Friday, October 13, 2017

SAUMDARYA LAHARI-64


     సౌందర్య లహరి-64

  పరమ పావనమైన  నీ పాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  భయ నివారణమైన నీ అభయ హస్తపు ముద్ర
  వరప్రదాయకమైన  నీ వరదహస్తపు ముద్ర

  నీ మూర్తిలో కానరాకున్న ఏమి?
  కామితార్థములన్నీ నీ కాలిధూళి ఈయగా

  నీ చేతులలో ముద్రలు చేరుట  సాహసమేగా
  నేను అగాథ జలధిని మునిగిన నీ అవ్యాజ కరుణ

  దరిచేర్చగ చేరినది కంటికి రెప్పయై
  ఉప్పొంగుచు సాగుచున్న తెప్పోత్సవమైన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-65


   సౌందర్య లహరి-65

  పరమ పావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  అన్ని ఆకారములకు మూలమైన నిరాకారము నీవని
  అన్ని రాగములకు ఆలవాల నీరాగము నీవని

  భవ సం హారమును చేయు  భావనా సంతుష్టవని
  ఏ వర్ణము లేని సూర్యకాంతి సప్తవర్ణమగునను

  ఏ రూపము లేని కాంతి ఎన్నో రూపముల భాతియని
  కనుగొని నంతనే నా ఉలికిపాటు తొలగిపోయి

  మెలకువతో నా ఉనికి మూలము పరిచయమై
  నన్నావరించిన మాయ తను మాయమగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విదనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-66


    సౌందర్య లహరి-66

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  సృష్టి పూర్వపు స్థితి ధూమము అను చీకటి
  తొలగించును  ముకుళిత-సంకోచిత ఈక్షణశక్తి

  అమ్మ కనుల వికసనము సృష్టి స్పష్టపు స్థితి
  కన్నుల అవలోకనము స్థితికారక ఉద్ధతి

  ముకుళిత నయనముల పని ముంచేసే ప్రళయము
  క+అ+మ పరబ్రహ్మ వాచకము "కామాక్షి"

 అనంత దర్శనశక్తిగల ఆదిశక్తి శతాక్షి
 జగతి సమ్రక్షణ-పోషణ మీనాక్షిగ  మారువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు  విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-67

  సౌందర్య లహరి-67

 పరమ పావనమైన నీ పాద రజ కణము
 పతిత పావనమైన పరమాత్మ స్వరూపము

 మంచు కురిసిన వేళ ముకుళించు తామరలు
 మంచు కొండల మీద మెరిసేటి తారకలు

 కసురుకొను చీకటిలో వసివాడు కమలములు
 నిశి రాతిరి కుశలములు,నిలువెత్తు కురియు సిరులు

 భక్తులను బంధించు భవ తిమిర పాశము
 ముక్తిని అందించు భవాని కరుణ అవకాశము

 నన్ను ముంచివేయు మంచును తొలగించు లీల
 నీ పాద ధూళి రేణువు నునువెచ్చని వరమైన వేళ

 నీ మ్రోల నున్న నా కేలు విడువకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYALAHARI-68


   సౌందర్య లహరి-68

 పరమ పావనమైన నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 తల్లి తాంబూలానుగ్రహ ప్రభావము
 తరియించినది మూక పంచశతి ప్రసాదము

 పన్నెండు యోగినులు ఎద నిండిన భావన
 వెల్లివిరిసె కమలముగ మానస సరోవరమున

 శంకరుల పుణ్యము నీ సౌందర్యలహరిలో ఒక సగము
 వేరొక సగము నందీశ్వరునిదిగ నీ అనుగ్రహము

 శంకరులు తిరిగి పూరించుట దేవరహస్యము
 అజ్ఞానము అర్థించాలా తల్లీ నీ అనుగ్రహము

 నీ మ్రోల నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-69



 

      సౌందర్య లహరి-69

 పరమపావనమైన నీ పాదరజ కణము
 పతితపాలకమైన పరమాత్మ స్వరూపము

 ఎడమనేత్ర కాంతిమారె లక్ష్మితత్వముగ
 ఎడతెగక నడిపించె స్థితికార్యపు మాతృకగ

 కుడినేత్ర కాంతిమారె పార్వతితత్వముగ
 విడనాడక కాపాడగ కరుణకు ప్రతిరూపముగ

 మూడవ నేత్ర కాంతిమారె సరస్వతి తత్వముగ
 మూఢత్వము తొలగించగ సారస్వత రూపముగ

 ఉద్ధరింపగ మమ్ములను ముగ్గురమ్మలను అందించిన
 నీ ఊపిరి నాలుగు వేదములైన వెలుగుచున్న వేళ

 నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-70


       సౌందర్యలహరి-70
 పరమ పావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 చీకటిని చూడాలనే తీరని సూర్యుని కోరికకు
 పీకలలోతు దీనత్వపు నా వదనము వేదిక

 జాణను నేననుకునే మందబుద్ధి పోలికకు
 జ్ఞానిని నేననుకునేలా చేసిన మూఢత్వపు చేరిక

 అరి భయంకరిడిననే అతిశయపు వాడుక(కు)
 అరిషడ్వర్గములు నాతో ఆడుచున్న వేడుక

 ఉపయోగములేని వాని  ఊహలలో సోలిపోయి
 మత్తువదిలి  మన్నించమని అడుగుతూ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-71


     సౌందర్య లహరి-71

  పరమపావనమైన నీ పాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  మహా యంత్ర,మహా మంత్ర,మహా తంత్ర రూపములు
  గుర్తించలేవు గుడ్డివైన చర్మ చక్షువులు

  సాహసించలేరు సాటిరాగ ఏ అప్సరస అంగనలు
  రేయిపగలు పొగడలేడు వేయితలల శేషుడు

  నిన్ను వర్ణించగలనని అనుకొనుటయే తప్పు
  ఇది నీ పేరు అని చెప్పలేని గొప్పతనముతో ఒప్పు

  సత్యమైన.శివమైన.సుందరమైన అలలతో
  ముదావహ ప్రవాహ సౌందర్యమైనవేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-72


  సౌందర్య లహరి-72

 పరమ పావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 చింతలు తొలగించుకొనగ,నీ చెంతను నిలువగ
 పొంతనే లేని అవకతవక తలపులతో

 చింతాకయిన చింత చేయదుకద మనసు
 మరింత కృంగిపోతోంది స్వాంతనయే లేక

 సాయముగా దయా సాగరమున నన్ను
 మునకలు వేయించిన మణిపుర నివాసిని

 సర్వ వర్ణ,సప్తస్వర భూషిత నీ అపారమగు
  కరుణతో నా పాపము ప్రక్షాళనమైన వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలువిడనాడకమ్మా నా
 మానస విహారి ఓ సౌందర్య 

SAUMDARYA LAHARI-73

  సౌందర్య లహరి-73

 పరమ పావనమైన నీ పాద రజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 నా సరస సల్లాపములు జపరూపము దాల్చినవి
 క్రియా కలాపములు మంత్రములుగా మారినవి

 నా గమనము మనమున ప్రదక్షిణము చేసినది
 ఆహార పదార్థాలు హవిస్సుగా మారినవి

 నా నిద్రయే సమాధిగా నీ సన్నిధి కోరినది
 అనాలోచిత క్రియలే అతి పవిత్రములైనవి

 నిత్య కృత్యములే నిత్యోత్సవములైనవి
 నా శరీరము పనిముట్టై నీ పాదము పట్టిన వేళ

 నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-74

 సౌందర్య లహరి-74

 పరమపావనమైన నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 పూవులలో మకరందము  మధుపముకై దాస్తావు
 ఆవు పొదుగులో పాలను  లేగలకై నింపుతావు

 భువి సమ్రక్షణార్థము గిరులవలె మారుతావు
 పులు అందించాలని   రవికిరణమును పిలుస్తావు

 పిండారబోసినట్లు  పండువెన్నెల అవుతావు
 కాకమ్మతో  కోకిలను కాపాడమంటావు

 పరోపకారమే మానవ ఆకారము అంటావు
 నీ దివ్య ప్రవచనములు నాకు కవచముగ మారువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా


 నా మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-75

సౌందర్య లహరి-75
 పరమ పావనమైన నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 సృష్టి పూర్వస్థితి "ధూమము" అను చీకటి,దానిని
 తొలగించును ముకుళిత సంకోచిత "ఈక్షణ శక్తి"

 అమ్మ కనుల వికసనము సృష్టి స్పష్టపు స్థితి
 కన్నుల అవలోకనము స్థితికారక ఉద్ధతి

 ముకుళిత నయనముల పని ముంచేసే ప్రళయము
 క+అ+మ పర బ్రహ్మ వాచకము కామాక్షి

 అనంత దర్శన శక్తి గల ఆదిశక్తి శతాక్షి
 జగతి సమ్రక్షణ,పోషణ మీనాక్షిగ మారువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి

