Friday, January 5, 2024
TIRUPPAAVAI-PAASURAM-22
పాశురము-22 తిరుప్పావై-పాశురము-22 **************** నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్నం పారార్థం స్వసృతిశతసిర స్సిధ్యమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాబలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తుభూయః పూర్వపాశుర ప్రాభవము **************** నందగోపుని ఔదార్యము,స్వామి అవతార ధర్మమును గుర్తు చేస్తూనే పెరియాయ్ అని బృహత్స్వరూపమును కీర్తించటము,శత్రువులు శరనాగతికై ద్వారము దగ్గర నున్నారనిచెబుతూ గోపికలు తాము సైతముపరమాత్మ గుణవైభవమునకు ఓడి,వశులై సేవించుటకు,స్వామినికి దిష్టి తగులకుండా,మంఘళ ఆశాసవమునలతో సేవించుకొనుటకు వచ్చామని,తేజోవతమైన స్వామిచీకటికి నిదురించుట విరోధ స్వభావమని చెప్పిన గోదమ్మ, ప్రస్తుత పాశుర ప్రాభవము ************************** 1 స్వామినేత్రవిసనసౌందర్యమును వారికి అనుగ్రహించమనియును, 2 వారు స్వామి యున్న మందిరమునలోనికి ప్రవేశించినామనియును, 3.స్వామి మీ గొప్పతనమా అని అడిగినట్లు భావించి,జవాబుగా, నీలమ్మ పురుషకారత్వము,తామున్న అభిమాన రాహిత్యముకృష్ణా నీ సన్నిధికి మమ్ము చేర్చినవి అని బదులిచ్చిరి. గోపికలు, శరీరమే ఆత్మ, నేను/మేము సర్వస్వతంత్రులము పరమాత్మకు దాసుడిని కాను బంధువులే సహాయకారులు మోక్షమునకు కావలిసినది సాధనమాత్రమే భాగవతులును నాలాంటి వారే నేను ఏదైనా సధించగలను అన్న దురభిమానము తొలగి, నీ సింహానమును కింద ఉండి నిన్ను "సర్వభూపాల వాహనునిగా"కీర్తించే వరమును అహంకార శాపమును తొలగించి ప్రసాదింపుమని వేడుకొనుచున్న గోపికలను కూడిన, ఆండాళ్ అమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురము లోనికి ప్రవేశిద్దాము. ***********
" అహమును వీడి రాజసము సర్వవాహనమగు సుందరరూపము
ఇహపరమని కాంచగనీయదు సహనము లేనిదగు మాదుశాపము"
సరస సింగారభరితముగా భ్రమింపచేసిన సంసారమను,
తమోభూమిని వీడి తపోభూమిని ప్రవేశించినారు గోపికలు.కాని వారికి స్వామి దర్శనము లభించకపోవుటకు కారణము ఇంకను తమను వెంటాడుతున్న ,తమను పూర్తిగా విడువని శాపములేమో.స్వామి తన దృక్కులద్వారా వాటిని పరిహరించగలడను నమ్మకముతో,
"అకించిన్యం"-నా ఉపాధి సమర్థవంతము కానిది
"అనన్యగతిత్వం'-అది కదులుచున్నదంటే అది నీ అనుగ్రహమే అను భావనను "సర్వవాహన" సింహాసన !అను అందమైన ఉదాహరణలతో గోపికల పలుకుల ద్వారా అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఇరువది రెండవ పాశురము.
*********************
అంగణ్ మాఞాలాత్తరశర్ అబిమాన
బంగమాయ్ వందునిన్ పళ్ళికట్టిల్ కీళే
శంగం ఇరుప్పార్ పోల్వందు తలైపెయిదోం
కింగిణి వాయ్ శెయిద తామరై పూప్పోలే
శెంగణ్ శిరిచ్చిఱిదే యెమ్మేల్ విళియావో
తింగళుం ఆదిత్తనియుం ఎళుందార్ పోల్
అంగణ్ ఇరండుం కొండుం ఎంగళ్మేల్నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇళిందేలో రెంబావాయ్.
స్వప్రవృత్తి నివృత్తి అయినవేళ ప్రపత్తిగా పరమాత్మను చేరు ఆర్తిగా పరిణమించి స్వామిని ప్రసన్నుని చేస్తుంది.
ప్రతివిషయమునకు ప్రమాణములను చూపిస్తూ వారివలె మేమును వచ్చి నీ ముందు నిలిచియున్నాము అంటున్నారు గోపికలు స్వామితో.
