Monday, November 4, 2024

TANOTU NAH SIVAH SIVAM-04




 



      తనోతు నః శివః శివం-04

      *********************

 "వాగర్థావివ సంపృక్తౌ  వాగర్థ ప్రతిపత్తయే

  జగతః  పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."

               (మహాకవి కాళిదాసు)



   మనలను తరింపచేయుటకు మహాదేవుడు మనోహరముగా తాండవమును ప్రారంభించాడు.తననుదుటి శోభలను మరింత శోభాయమానము చేస్తూ.

    ఆ శోభలను తిలకించి పులకించిపోదాం.

1 జటా కటాహ సంభ్రమ భ్రమ న్నిలింప నిర్ఝరీ

   ఎంతటి వాక్చమత్కారము.భ్రమ -సంభ్రమ అంటూ

  భ్రమణము-తిరుగుతోందిట గంగమ్మ.కాని మామూలుగా తనకు నచ్చినట్లు కాదు.తాండవ ప్రారంభమునకు ముందు ప్రశాంతముగా ప్రవహించిన ఝరీ-నదీప్రవాహము/నిర్ఝరీ-జీవనదీప్రవాహము/నిలింప నిర్ఝరీ-దివ్యమైన జీవనదీ ప్రవాహమునకు,

 సంభ్రమ-భయముతో కూడిన ఆశ్చర్యము కలిగినదట.

   దానికి కారణము జటాటవి అనుకున్న స్వామి కేశపాశము "జటాకటాహము"గా తన రూపును సవరించుకున్నది.

    ( నామిత్రులు ఇచ్చిన సలహామేరకు ఒక్కసారి గంగావతరణమును తలచుకుంటాను.) గంగమ్మ తానెటు పోవాలో తెలియక ఉన్నవేళ మహాదేవుడు తన జటలో అమరికగా పొందుపరచుకున్నాడు కదా.మళ్లీ అదే పరిస్థితి.ఎటు పోవాలో తెలియక గంగమ్మ ఆ పెద్ద గంగాళము వంటి స్వామి జటాజూటములో సంభ్రమాశ్చర్యములో సుడులు సుడులు తిరుగుతుండగా , ఆ  పరిభ్రమణము
    స్వామి నుదుటను ఆ తరంగములప్రకాశముగా  పరావర్తనము చెందినదట.

2.విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధనీ.

    గంగమ్మ వీచి-తరంగములు,విలోల-సుడులు తిరుగుచుండగా,

    ఎంతటి మహద్భాగ్యమును పొందుతున్నాయో వాటి కాంతులు

   మహాదేవునీ మూర్ధనీ-లలాటమును మరింత ప్రకాశవంతము చేస్తూ  సేవించుకుంటున్నాయి.

     ఈశ్వర చైతన్యము జలములో దాగి దాని ప్రవాహపు వేగమును పెంచుతూ ,కొత్త ఒరవడులను నేర్పి చిత్రములు చేయుచున్నది.ఓం నమః శివాయ.,

   ఇది గమనించిన పరమేశ్వరుని ఫాలనేత్రము 

3 ధగద్ధగ ద్ధగ జ్జ్వలల్లలాట పట్ట పావకే

      ధగధగలాడే     ఎర్రటి పట్టు ఉత్తరీయముగా   సొబగులు దిద్దుకుంటూ  స్వామి నుదుటను  ఎర్రటి తలపాగ తానైనది.., 


 4.కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ.


    అంతలోనే అమ్మో! స్వామికి వేడి తగులుందంటూ సన్నని చంద్రరేఖ సిగపూవుగా మారి శిఖను చేరింది.

    చంద్రశేఖరుని చేసింది ఈశ్వర చైతన్యము మురిసిపోతున్నది కొత్త సిరులతో.

     అదేమి విచిత్రమో కాని నా మనసు ఆ సుందరమూర్తితో ప్రతిక్షణము ఆడుకోవాలనుకుంటోంది.

    కాపాదమంటూ వే(ఆ)డుకుందాము ఆదిదేవునితో.

  

     విశేషములు

      ********

 1.కాలనిర్ణయమునకు  సంకేతముగా  కిశోరచంద్రుని పరిచయము.

   అలంకారము మాత్రమే కాదు,

    ముందు ముందు చరణములలో ఈ

   కిశోర చంద్రశేఖరుడు-తనకు జతను తెచ్చుకుని (శక్తివంతుడై)

   చకోర బంధుశేఖరుడుగా మారతాడు.

 2.హావభావముల పరిచయముగావింపబడినది.సృష్టి విస్తరణముతో పాటుగా మనోభావములు,
   పరిచయమవుతున్నవి.

    గంగమ్మకు సంభ్రమము-స్తోత్రకర్తకు "రతి" మిక్కిలి మక్కువ  ప్రకృతిసిద్ధములుగా ప్రస్తావింపబడినవి.

 3.పంచభూతములలో మూడవదైన "అగ్ని తత్త్వము" పరిచయమైనది.

 4.మనకు తెలిసిన వస్తువులతో మహదేవుని జటలను గంగాళము అంటూ,జ్ఞాన నేత్రమును ఎర్రటి ఉత్తరీయము అంటూ పోలికలను చెబుతూ,తెలిసిన వాని ద్వారా తెలుసుకోవలసిన దానిని చూపెడుతూ స్తోత్రము  పరమాత్మకు/ స్వామికి మనలను మరింత సన్నిహితులను చేస్తున్నది.

    కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ

      భజ శివమేవ నిరంతరం.

            ఏక బిల్వం  శివార్పణం.






No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...