Tuesday, November 5, 2024

TANOTU NAH SIVAH SIVAM-05

 


   

  తనోతు నః శివః శివం-05


  *****************



 


 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే


   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"


     "శివగంగ శివమెత్తి పొంగగా

      నెలవంక సిగపూవు నవ్వగా

      హరిహరాత్మకమగుచు

      అఖిలప్రపంచమ్ము

         ఆనందమయముగా


      భవతిమిరహంశుదా 

      విశాలాక్షికై నిటాలాక్షుడే

         " నటకా వతంసుడై"

      తకధిమితక యని 

         నటనం  ఆడెనే.(శ్రీ  వేటూరి)


     తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.


  కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.


    ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.


  ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,


 " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం" గా ప్రవేశించింది నాట్యవేదికకు ఆ ఆనందదాయిని నందిని అద్భుత సహచరియై ఆనందతాందవమునకై.



    ఆ అద్భుత సౌందర్యరాశిని  వీక్షించగలగటం స్తుతించగలగటము సామాన్యురాలినైనా నా తరమా?


   అమ్మ అనుగ్రహము దానికి మార్గమును చూపించింది


 "త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే కథమపి తులయితు."

   తులయితు-వర్ణించుట,కథమపి-వీలుకానిది.


    తల్లీ నీ సౌందర్యమును వర్ణించుటకు బ్రహ్మాదులే సమర్థులు కామంటున్నప్పుడు నేనెంత ?  కాని నిన్ను దర్శించగల శక్తిగల  నేత్రము కేవలము సదాశివునిది మాత్రమే.కనుకనే , 

   ఏవిధముగా అమరలలనలు ,


 యత్-ఆలోక-ఉత్సుకతతో,

       

  గిరిశ మనసా తపోభి

    పరమేశుని సహాయమునకై మనసారా తపమాచరించి-తరించారు.

      

     ఏ నయన వీక్షణము ద్వారా వారు,


   తమ  మనోభీష్టమును పొందినారో,అదే కరుణ మనందరికి సైతము అమ్మదివ్యసౌందర్య దర్శనాశక్తిని అనుగ్రహించును గాక.


   అమ్మ నాట్యస్థలికి మామూలుగా రాలేదు.విలాసబంధు బంధురముగా వచ్చినదట.(పంచకృత్యములే అమ్మకు విలాసము కదా)

    అమ్మ లీలా కల్పిత బ్రహ్మాండ మండల కదా.


 బంధు-అలంకారములతో-,బంధుర-నిండినదై వచ్చినదట.


    అవి  మనము చేసుకునే మానవ అలంకారములు కాదు.(అమ్మ ధరాధరేంద్ర నందిని).లీలగా/విలాసముగా 


పంచభూతములను,పంచ తన్మాత్రలను,నదీజలములను,కొండలను-గుట్టలను,చెట్లను,పశుపక్ష్యాదులను,సూర్యచంద్రులను,నక్షత్రములను సకల చరాచర జగత్తులో చైతన్యముగా ప్రకాశిస్తూ,స్వామి తాండవము చేయు స్థలికి వచ్చినదట.


    అంటే శివ సృష్టిని శక్తివంతము చేస్తున్నది తల్లి.ఆ తల్లిని చూస్తూ మహాదేవుడు మరింత మురిపెముగా నర్తిస్తూ దిక్కులను తన తాండవముతో తన్మయత్వముతో ప్రకటించేస్తున్నాడట..

   అష్టమూర్తి నమోనమః


    స్వామి విశ్వ విస్తరణమునకు హద్దులు నిర్ణయించే సమయమాసన్నమయినట్లున్నగా అమ్మ స్వామి కృపాకటాక్షవీక్షణముతో  దిగంబరుని -చిదంబరునిగా మార్చివేసినది.వారిరువురి కృపాకటాక్షవీక్షణము  "క్వచిత్"అరుదైనది-అపురూపమైనది కనుక దుర్ధరాపదలను నిరుద్ధ నిర్మూలించుచున్నవై "నిత్యకళ్యాణమును "జరిపించుచున్నవి ప్రమోదముతో. 


     మహాద్భుతమైన తాందవము స్వామిని-అమ్మను-మనందరిని  ప్రమోద మానసులుగా మారుస్తున్నది.

     తాండవము-ప్రేక్ష్సకుడు అను రెండు విషయములున మోదము.

     తాండవము-నర్తకుడు-ప్రేక్షకుడు అను మూడు అంశములు ఒకేక బ్రహ్మపదార్థస్థిని పొగలుగుట ప్రమోదము.(అంతర్లీనమగుట)

   దృశ్యము-ద్రష్ట-దృష్టి అను మూడు అంశములు ఒకదానిలో మరొకటి మమేకమై మరొకటి గుర్తించలేని స్థితిలో నుంచుటయే "ప్రమోదము "కదా.



    తాండవము-తాండవించువాడు-తాందవమును దర్శించువారి సర్వం ఖలువిదం బ్రహ్మముగా మార్చుటయే మహాదేవుని మంచితనము.



   మరువకు శివనామం మదిలో ఓ మనసా

   ఇహపర సాధనమే -సురుచిర పావనమే.


     కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

       భజశివమేవ నిరంతరం

            ఏక బిల్వం శివార్పణం.






TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...