ఎందరో రాజులు తమ అభిమానమును వదిలివేసి శరణార్థులై వచ్చి నీ మంచముకిండ కూర్చునియున్నారట.వారి శంఖముల వలె తెల్లని/సత్వస్వభావులై నీ నామసంకీర్తనమనే నాదమును/అన్యథా శరణం నాస్తి-త్వమేవ శరణం మమ".అంటు నినదిస్తున్నది ఆ శంఖము అన్నది ఒక భావన.
వారు వదిలినది దేహాభిమానము-రాజ్యాభిమానము-యశోభిమానము-నీవే వారిదగ్గరకు తరలి వెళ్ళాలనే తలపు అభిమానము.
అలా వచ్చిన రాజులు ఒక్కరు- ఇద్దరుగారు.గుంపులుగుంపులుగా వచ్చి నిన్ను సర్వవాహభూషితునిగా సంకీర్తిస్తున్నారు.
సర్వాలంకార సర్వభూషణుని సందర్శించనీయుట లేదు స్వామి మమ్ములను ఆడ్డుకుంటున్న మా శాపము.కనుక మేము మా అంతట నీ విప్పారు నేత్ర దర్శనమును వీక్షించలేము.కాని స్వామి శరణాగతులమైన మా మీద నీ కృపావీక్షణమును ప్రసరించి మమ్ములను అనుగ్రహించు కృష్ణా.
స్వామి ప్రాతికూలస్య వర్జనం-నీ నేత్రదర్శనమునకు మాకు ప్రతిబంధకములైన వాటిని/సంసార వ్యామోహములను విడిచి వచ్చాము.ఏ విధముగా రాజులు రాజ్యాధికారులమనే దురభిమానమును వీడి నిన్ను చేరిరో అదే విధముగా సంసారమనే సాంజ్యమున్నవారమను అభిమానమును వీడి నిన్ను సేవించుకొనుటకు
"అంకణ్ మాన్యాలా"-అందమైనదిగా మేము ఊహించుకొనిన భూమి
"ఇరుం కణ్ మాన్యాలా"-చీకటి భూమి యని నీ అనుగ్రహముతో
తెలిసికొని నిన్ను సర్వస్య శరణార్థులమై వచ్చాము.
"న విష్ణుః పృథ్వి పతిః"
నీవొక్కదవే రాజువి అనే జ్ఞానమును అనుగ్రహించిన స్వామి,
మాకు నీ నేత్ర వికసన సౌందర్య దర్శనమును అనుగ్రహింపుము.
స్వామి కన్నులను సిరిమువ్వలతో పోలుస్తూ మెల్లమెల్లగ
1.కింగిణి వాయ్ శెత్త-గంటకు కట్టిన మువ్వ వలె శబ్దముచేయుచు-మమ్ములను నీ మౌనమును భరించలేని శ్రవణముతో పులకించనీ.ఆ శబ్దము సౌమ్యముగానుండి మమ్ములను ధన్యులను చేయనీ.అంతేకాదు,.
2
తామరై పూప్పోలె-తామరసదళనేత్రునివలె,
మా విరహపు చీకట్లను పారద్రోలు జ్ఞానమును ప్రసరించనీ
3.తింగళుం ఆదిత్తియనుం ఎరుందార్పోల్
చంద్రుడు-సూర్యుడు ఒకేసారి ఉదయించనీయని
ఎంగళ్మేల్ నోక్కుదియేల్*
*ఎంగళ్మేల్ శాపం ఇరింద్ -
నీ చూపులు మాపై ప్రసరించి శాపమూను తొలగించు.అని వేడుకుంటున్నారు
స్వామి అహల్య.దక్షుడు మొదలగువారి శాపములను నీ స్పర్శచే,వీక్షణముచే, తొలగించిన అనుగ్రహమే మమ్ములను నీముందుంచినది నీవు కనులుమూసుకొని ఉండునట్లు చేయుచున్నది కేవలము మా పాప శాపములే.కరుణించి నీ అసమాన సౌందర్యవంతమైన-సత్కృపా వీక్షణముతో మా శాపములను హరించి,నీ దివ్య నేత్ర దర్శనభాగ్యమును ప్రసాదింపమనుచున్న నీలాసహిత గోపికల వెంటనున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం
TIRUPPAAVAI-PAASURAM-21
తిరుప్పావై-పాశురం-21
****************
నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థం స్వసృతిశతసిరస్సిద్ధమధ్యాపయంతీ
స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తుభూయః.