SAUMDARYA LAHARI-76

సౌందర్య లహరి-76

 పరమ పావనమైన నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అనంత కాల తత్వమే కాళికా మాతగా
 సమయ పాలనా శాంతి బగళాముఖి తీరుగా

 అణువణువు నిక్షిప్తత ఛిన్న మస్త రేణుకగా
 క్రియా శక్తి రూపము భువనేశ్వరి ఆకృతిగా

 చండాల కన్యకైన శివరాణి మాతంగిగా
 తార,ధూమవతి,షోడశి ఆకాశ,పొగ,యవ్వన రూపాలుగా

 త్రిపుర సుందరి,భైరవి తత్వ ప్రకాశములుగా
 నీ దశ మహా విద్యలు నా దిశా నిర్దేశము చేయుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-77

సౌందర్య లహరి-77
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

మంచి పనులు చేయుచున్న ఇంద్రియములు ఐదు
వానికి సంకేతములు ఇచ్చుచున్న ఇంద్రియములు ఐదు

సప్త ధాతువులు మనసు ఎనిమిది కలిసి
అష్టాదశ పీఠముల నా హృదయ మందిరము

నిశ్చల భక్తిని నిన్ను గొలువ నిష్ఠను చేరినదమ్మా
మనో వాక్కాయ కర్మలు అను ముగ్గురు మిత్రులతో
ఏమని వర్ణించను ఏ నోము ఫలితమో ఇది
నా శరీరము పావన శక్తి పీఠముగా మారుచున్న వేళ

నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
భావము

SAUMDARYA LAHARI-78

సౌందర్య లహరి -27
పరమ పావనమైన నీ పాద రజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

శృంగనాద పరవశయై చిక్కిపోవు లేడివలె
దీపకాంతి మోహితయై నేలరాలు శలభము వలె

చర్మేంద్రియ లౌల్యముతో చతికిలబడు కరి వలె
జిహ్వ చాపల్యముతో పద్మమున చిక్కిపోవు తుమ్మెద వలె

ఎర వాసన తనకొరకు కాదని ఎరుకలేని చేప వలె
ఇంద్రియ లౌలిత్వముతో మంద బుద్ధి చెలిమి వలె 
స్వప్నావస్థను వదిలి సత్యాన్వేషణ చేయలేని,నా
శాపములే నీ అనుగ్రహ రూపములుగా మారుచున్న వేళ,నీ

మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-79

సౌందర్య లహరి-29
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

కుండలను తయారుచేయగ నిమిత్తము కుమ్మరి
మన్ను ఉపాదానమైనది కుండ మట్టియే అంటూ

ఆభరణము తయారుచేయగ నిమిత్తము కంసాలి
బంగారము ఉపాదానమైనది నగ పుత్తడియేనంటూ

నీ మూర్తిని తయారు చేయ నిమిత్తము శిల్పి
నీ మహత్తు ఉపాదానమైనది అన్నీ నీవేనంటూ

ప్రథమము,ప్రధానము,ప్రకృష్టము నీవే గద
నా నికృష్టపుతనము మహోత్కృష్టమగుచున్న వేళ

నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-80


       సౌందర్య లహరి-80

  పరమ పావనమైన నీ పాదరజకణము
  పతిత పలకమైన పరమాత్మ స్వరూపము

  బిందువుగా సృష్టి ప్రారంభమును  కేంద్రీకరిస్తూ
  నింగిగా వ్యాపిస్తూ నాలుగు భూతాలను కలుపుకొని

  శబ్ద-స్పర్శ-రూప-గంధ-రస భావనలుగా
  పుష్పములలో ఐదు గుణములను చొప్పించి

  మూడుకూటములు  కలిగిన మూల మంత్రాత్మికవని
  జడమగు ఈ శరీరము నీ చైతన్యశక్తిని ఎరుగక

  జనన-మరణములు చర్విత చరణములగుచుండగా
  శిశిరమగు చిత్తమునకు  చైత్రము నీవైన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

  

SAUMDARYA LAHARI-81


     సౌందర్య లహరి-36

  పరమ పావనమైన  నీపాదరజ కణము
  పతిత  పాలకమైన  పరమాత్మ స్వరూపము

  ధ్యానము-ధ్యాత-ధ్యేయము  త్రిపురములు గాగ
  స్థూల-సూక్ష్మ-కారణ శరీరములు  త్రికములుగ

  త్రిపుటీ స్వరూపమే  ద్వైతముగా భాసిల్లగ
  త్రిపురాసుర  సం హారమే  అద్వైతముగా

  అనంగుడు-అల్పాయువు -అసమర్థుడు  నీ కరుణ
  అఖిల జగములను అమితముగ ఆకర్షించుచున్నాడు

  నీ దయార్ద్రహృదయము దాసుని అర్హతనే చూడదుగా
  అసాధ్యములన్నీ నీ దయతో సుసాధ్యములగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-82


   సౌందర్య లహరి-82

  పరమ పావనమైన  నీ  పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  సకలశాస్త్ర సమూహముల  సారమైన నీ అందెలు
  సామవేద సంగతుల  స్వరమైన నీ అందెలు

  నీ పాదములు తాకలేని నీలకంఠ వదనుని
  చిత్తరమైన కొత్త తత్తరపాటును చూసి

  అవ్వ? ఇది ఏమి సోద్యము?
  మేము చూసినామంటూ చేసే సవ్వడులు

  చిత్తుగ ఓడిపోయి ఏమిచేయలేని  మన్మథుని
  చిత్తపు పరిహాసముగ పకపక నవ్విన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు  విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  

SAUMDARYA LAHARI-83


   సౌందర్య లహరి-35

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  అజ్ఞాన అంధకార సాగరములో  అనవరతము
  మునకలే  ముచ్చటనే  మూఢులమైన  మేము

  ఇడుములనే  ఉడుములే చేరెను మా సమీపము
  నిస్సార సం సారము చేసెను మమ్ము సమ్మోహనము

  చింతలతో చిన్నబోయి ఖిన్నులమై  ఉన్నారము
  లోతైన లోయలో లేవలేక ఉన్నారము

  నిఖిల జగము  వగచుచు  నీట మునిగియుండగా
  నీ పాదరేణువు  ఆదివరాహపుకోరయైన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-84


    సౌందర్య లహరి-84

  పరమ పావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  ఆదిశక్తి దాచెనమ్మ ఆదిదేవుని  తనలో
  ఆ శివుడు  దాగెన్న ఆదిశక్తి  రూపములో

  హరిసోదరి  నేరుపుగా  హరుని కప్పివేయగా
  కానరాదు శివుని  జాడ కామేశ్వరిని చూడగా

  త్రినయనములు  జాబిల్లి శివతత్త్వ ప్రతీకగా
  కుచద్వయము మేనిఛాయ శివాని స్వరూపముగా

  శివశక్తుల  కలయికయే  చిద్విలాస వేడుకగా
  నా హృదయ పీఠమే  మృదు సిం హాసనమైన వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్యలహరి.    

SAUMDARYALAHARI-85

సౌందర్యలహరి-85

 పరమపావనమైన నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 నల్లనైన చీకట్లో నేను అల్లరులే చేస్తున్నా
 అల్ల కల్లోలమైన మనసు నన్ను గిల్లుతోంది


 ఎర్రనైన కోపములో నేను వెర్రి పనులు చేస్తున్నా
 చిర్రు బుర్రులాడు మనసు నాపై గుర్రుమంటోంది

 తెల్లనైన తెలివిలో నేను తెలుసుకోగ తప్పులన్నీ తప్పులన్నీ తెలుసుకున్నా
 తెల్లబరచె నాలోని తెలివితక్కువతనాన్ని

 సత్వ రజో తమో గుణములు సద్దుమణుగు చుండగా
 నీ చిరునవ్వే విఘ్ననివారణమైన వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-86


     సౌందర్య లహరి-86

 పరమపావనమైన  నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఉన్నతమును ఎన్నలేక  నాకన్నులెన్ని చూసినవో
 విజ్ఞత మరచిన వినికిడి వింత పోకడలనే పోయినదో

 తప్పుడు మాటలు అని తెలిసి పెదవి ఎంత విప్పుకుందో
 చేయరాని పనులైనా చేయి ఎంత చేసినదో

 హింసలోన నా మనసు కంసునిలా మురిసినదో
 పరనిందా రోపణలో  పాపమెంత  పెరిగినదో

 వికారములు  విజృంభింప విధలేక  నే చేయుచున్న
 దీనారావములు  శివాకార మంచము అగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి. 

