Posts

Showing posts from December 21, 2025

TIEUVEMBAVAY-07

Image
   తిరువెంబావాయ్-07   *************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."   సందర్భము   ********  విన్సెవియో,కన్నిక్కుళిల్,వాయ్పేశుం అంటూ పంచేంద్రియ జ్ఞానమును ప్రస్తుతించిన తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ఆత్మజ్ఞాన ప్రాశస్త్యమును ప్రశంసిస్తున్నారు.అత్యద్భుత అమృత గుళిక ప్రస్తుత పాశురము.   అంతర్ అంతరోస్థితః అను సత్యమును గ్రహించుటకు మనలను సంసిద్ధులను చేస్తున్నది.  పిబరే శివ అముదం.శిన్నంగళ్ కేట్పుం (అమృతం)  పాశురము  *******  "అన్నే ఇవయుం శిలవో పల అమరర్   ఉన్నర్కు అరియాన్ ఒరువం ఇరుంశీరార్   శిన్నంగళ్ కేట్పు శివనెన్రే వాయ్ తిరప్పాయ్   ఎన్నాన ఎన్ ఆర్-అయన్(ఎన్నరయన్) ఇన్-అముదం (ఇన్నముదం)ఎండ్రోం   తిన్నాయ్  నా మున్నం తీశర్ ఎళురప్పాయ్   కొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడెయొ   వన్నం జపేదరి పోల్ వాళాకిడత్తియాల్   ఎన్నే! తుయిలిల్ ఏలేరో ఎంబావాయ్.    "శివే ఒరువన్"  అన్నది ముఖ్యాంశము.అన్యముకానిది శివ...