Friday, March 3, 2023

SIVATANDAVA STOTRAMU(ANUGRAHAMU)-15

 పూజావసానసమయే దశవక్త్రగీతం యః

శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15.


 ప్రస్తుత శ్లోకము కథాపరముగా అన్వయించుకుంటే పూజను ముగించే సమయమున,సాయం సంధ్యా సమయమున చదివినటయితే అశ్వములు-ఏనుగులు-రథములు లభించుటయే కాక అవి మరలిపోక స్థిరముగా ఉంటాయని చెప్పబడినది.పది నాలుకలు కల రావణుడు దీనిని పఠించినట్లు-పరమేశ్వరునిచే అనుగ్రహింపబడిన కథనము కలదు.ఒక విధముగా ఇది సంప్రదాయ మంగళాశాసనము.సంపదలను అనుగ్రహించేవాడు శంకరుడు.అనగా సంకరుడు అను నామము-శిరముపై జటలు-గంగ-చంద్రవంకను ధరించి,మెడలో పాములను హారములుగా ధరించి,డమరు నాదమును మ్రోగించుచు ,అమ్మ పార్వతీదేవిని కూడి తాండవమాడు స్వామిని స్మరించుకుంటే అసమాన సంపదలను పొందుతారని ఆర్యోక్తి.

 కాని కొంచము నిశితముగా పరిశీలితే ఎన్నో విశిష్ట పదముల వివరణను గ్రహించగలిగితే మనము తప్పక మన మనసును పరమేశ్వరార్పనము చేయకుండా ఉందలేము.


  స్వామి తాందవమును వర్ణించిన సాధకుడు ఆ పవిత్ర తాండవము తనలో కూడా నిరంతరము జరుగుచున్నదని,ఆ నర్తనమును గమనించుకొనుటయే లక్ష్మీ సుముఖత్వముగా గ్రహించగలగాలి.

 తన స్వస్వరూపమును అర్థముచేసుకొనుటయే పూజ.పూజానంతరము పఠించుట అని చెప్పబడినది.

 తన నిజస్థితిని గ్రహింపచేయునదియే "దశవక్త్ర గీతం."

 పదినాలుకలు పలికిన పదితలల వాని విరచితమైన స్తోత్రమిది అంటుంది కథనము.

 పది ఇంద్రియములు(ఐదు జ్ఞానేంద్రియములను-ఐదు కర్మేంద్రియములను చైతన్యవంతము చేయునది శివతాందవము అంటుంది విచక్షణ.

  పంచభూతములను-పంచ తన్మాత్రలను సమస్థితిలో నుంచునదే శివతాండవము అంటుంది ప్రకృతి.

 పంచకృత్యములను-వాటి సమన్వయమును తెలియచేయునది స్వామి తాందవము అంటుంది సనాతనము.

 దశదిశలను సమన్వయ పరచుట అంటుంది మరొక వాదము.

 ఏది ఏమైన ఎవరు ఏ విధముగా అన్వయించుకొనిన మనలోని వివేకమును జాగృతపరచునది తాండవ స్తోత్రము.

 కనుకనే నీవు కనుక దానిని గమనించి గౌరవిస్తే నీ తమోభావము తొలగి నీ మనసనే గుఱ్ఱము నిన్ను అనుసరిస్తు,రథమనే నీ ఉపాధిని ఉన్నతముగా మలచి,నిన్ను ఉధ్ధరిస్తుంది.

  ఏక బిల్వం శివార్పణం.




TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...