SAUMDARYALAHARI-87

 సౌందర్య లహరి-87

  పరమ పావనమైన నీపాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  పనులను చేయించుటకు పగటిపూట సూర్యునిగా
  అలసట తొలగించుటకు  అమృతమూర్తి చంద్రునిగా

  ఆహారము అందించే ఆదిత్యుని రూపుగా
  ఆ జోలను తేలించే ఆ చంద్రుని చూపుగా

  కలతలు  కనపడనీయని కాళికారూపుగా
  మమతలు కరువుకానీయని మాతల్లి గౌరిగా

 అనవరతము ఏమరక అవనిలో  అలరారుచున్న
 సూర్య చంద్ర ప్రవర్తనలు  సంకీర్తనము అగువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUNDARYA LAHARI-88


       సౌందర్య లహరి-88

  పరమపావనమైన  నీపాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  నీ నయన సంకేతమే ఇల సాంకేతికమని
  నీ కరుణ ప్రవాహమే ఇల సాగు  వాహినులని

  నీ కొనగోటి కల్పనలే ఎనలేని వనరులని
  నీ పుట్టింటి చుట్టరికమే రక్షించే గుట్టలని

  సేదతీర్చు నీ ఒడే  నాసేద్యపు ఒరవడి అని
  ఆగ్రహానుగ్రహములు హెచ్చరిక మచ్చుతునకలని

  పట్టి విడుచు గ్రహణములని గ్రహియించిన రవి-శశి వలె
  నా అపరిణిత సూక్తులు నవ విధభక్తులగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి. 

SAUMDARYA LAHARI-89


      సౌందర్య లహరి-89

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన   పరమాత్మ స్వరూపము

  భౌతిక-ఆధ్యాత్మిక కలయిక భావోద్వేగముగా
  ఆత్మ-పరమాత్మల కలయిక  తాదాత్మ్యముగా

  సన్యాసము  సం సారపు సారపు సాక్ష్యముగా
  త్రిగుణముల సంగమము నిర్గుణ ప్రాకారముగా

  పవిత్ర అపవిత్ర అల్లిక పరమాత్మ తత్త్వముగా
  శివ-పార్వతుల  సంభాషణలు శిరోధార పూజ్యముగా

 ప్రతి బంధకములే  మోక్షపరికరములుగా మారగా
 అనుగ్రము  అల్లుకుంటు  తంత్రములగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు  విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-90


   సౌందర్య లహరి-90

  పరమ పావనమైన  నీపాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  దక్షుని  అజ్ఞానమును శిక్షింపగ దలచి
  సాక్షాత్కరించావు సతిగ  దక్ష వాటిక

  తారకుని  తామసము  తొలగింపచేయ దలచి
  కటాక్షించావు  హిమవంతుని  పార్వతిగ

  మహిషాసురుని  మదమును మర్దింపదలచి
  మహిషాసుర మర్దనిగా  మమ్ముల రక్షించావు

  శుభప్రదముగ  శంభునిచే కల్పింపబడిన
  నీ రేఖాచిత్రములు   యంత్రములగుచున్న వేళ

  నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-91


   సౌందర్య లహరి-91

  పరమపావనమైన  నీపాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  ధర్మపు మర్మము తెలిసి నిర్మలమైన నా మనసు
  తనివితీర కొలువగ  తరలుతున్న నా తనువు

  వశిన్యాదిదేవతానుగ్రహమైన  నా వాక్కులు
  ఊహాతీతశక్తి ఉనికిని తెలిపిన పనులు

  పరస్పరానురాగ  గలితమైన  నా తపనలు
  సమానాధిక్యము లేని  అమ్మ సన్నిధానభావము

  ఓడిపోనివ్వని  ఒడిలాలన ఒరవడిలో
  నా  త్రికరణములు  అమ్మ పాద శరణాగతి కోరువేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-92


     సౌందర్య లహరి-92

  పరమ పానమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  సింధువులో స్థూలముగా,బిందువులో సూక్ష్మముగా
  పెద్ద కొండలో స్థూలముగా,అద్దములో సూక్ష్మముగా

  పుడమిగా స్థూలమై,కణముగా  సూక్ష్మమై
  వాయువుగా  స్థూలమై,శ్వాసగా  సూక్ష్మమై

  సుందరములో స్థూలమై,అందరిలో సూక్ష్మమై
  బ్రహ్మాండములో స్థూలమై,పిండాండములో సూక్ష్మమై

