శాత్తుమరై పాశురము-29
******************
"ఆలకించనీయననదు నీ అనురాగపు ఆంతర్యము
ఆలసించగనీయదు అనుమతింప నిత్యకైంకర్యము"
మంగళప్రదమైన పాశురములో ఇష్టప్రాప్తి-అనిష్ట నిర్మూలనము ను స్పష్టము చేయించి ఇటు ఏడుతరములను-అటుఏడు తరములను స్వామి అనుగ్రహప్రాప్తులను (మన పూర్వీకులను-ఉత్తర వంశస్థులను) ఉద్ధరించుటయే కాక,రంగనాధుని అనుగ్రహమును పొంది-కొత్త పెళ్ళికూతురుగా ముస్తాబవబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,వారనుగ్రహించనంతమేరకు (వింజామర) పాశురమును అనుసంధానము చేసుకునేందుకు ప్రయత్నమును చేద్దాము.
ఇరువది తొమ్మిదవ పాశురం
**********************
శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ తుణ్ణం కులత్తిల్ పిరందు నీ
కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు
ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా
ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు
ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వోం
మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్.
గోపికలు ప్రథమ పాశురము నుండి స్వామి పఱ ను తమకు అనుగ్రహిస్తాడని-దానిని స్వీకరించి నోమును నోచుకుందామని ప్రతిపాశురములో చెబుతున్నారు.
ఒక్కొక్క పాశురములో వారు ఆచార్యుల అనుగ్రహముతో ఒక్కొక్క విషయమును ఒక్కొక్క వస్తువులను బహుమతులుగా పొందుతున్నారు.సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపము సైతము వీరి పక్షమునకు వచ్చి స్వామిని అనుగ్రహించమంటున్నది.అంతే స్వామి సైతము వర్షములను-పాడిపంటలను-శంఖ -చక్రములను-నోమునకు కావలిసిన వస్తువులను,నోచుకొనువారికి కావలిసిన ఆభరనములను అనుగ్రహించాడు.వారు స్వామితో మేము నీ నుండి అర్థిస్తున్నది నీ సంశ్లేషణము.పఋఅ ను అనుగ్రహిస్తే కాదనము అని రాజీకి వచ్చారు.కాని విచిత్రము వారు ఇప్పుడు పూర్తిగా ఇన్నిరోజులు వారు స్వామిని అర్థించిన పరను కోరుటలేదు అంటున్నారు.మాకు అసలు పఱ వద్దంటున్నారు.కాని స్వామి బ్రహ్మీ ముహూర్తములోనే శుద్ధులమై నిన్ను సమీపించి,నీ పాదపంద్మములను కీర్తిస్తూనే,మాకు కావలిసిన దానిని నిశ్చయ జ్ఞానముగా (ఇంక ఏమీ మార్పు ఉండదు) అర్థిస్తున్నాము
కేళిరో-వినవలసినది.అంటున్నారు.
సంభ్రమాశ్చర్యములతో స్వామి వీరిని చూస్తున్నాడు.అయితే నేనిచ్చినవన్నీ కాక మరేదైనా మీరు నా అనుగ్రహముగా కావాలని అర్థిస్తున్నారా అని అడిగాడు.(అర్థమయినప్పటికిని)అదొక వేడుక.
అంతే అదే అదునుగా స్వామి నీవు జ్ఞానివని యోగులు ముక్తపురుషులు అనగా విన్నాను కాని అదంతవరకు నిజమో తెలియుటలేదు.మరొకసారి చెబుతాము విను.కాదనకు.ఇదే మా అసలయిన కోరిక.కన్నులార్పకుండా స్వామి వారిని కాంచుతున్నాడు.
