TANOTU NAH SIVAH SIVAM-05@ SIVATANDAVASTOTRAMU
తనోతు నః శివః శివం-05 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు. కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని. ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది. ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా, " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం" గా ప్రవేశించిది నాట్యవేదికకు ఆ ఆనందదాయిని నందిని అద్భుత సహచరియై ఆనందతాందవమునకై. ఆ అద్భుత సౌందర్యరాశీని వీక్షించగలగటం స్తుతించగలగటము సామాన్యురాలినైనా నా తరమా? అమ్మ అనుగ్రహము దానికి మార్గమును చూపించింది త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే కథమపి తులయితు. తల్లీ నీ సౌందర్యమును వర్ణించుటకు బ్రహ్మాదులే సమర్థులు కామంటున్నప్పుడు నేనేంత? కాని నిన్ను దర్శించగల శక్తిగల నేత్రము కేవలము సదాశివునిది మాత్రమే.కనుకనే ,ఏవిధము...