  విస్తుబోవచేయుచున్న  నీ నిస్తుల  వైభవము
  స్థూలములో  మార్పులేక  సూక్ష్మములను చేయువేళ

  నీ మ్రోలనే నున్న నా కేలును విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-93


     సౌందర్య లహరి-93

  పరమ పానమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  సింధువులో స్థూలముగా,బిందువులో సూక్ష్మముగా
  పెద్ద కొండలో స్థూలముగా,అద్దములో సూక్ష్మముగా

  పుడమిగా స్థూలమై,కణముగా  సూక్ష్మమై
  వాయువుగా  స్థూలమై,శ్వాసగా  సూక్ష్మమై

  సుందరములో స్థూలమై,అందరిలో సూక్ష్మమై
  బ్రహ్మాండములో స్థూలమై,పిండాండములో సూక్ష్మమై

  విస్తుబోవచేయుచున్న  నీ నిస్తుల  వైభవము
  స్థూలములో  మార్పులేక  సూక్ష్మములను చేయువేళ

  నీ మ్రోలనే నున్న నా కేలును విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-94


  సౌందర్య లహరి-94

  పరమపావనమైన నీ పాదరజకణము
  పతిత ఆలకమైన  పరమాత్మ స్వరూపము

  స్థూలమైన భూమికన్న నీరు మిగుల సూక్ష్మమని
  పారుచున్న  నీటికన్న అగ్ని మిగుల సూక్ష్మమని

  మండుచున్న అగ్నికన్న గాలి మిగుల సూక్ష్మమని
  వీచుచున్న గాలికన్న నింగి మిగుల సూక్ష్మమని

  అందరాని నింగికన్న మనసు మిగుల సూక్ష్మమని
  మాయదారి మనసుకన్న  భగవత్తత్త్వము సూక్ష్మమని

  పరమార్థ మర్మమైన నీ ధర్మ సూక్ష్మములలో
  నా బుద్బుదశరీరము పరమాద్భుతమగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  

SAUMDARYA LAHARI-95


    సౌందర్యలహరి-95


 పరమ పావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 కుండలినీ శక్తిగా పైకి పాకుచున్న కుమారిగా
 అజ్ఞానము చండాడే దేవి చాముండిగా

 శత్రు సం హారమునకు రౌద్రశీలి దుర్గగా
 పత్ర వసన ధారిణి బోయసాని వనదుర్గగా

 హలము-ముసలము దాల్చిన భీషణ వారాహిగా
 సారస్వత రూపమైన  సర్వ శుక్ల సరస్వతిగా

 బాలగా,కౌమారిగా,ముదితగా, పండు ముత్తైదువగా
 బహురూప దర్శనములు భక్తపరాధీనత యగువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 నా మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-96

  సౌందర్యలహరి-96

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  వేదవేదాంత నాదాంతర్గతముగా
  సన్నుత ఉపనిషత్ సారాంతర్గతముగా

  వాక్కు-అర్థము కలిసిన అర్థనారీశ్వరముగా
  ముగ్గురమ్మల రూపున మూలపుటమ్మగా

  పరమ దయార్ద్రమైన  పరమాత్మ తత్త్వముగా
  అద్భుత అవ్యాజ కరుణకు ఆలవాలముగా

  శివశక్తుల కలయికగా చిద్విలాస వేడుకగా
  " జగత: పితరం వందే" పార్వతీ పరమేశ్వరమైన వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-97

      సౌందర్య లహరి-97

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  నిన్ను చూడవలెననుచు  కనులు మూయుదుకాని
  పనికిరానివి వచ్చి నా ఎదుట నిలుచు

  నిన్ను దలపగకోరి  మనసు నిలుపుదు కాని
  తక్కిన తలపులు వచ్చి నన్ను కలతపెట్టు

  నిన్ను కొలువ తలపోసి నియమమూనుదుగాని
  అన్యములు ఆ తలపును అధిగమించు

  నిన్ను చేరగ తరియింప నిర్గమింతునుగాని
  కఠిన బంధములు అడ్డముగ కాళ్ళతగులు వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-98

 సౌందర్య లహరి-98

  పరమ పావనమైన  నీపాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  అమ్మ మహిమ గుర్తించని చిమ్మచీకట్లలలో
  విజ్ఞత వివరము తెలియని  యజ్ఞ వాటికలలో