"విను.నేను ఒకపరి కస్తురిని నీ నుదుటను అలంకరిస్తాను.ఊహు.తృప్తిగా లేదనకో.నేనే.ఒకపరి కస్తురి కుంకుమగా మారి నీ నుదుటను పరిమళిస్తూ-ప్రకాశిస్తాను.నీ సిగను చుదతాను.కాదుకాదు శిఖిపింఛమునవుతాను. కౌస్తుభమణి నవుతాను,కంకనముగా మారతాను.కాలి అందెనవుతాను.ఘల్లుమంటుంటాను.ముక్కెరనవుతాను.చక్కదనమునిస్తాను.నా సఖి వేణువవుతుంది.నేనుమోవి చేరతాను.మధువులు చిందిస్తాను.మాధవా అంటాను పీతాంబరమునై నిన్ను పొదవుకొంటాను.నేనొకసారి నా చెలులింకొకసారి మారి మారి నిన్ను చేరి మైమరచిపోతాము.హరిచందమవుతాము.అయీఅ .ఇంకా తనివి తీరటము లేదు.ఆగు కృష్ణా.స్వామి కొంచము సమయమునిస్తే అందరము కలిసి ఒకే ఒక సౌభాగ్యమును అర్థిస్తాము అన్నారు గోపికలు.ఏమనగలడు వారి ఎడదనెరిగినవాడు?కాదనగలడా? కామినుల వీడి కదలగలడా?కటాక్షించటమే కాని ఇతరము తెలియనివాడు.విస్తుపోతున్నాడు.అంటే అంటే
కాని మాకామితమును అడ్దగిస్తున్నదయ్య ఒకటి.దానిని నిశ్సేషముగా నిర్మూలించు.
మత్తైనం కామంగళ్ మాట్రు ఓ గోవిందా.
మా విష(య) వాసనలు అడ్దుకుంటున్నాయి.వాతిని మట్టుపెట్టు.అర్థమైనది
నిత్యకైంకర్య సేవాసౌభాయమును నిశ్చయమనముతో కోరుకుంటున్నారు మీరు అంతేనా అన్నాడు.
అంతే కాదు మాకే కాదు
ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం -మా ముందరి ఏడుతరాలకు-మా అనతరపు ఏడుతరాలకు నిత్యకైంకర్య భాగ్యమును ప్రసాదించు అంటూ వారు
తాము ఏ విధముగా శ్రీనోముద్వారా నాలుగవ అవస్థలోని చేర్చిన స్వామిని స్తుతిస్తున్నారు.
మొదటిది యతనావస్థ.
******************
కోరికలను ప్రయత్నపూర్వకముగా నియంత్రించుకొనుట
పాలు తాగము-నెయ్యి తినము-కాటుకను అలంకరించుకొనము-పువ్వులను ముడుచుకొనము.కొండెములు చెప్పము అంటొ ఏమీ చేయవలెనో-చేయకూదదో తెలుపుతు పాటించుటకు చేయు ప్రయత్నము.
వ్యతిరేకావస్థ
**************
వదిలివేశామనుకుంటారు కాని వాటిఛాయలు కనిపిస్తుంటాయి తలపులలో-మాటలలో.
అదేవారు గోపికలను మేల్కొలుపునప్పుడు చేయు నిందారోపనములు-నీలాదేవిని అర్థించునపుడు స్వామిని అనుగ్రహించమనుట మొదలగునవి.
కేంద్రీకృతావస్థ
*********
లక్ష్యము పైననే మనసును-ఇంద్రియములను కేంద్రీకరించి స్వామిని ఆహ్వానించుట,గోకులక్షేమమునకై కర్తృత్వ భావమును వీడి కర్మాచరనమునందాసక్తిని చూపుట-సమాశ్రయణ సంస్కారములను అనుగ్రహించమనుట-భోగత్వమైన కూడారై ను ప్రస్తావించుట మొదలగునవి.
వశీకరణావస్థ
***************
ఇదియే నిత్యకైంకర్యానుగ్రహమను పరమావధిని గుర్తించి పరమాత్మను వేడుకొనుట.పఱను మించినది పరమాత్మ తత్త్వమని గ్రహించి చేతనుడు చైతన్యముగా మారుట.తానేకాదు తనవారినందరిని అనుగ్రహించమని సకలచేతనులను పరస్పరాశ్రితులుగా అనుగ్రహించుచున్న,నిత్యశుద్ధ విభూతి
"కస్తూరి తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం
కరతలే వేణుం
కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేశ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్ఠితుడైనాడు గోవిందుని,
రంగనాధునిగా పెండ్లికొడుకు చేయించు వేళ మనమ0దరము కనులారా కాంచుటకు తనతో పాటుగా మన చేతిని పట్టి తీసుకుని వెళ్ళుచున్న,
ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణం.