Tuesday, March 3, 2020

SUCHIMASA-VARUNA

 వరదుడడిగో వరుణనామ ధారియైనాడు.శుచి మాస శుభసంకేతమును సూచిస్తూ,వశిష్ట మహాముని వేదఘోషను ప్రారంభించాడు.అంభోరుహనేత్రి రంభ నాట్యమును ప్రారంభించగనే హూ హూ గంధర్వగానము ఓహో అనేలా జతకలిపింది.ఘర్మసర్జన కిరణ ప్రసాదుని రథపగ్గములను యక్షుడు చిత్రస్వనుడు పరిసీలించి,పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.శుక్ర సర్పము స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తున్నాడు.సముద్రజలమును త్రాగు స్వామి సంసార మను సముద్రమును దాటించుటకు అవ్యాజ కరుణతో అడుగులు వేస్తున్నాడు.


  " తం వరుణం ప్రణమామ్యహం.

SUKRAMASAMU-MITRA


  చాంద్రమాన చైత్ర-వైశాఖ మాసములను (వసంత ఋతువును) పూర్తి చేసి,సౌరమాన శుక్రమాస శుభములను అందించుటకు,చంద్రుని-సముద్రమునందు మిక్కిలి ఆసక్తి గల మన స్వామి "మిత్ర" నామధారియై కనులవిందు చేయుచు కదులు చున్నాడు.అనుకూల స్వభావము కలవాడు మిత్రుడు అని వాచ్యార్థము.మన స్వామి తన కిరణ ప్రసరణము చేత తైలోత్పత్తులను-ఇంధనములను కలిగించుటకు కదులుచున్నాడు.స్వామి అనుగ్రహము వలనే మనము వాటిని గుర్తించి,ఉపయోగించుకొనగలుగుచున్నాము.

 త్రిగుణాతీతుడు(రజో-తమో-సత్వ)అత్రి మహాముని.వేదోక్త ప్రకారముగా స్వామిని కీర్తిస్తు,లాంఛనముగా రథమునకు దారిచూపుటకు సిధ్ధమవుతున్నాడు అత్రిమహాముని.జన్మాంతరమున విరాటరాజుగా భావింపబడు హా హా అను పేరుగల గంధర్వుడు పాడుతుండగా,మేనక మనోహరముగా నర్తించుచున్నది.సర్పాధిపతి తక్షకుడు పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,అప్రమత్తతో నున్నాడు.రథస్వనుడను యక్షుడు స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధానము చేస్తూ,అనవరత ధ్యానాసక్తుడైనాడు.పౌరసేయుడను రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా కదులు చున్న మిత్రస్వామి కిరణములు కళ్యాణప్రదములగు గాక.

 తం మిత్రం ప్రణమామ్యహం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...