  అటు-ఇటు పరుగులిడు తలపులను ఇటుకలతో
  సంకల్ప-వికల్పములను సుక్కు-శ్రవములతో

  విచక్షణారహితమను  సంప్రోక్షణలతో
  కుతంత్రాల తతులనే  కుటిల మంత్రాలతో

  తమస్సులో తపస్సులను బహులెస్స హవిస్సులతో
  నా అజ్ఞానము సర్వము  యజ్ఞముగా మారుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-99


   సౌందర్య లహరి-99

 పరమ పావనమైన నీపాదరజ కణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 కన్ను మనకు గొప్పదే మనము చూడగలిగి నప్పుడు
 చెవికూడా గొప్పదే వినగలుగుతున్నప్పుడు

 పెదవులెంత గొప్పవో పలుకగలుగుతున్నప్పుడు
 చెయ్యికూడ గొప్పదో చేయూతకాగలిగినప్పుడు

 మనసుకూడ గొప్పదే బుద్ధితోడైనప్పుడు
 ఇంద్రియములు నిష్ఫలము అమ్మశక్తి లేనప్పుడు

 కృతకములగు వీని కృత్యములు నీ కృపయైనప్పుడు
 ఆవాహన ఆరాధన  ఆత్మార్పణ ఆనందములగు వేళ

 నీ మ్రోలనే నున్న  నాకేలు విడనాడకమ్మా,నా


 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARTALAHARI-100


       సౌందర్య లహరి-100

  పరమ పావనమైన నీ పాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  పురాణములనన్నిటిని పుక్కిలించానని
  నిగమాగములన్నిటి నిగ్గుతేల్చానని

  జ్ఞాన యజ్ఞములెన్నో జ్ఞప్తిలోనున్నాయని
  పారాయణములన్నిటిలో  బాదరాయుణుడనని

  నిఖిలము నియంత్రించుటకు మంత్రోపదేశములని
  అవనీ ఉద్ధరణకై నేను అవతరించాననుకొను

  చిత్తములోని చిత్తును గ్రహించలేని,నా
  పటాటోపములన్నీ పటాపంచలమగుచున్న వేళ

  నీమ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 

SAUMDARYA LAHARI-101


 సౌందర్య లహరి-101

 పరమపావనమైన నీ పాదరజ కణము
 పతితపాలకమైన పరమాత్మ స్వరూపము

 ఎడమనేత్ర కాంతిమారె లక్ష్మితత్వముగ
 ఇడుములనెడబాపక స్థితికార్యపు మాతృకగ

 కుడినేత్ర కాంతిమారె పార్వతితత్వముగ
 విడనాడక కాపాడగ కరుణ ప్రతిరూపముగ

 మూడవ నేత్ర కాంతిమారె సరస్వతి తత్వముగ
 మూఢత్వము తొలగించగ సారస్వత రూపముగ

 ఉద్ధరింపగ మమ్ములను ముగ్గురమ్మలను అందించిన
 నీ ఊపిరి నాలుగు వేదములైన వేళ 

 నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-102

సౌందర్య లహరి-102

 పరమ పావనమైన నీ పాదరజ కణము  
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఏమందును ఏకాగ్రత ఇసుమంతయు నిలుపలేని 
 బాహ్యాడంబరములే గాని భక్తి అసలు కానరాని

 ఉద్ధరణను పొందుటకు  శ్రద్ధ అసలు తెలియని
 చింత చీకాకులనే చీకటినే నమ్ముకుని

 పంచేంద్రియములు అందించే పరమార్థము తెలియని
 అవ్యాజ కరుణకు అచ్చపు ఉదాహరణయైన అమ్మ

 అవతార విశేషములు అవగతమొనరించుకొనగ 
 నా బాహ్యంతర ప్రయత్నములు నీ వాగ్వైభవమైన వేళ,నీ

 మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా 
 మానస విహారి ఓ సౌందర్యలహరి.

