AALO REMBAAVAAY-06
%20(1).jpg)
ఆరవ పాశురం. ************* ఆండాళ్ తల్లికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ, అనుగ్రహించినంత మేరకు మేల్కొలుపుల ప్రారంభ పాశురమైన ఆరవ పాశురమును అనుసంధానము చేసే ప్రయత్నమును చేసుకుందాము. పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో? పిళ్ళాయ్! ఎళుందిరాయ్! పేయ్ ములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై ఉళ్ళత్తు కొండు ముని వర్గళుం యోగి గళుం మెళ్ళ ఎళుందు అరి ఎన్న పేరరవం ఉళ్ళంపుగుందు కుళిరేలో రెంబావాయ్. వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై *********************** పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా. మూలవిరాట్టు దర్శనమునకు ముందు ఆలయ ప్రాకార ప్రదక్షిణము వలె భాగవత గృహ ప్రదక్షిణమును మనతో గోదమ్మ చేయిస్తున్నది. ఇంద్రియములు ప్రకృతిని అనుసంధానముచేసుకుంటే ప్రపంచము.అవే ఇంద్రియములు పరాత్పరుని అనుసంధానము చేసుకోగలిగితే పారమార్థికము. ఆ విషయమును మనము సులభముగా గ్రహించుతకై గోదమ్మ "పుళ్ళుం"శబ్దమును ప్రయోగించినది. పుళ్ళుం అంటే తెలుగుభాషలో పక్షులు.అ...