Posts

Showing posts from December 17, 2025

TIRUVEMBAVAY-03

Image
     తిరు వెంబావాయ్-03    *****************   " కృపాసముద్రం సుముఖం త్రినేత్రం    జటాధరం పార్వతీ వామభాగం    సదాశివం రుద్రం అనంతరూపం    చిదంబరేశం హృదిభావయామి."  సందర్భము  *********    శివనోమును ఆచరించుటకు ఇద్దరు చెలులను తమతో కలుపుకొని మూడవచెలి దగ్గరకు వచ్చారు కన్నియలు.  "విష్ణునాకర్ణించు వీనులు వీనులు   శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ   సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు"  అన్న పోతనగారి అభిప్రాయమునునకు నిలువెత్తు సాక్ష్యముగా ఈ భాగ్యశాలులు ప్రస్తుత పాశురములో మనకు అత్తన్-ఆనందం-అముదము అంటూ పరమాత్మ వైభవమును ప్రకటింపచేస్తున్నారు.       " ముత్తన్న వెణ్ నకయ మున్ వము ఎదురెళుందన్       అత్తన్ ఆనందన్ అముదన్ ఎన్ని ఎళ్ళోరి       తిత్తిక్కు పేశువాయ్ వందున్ కడై తిరవాయ్       పత్తుడయీర్ ఈశన్ పళ అడియార్ పాంగుడఈర్       పుత్తడియో పున్మై తీర్థాదు ఆట్కొండార్ పొల్లాదో       ఎత్తోనిన్ అంబుడమై ఎల్లోం అరియోమో     ...