SAUMDARYA LAHARI-103

  సౌందర్య లహరి -103

 పరమ పావనమైన నీ పాదరజ కణము 
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము


 కైమోడ్పులందించి తరియింపగ తలతుగాని
 పొంచిన పైశాచికము  కొంచపు తలపును దించు

 సంకీర్తనమొనరింప సన్నద్ధమగుదును గాని
 దానవత్వము  దరిచేరి నా దారి మార్చు

 జపతపాదుల నిను కొలువ నిశ్చయింతును గాని
 మదిని నిశాచరము చేరి నే నిష్క్రమింతు

 భావనామాత్ర సంతుష్టమొందు నీ భాగ్య వరమో నా
 దైవ అసుర గుణ ద్వయము శైవ భాసురముగ మారుచున్నవేళ,నీ

 మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి

SAUMDARYA LAHARI-104

  సౌందర్య లహరి-104

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 శారీరక సౌందర్యములు అశాశ్వతమను తెలివిలేక 
 ఐహిక సుఖములు బహు స్వల్పములను ఊహ లేక

 సం సార సాగరమును నిస్సారముగ ఈదలేక
 అహంకార ప్రాకారపు హుంకారము వినలేక

 నిరాకార నిరంజన నిర్మల ఆకారము చూడలేక
 మూర్తీభవించిన అనుగ్రహమును కీర్తించలేక

 పాతాళమునకు జారి అటుఇటు పారిపోవ దారిలేక
 పడిపోవుచున్న నన్ను పట్టి నీ కృప కాపాడుచు నున్నవేళ,నీ

 మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి

SAUMDARYA LAHARI-105

 సౌందర్యలహరి-105

 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 తల్లి గర్భములో నేనుండగా సహస్రారముద్వారా
 క్రిందకు పయనమై, మూలాధారముచేరి,పైకి వస్తూ

 దేహేంద్రియాదుల కన్నా ఇతరములేవి లేవను
 అజ్ఞానపు బ్రహ్మగ్రంధి ముడిని,నీ దయతో విడదీస్తూ

 సూక్ష్మ శరీరము నాదికాదను బోధద్వారా
 విష్ణుగ్రంథి ముడిని విడదీస్తూ,సాగుతూ

 శరీర భ్రాంతియైన రుద్రగ్రంధిని చేదిస్తూ
 నన్ను కట్టివేసిన ముడులను నీ కరుణ విప్పుచున్నవేళ

 నీమ్రోలనే నున్న నా కేలు  విడనాడకమ్మా
 నా మానస విహారి! ఓ సౌందర్యలహరి.

SAUMDARYA LAHARI-106

 సౌందర్యలహరి-106

 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అతిచమత్కారముగా నీ కరుణ ఆవిష్కారముతో
 నా అహంకారము చిటికెలో "ఓంకారము" అయినది

 సాటిలేనిదైన నీకరుణ సహకారముతో
 నా వెటకారము చిటికెలో " ఐంకారముగా" మారినది

 మమ్ములను మన్నించు నీదైన మమకారముతో
 నా హుంకారము చిటికెలో "హ్రీంకారముగా" మారినది

 నీపై భక్తి శ్రీకారమే చిత్రముగా "శ్రీంకారముగా" మారినది

 సంస్కారపు సాధన నీ బీజాక్షరములగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా
 నా మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-107

  సౌందర్యలహరి-107

 పరమ పావనమైన నీపాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 చీకాకు చీకట్లను చింతలు తొలగించగా
 దీపము మౌనముగా తేజము వ్యాపింపచేయునట్లు

 నిర్జీవ రాశులలో స్థితికార్యము వ్యాపించినట్లు (గోళ్ళు-కేశములు)
 జీవునిలో మౌనముగవాయువు శ్వాసించినట్లు

 ఉద్యుక్తతనొందుచు తమ విద్యుక్త ధర్మముగా
 రవిచంద్రులు మౌనముగా ఉదయాస్తమయమగునట్లు

 పోరాట రూపములో నా ఆరాటములు తరిమివేయగా
 వివిధరూపములలో  నీ విరాట్రూపము తోచుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా
 నా మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-108


 సౌందర్యలహరి-108

 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 నిరాకార నిరంజని నిన్ను తెలిసికొనితిననుట
 నింగిలోని చుక్కలను లెక్కించితిననుకొనుట

 అమ్మ అద్భుత లీలలు అవగతమయినవనుకొనుట
 అంబుధి అలలను లెక్కించుతిననుకొనుట

 శత సహస్ర వందనములు సమర్పించితిననుకొనుట
 మతిహీనత అమితముగ నను తికమకపెట్టుట

 ఎన్ని అపచారములను చేసినా కన్నతల్లిలా నా వెన్నుతట్టుచు
 సదాశివ కుటుంబినిగా  సాక్షాత్కరించుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా
 నా మానస విహారి! ఓ సౌందర్య లహరి.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...