనే గరిటలతో,మందబుద్ధి అనే నేతిని సమర్పించుతూ,చీకటితో నిండిన నా అజ్ఞానమును నైవేద్యముగా సమర్పించు చుండగా, అమ్మ దయతో వానిని పవిత్రము చేసి,హవిస్సులను అందుకొను సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.