"అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి; త్రావుమన్న!రా
వన్న; శరీరధారులకు నాపద వచ్చిన వారి ఆపదల్
గ్రన్నన మాన్ చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముడొక్కడు చుమ్ము పుల్కసా!( రంతిదేవుడు)
చిదానందరూపా-మారనారు
**********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
ఇలియాన్ కుడి గ్రామనివాసి ఈశ్వరభక్తుడు
మారనారు నాయనారు మహేశ్వర సేవాసక్తుడు
విభూతి-రుద్రాక్షలధారులు విశ్వేశ్వరుడనుకొను
విధివిధాన చేసిన సేవలు శాశ్వతమనుకొను
పరమ ఉత్సుకతపూరిత నిత్యోత్సవములే అట
పెరిగిన భక్తి పెంపున ధనమును కరిగించినదట
వానకు తోడుగ నిలిచెను అతిథిగ శివుడే వాకిట
నాటిన విత్తులవిందే సాక్షాత్కారమునకు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చుగాక
మాతృదేవోభవ-పితృదేవోభవ-ఆచార్య దేవోభవ-అతిథి దేవోభవ అన్న కర్మభూమి జనించిన ఆ మారనారు అతిథికి మొదటిస్థానము నిచ్చి అతిథిసేవలో ఆ ముక్కంటిని చూచుచు మురిసిపోయేవాడు.తాము పొందుచున్న ఆత్మానందము తరిగిపోచున్న సంపద గురించి,కించిత్తయినను ఆలోచించనీయలేదు.ఈశ్వరేచ్చను శిరసావహిస్తూ,తాము పస్తులున్నా అతిథిసేవను వీడలేదు.ఆవేదన పడనులేదు.
అన్నీ సమృద్ధిగా నున్న తరుణమున చేసే అతిథిసేవకన్నా అలభ్యతయైన వేళ చేయునదియే కదా అంతరార్థమెరిగినది.అంత్యమున మోక్షమునిచ్చునది.వీరి భక్తిని ప్రపంచవిఖ్యాతము చేయని యెడల నేను "పితా దేవో మహేశ్వర:" కానేకాను అంటూ ,కుండపోత వర్షములో ,నిండు దీవెనలనందీయ తరలి వచ్చి తలుపు తట్టాడు అతిథి.
.తరింప చేయ వచ్చిన వానిని సాదరముగా ఆహ్వానించి,మార్చుకొనుటకు పొడి వస్త్రములనిచ్చారు ముడిపడిన భక్తితో.కథ నడుపుట తెలిసిన నిధనపతి తనను ఆకలి దహించివేస్తోందని,ఆహారమును కోరెను ఆ పాపహరుడు.స్వామితోపాటు ప్రవేశించిన అన్నపూర్ణదేవి,నాయనారు భార్యను స్పృశించినది.వేదవ్యాసునికి కన్నతల్లిగా కడుపునింపిన ,బుద్ధులు నేర్పించిన తల్లి,అతి చమత్కారముగా పొలములో నాటిన విత్తులతో,నీటితో తేలుతున్న ఆకుకూర సాదమును అర్పించి,స్వామి దివ్య ప్రసాదము గావించినది.హర హర మహాదేవా-శరణు శరణు.విశ్రమించిన అతిథి ఉదయమున కానరాలేదు. వారిని
అనుగ్రహించుటకు అతిథి అర్థనారీశ్వరుడై వారిని అనుగ్రహించినట్లు మనలనందరిని అనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.).