పూర్వ పాశుర ప్రాభవము
********************
నీళాదేవి పురుషకారమును కీర్తించిన గోదమ్మ/గోపికలు స్వామి సర్వజ్ఞత్వమును-సర్వాత్మకత్వమును సంస్తుతించి,స్వస్వరూప దర్శనమునకై అద్దమును,స్వామి వ్యాపకత్వ సంకేతమైన విసనకర్రను,స్వామిని అనుగ్రహించమని,వారికి మేలుకొలుపులు పాడిరి.
ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము
*************************
అమ్మను/గోపికలను నీళాదేవి అనుగ్రహించినదా/ఉపాయమును సూచించినదా యన్నట్లుగా,వారు స్వామి ప్రస్తుత అవతార విశేషములను కీర్తిస్తూ,అవతార ధర్మముగా గోకులము లోని గొల్లెతలను అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తున్నారు.
నందగోపుని ఔదార్యమును మాత్రమే కాకుండా,నందవ్రజము లోని గోవుల ఔదార్యమును సైతము కీర్తిస్తున్నారు.
అంతే కాకుండా బాణజితులు-గుణజితులు అను అంశమును మనకు చెబుతూ,స్వామి భుజపరాక్రమమును-అవ్యాజ కరుణను కీర్తిస్తున్నది.
స్వామి తేజోమయ స్వరూపము.చీకటి-నిద్దుర దానికి వ్యతిరేకములు కావున నీవు మేల్కాంచి,నీ తలుపు దగ్గర పరాజితులై శరణుకోరి నిలబడిన శత్రురాజులను,ఐహిక ప్రలోభములనే అరులను తొలగించుకుని నిన్ను చేర వచ్చిన మమ్ములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు గోపికలు.
మేము నీకు ఎటువంటి ఆపదలు రాకూడదని నీకు మంగల ఆశాసనమును చేయుటకు వచ్చామే తప్ప మరే ఆపేక్షతో కాదు అంతూ స్వామి బృహత్స్వరూపమును ,కృష్ణా అంటూ "పోట్రి" పాశురమును సూచించిన ,
ఆండాల్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురము లోనికి ప్రవేశిద్దాము.
ఇరవై ఒకటవ పాశురము
*********************
ఏట్రి కలంగళ్ ఎదిర్ప్పొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్శొరియం వళ్ళల్ పెరుపశుక్కళ్
ఆట్ర పడైత్తాల్ మగనే అరివురాయ్
ఊట్రం ముడైయాయ్ పెరియాయ్ ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే తుయిళెలాయ్
మాట్రార్ ఉనక్కు వలితురైందు ఉన్ వాశల్ కణ్
ఆట్రారు వందు ఉన్ అడిపడియు మాపోలే
పోట్రియాం వందోం పుగళేందో రెంబావాయ్.
ఓం నమో ఆశ్రితవత్సలాయ నమః
***************************
గోపికలకు తలుపు తెరిచి,నీలాదేవి వారికి స్వామి ప్రస్తుత అవతార రహస్యములను ప్రస్తుతించుట తగిన ఉపాయముగా బోధించి,తానును వారిపక్షమై,స్వామిని మేల్కొలుపుచున్న భావనతో,గోదమ్మ
ఈ పాశురములో స్వామి నడయాడు గోకుల వైభవమును నాలుగు ఉదాహరణలతో తెలియచేస్తున్నది.
అవి,
1.గోవుల ఔదార్యము. ఆ గోవులు ఎటువంటి స్వభావమును కలిగియున్నటువంటివి అంటే,
మాట్రాదే-ఎంతో దయార్ద్రతను కలిగి
వల్లాల్-ఔదార్యతను కలిగి,
వాటి దూడలతో పాటుగా,
స్వామి ఆరగింపునకు,ఆనందముతో,
ఏట్రా-పితుకుటకు పట్టుకుని యున్న,
కలంగళ్-కడవల,
మీదళిప్ప-మీదినుండి-పైనుండి,
ఎదిర్-పాలను,
పొంగి-పొంగిపోయి,పాల్ శోరియుం-పాలను వర్షిస్తున్నాయి.
ఆ పాలు గోవుల పొదుగుల నుండి వస్తున్నాయా లేక కడవలు ఆనందముతో,స్వామిపై అర్చన భావముతో తమకు తామే పాలతో పొంగిపోతున్నాయా యన్నట్లు తమ ప్రాభవమును ప్రకటిస్తూ-ప్రకాశిస్తు ఉన్నాయట.
