Friday, October 13, 2017

SAUMDARTALAHARI-100


       సౌందర్య లహరి-100

  పరమ పావనమైన నీ పాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  పురాణములనన్నిటిని పుక్కిలించానని
  నిగమాగములన్నిటి నిగ్గుతేల్చానని

  జ్ఞాన యజ్ఞములెన్నో జ్ఞప్తిలోనున్నాయని
  పారాయణములన్నిటిలో  బాదరాయుణుడనని

  నిఖిలము నియంత్రించుటకు మంత్రోపదేశములని
  అవనీ ఉద్ధరణకై నేను అవతరించాననుకొను

  చిత్తములోని చిత్తును గ్రహించలేని,నా
  పటాటోపములన్నీ పటాపంచలమగుచున్న వేళ

  నీమ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...