Posts

Showing posts from September 22, 2020

PRAPASYANTEE MAATAA-07

Image
. ప్రపశ్యనీ మాతా-07 *********************** యాదేవి సర్వభూతేషు ధూమావతి రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః. " ఏకానేక రూపములు దేవి క్రీడలు" ఏకం సత్ విప్రా బహుదా వదంతి.ఒకే ఒక మూలమును విశేషప్రజ్ఞకలవారైన వారు బహువిధములుగా దర్శించి-తాదాత్మ్యమును పొందుతారు. పొగనుండి పుట్టినదని కొందరు-పొగచే కప్పబడినదని కొందరు తల్లిని ధూమావతి అని సంబోధిస్తూ-సంకీర్తిస్తుంటారు. పొగ-నిప్పు అను ద్వంద్వములుగా ప్రకటింపబడుతు క్రమేణా నిర్ద్వంద్వతను మనకు పరిచయము చేస్తుంది తల్లి.నామరూపాతీతమైన నెనరును చూపిస్తుంది. తల్లి క్రీడాసక్త కనుక మనతో దాగుడుమూతలు అను ఆటను తన ఆవరణ-నిక్షేపక గుణముల ద్వారా ఆడుతుంది.మనకు అర్థము చేయిస్తుంది.ఉదాహరణకు మన చర్మచక్షువులు ఒక మఱ్ఱి విత్తనమును చూశాయనుకోండి.అవి దాని కొమ్మలను ఊడలను మిగిలిన శాఖలను చూడలేవు.ఎందుకంటే అమ్మ విత్తులో వాటన్నిటిని దాచివేసి,పైకి కనపడకుండా చేస్తుంది.అదియే మాయ ఆవరణ.అదే విత్తనము పంచభూతాత్మక సమ్మిశ్రితమై మహావృక్షమై మన కనులకు మనసుకు విందులు చేస్తుంది.అదే ప్రకటనమనే నిక్షేపకము.అదే విధముగా జగద్వ్యవహారములను నడిపిస్తుంది తల్లి...