అంతరార్థమునకు వెళితే వల్లాల్ పెరుం పశుక్కళ్-ఔదార్యముతో/అనుగ్రహముతో జ్ఞానమును పంచుచున్న ఆచార్యులు
కింద పట్టుకున్న కడవలు-విధేయతతో వినయముగా అర్థిస్తున్న శిష్యులు.
పొంగిపొరలుతున్న పాలు వారికి లభించిన ఆచార్యానుగ్రహ జ్ఞానము.
గోవులు పాలను వర్షిస్తున్నాయి అంటే ఆచార్యులు జ్ఞానమును అందించిన ఆనందముతో ఉన్నారు,
కడవలు పాలను వర్షిస్తు,పొంగిపోతున్నాయంటే,అందిన జ్ఞానసంపన్నులై శిష్యులు ఆనందిస్తున్నారు.
గురు-శిష్య సంబంధ ఉదాత్తను చాటుచున్నది "వల్లాలై" అను పదప్రయోగము.
2 రెండవ ఉదాహరణ.ఉషోదయము.పాలతో నిండి పొంగిపోతు కడవలు ప్రకాశిస్తున్నాయి.అదేవిధముగా చీకటిని పారద్రోలిన వెలుగురేఖలు నిశ్చలముగా నిలబడి స్వామిసేవకై ఎదురుచూస్తున్నాయట.స్వామి,
పెరియవ-ఆదిపురుషుడు./బృహత్స్వరూపుడు
అవ్యాజ అనురాగముతో గోకులములో,
ఉలగనిల్-ఈ లోకములలో,లీలగా,
మగనే-నందగోపుని కుమరునిగా కీర్తింపబడుతున్నవాడు.
స్వామి నీ సంతతి యైన,
మాకు దర్శనభాగ్యమును ప్రసాదించుటకు మేల్కాంచు తండ్రీ.
ఆట్రై పటైందాన్ -నీ అసంఖ్యాకమైన సంతతి నీ దర్శన భాగ్యమునకై ఎదురుచూస్తున్నారు.
3. శుడరే-వెలుగు/స్వామి జ్యోతి స్వరూపుడు.నిదురించుట అను ఒక మర్యాదను ఉపాధి ధర్మముగా అభినయిస్తున్నాడు.
నిన్ర-నిలబడి/నిశ్చలమి
తోట్రుమాయ్-ప్రకాశిస్తున్నై/నిన్ను ప్రస్తుతిస్తున్నది.
జ్ఞానమయమైన గోకులమును ఆశీర్వదించుటకు మేలుకో స్వామి.
3.ఉట్రం ఉడయాయ్-అరివీర భయంకరుడా,
మాట్రార్-నీ భక్తులను బాధించుటచే,నీకు శత్రువులుగా మారినవారు,నీ చే యుధ్ధములో ఓడి/గెలువలేక,సామంతులుగా తమను అనుగ్రహించమని,
నీ ఉళితొళియ-నీ భుజపరాక్రమమును కీర్తిస్తు,
ఉన్ వాశల్కణ్-నీ గడప దగ్గర వేచియున్నారు.వెలుగురేఖలు వారి పరిస్థితిని మాకు విశదపరుస్తున్నవి.
అంతేకాదు,వారు శత్రువులుగా నిన్ను చేరినారు.నీ
ఉన్ అడిపణియుం-నీ పాదములదగ్గర చో టును కోరుకొనుచున్నారు.వారు జితబాణులు.
వారే కాదు మేము కూడ,
4.ఉన్ అడి పణియుం.నీ పాదములవద్ద చోటును కోరుకొనుచున్నవారలము.కాని శత్రువులమై కాదు.
మిత్రత్వ బంధము మిమ్ములను విడిచివెళ్ళుటకు ఇష్టపడుటలేదు.మేము జితగుణులము.నీ సగుణములచే జయించబడినవారలము..
కనుక,కన్నా!
స్వచ్చంద మనస్కులమై,
నీవు క్షేమముగా ఉండాలని,లోకములకు క్షేమంకరుడవని
పుగిళిందు-నిన్ను కీర్తించుటకు,నీకు,
పోట్రియుం పుగళిందు-మంగళహారతులనిచ్చుటకు,
వందుం-వచ్చియున్నాము.వీడలేక నీ దర్శనమునకై ఎదురుచూచుచున్నామని అంటున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము ఎదురుచూద్దాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...