Wednesday, January 10, 2024

TIRUPPAAVAI-PAASURAMU-26

 ఇరువది ఆరవ పాశురంతిరుప్పావై-పాశురము-26 ***************** " నీళాతుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ స్వశృతిశత స్సిద్ధముద్యాపయంతే స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాం బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమ ఇద మివం భూయ యే వాస్తు భూయః" పూర్వ పాశుర ప్రస్తావనము *********************** గోపికలావతార జ్ఞానమును స్వామి గుణానుభవమునకు మార్గముగా చూపించినగోదమ్మ, ప్రస్తుత పాశుర ప్రాభవము *********************** స్వామికి గోపికలై-గోపికలకు స్వామిపై నున్న వాత్సల్యమును మణిమయ స్వరూపకాంతిగాకీర్తించుచున్నాడీ. ప్రళయసమయములో బ్రహ్మాండములను తనౌదరములో దాచుకొని,వటపత్ర సాయిగా మార్కండేయునిచే కీర్తించబడిన స్వామి సామర్థ్యమును సంస్తుతించినది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము గోపికలు నోనకు కావలిసిన వస్తువులను అడుగుతున్నట్లుగా అనిపిస్తున్నప్పటికిని స్వామి వైకుంఠముతో తరలి విచ్చేయమని విన్నవించుకొనుట. గోదమ్మ ఈ పాశురములో అంతః-బహిః యాగములను గోపికలు స్వామిని అర్థించుఆరు విశేషములలో నిక్షిప్తపరచినది. 1 శంఖ ప్రణవనాదము-మంత్రాసనము (స్వామికి) 2,పఱ వాయిద్య ఘోష-తిరుమంజనము 3.పల్లాండు-అలంకరణము-మంత్రపుష్పము 4.దీపము-ఆత్మనివేదనము. 5.ధ్వజము-వాహన సేవనము 6.వితానము-పర్యంకసేవనము. కనుకనేవారు స్వామిని, 1.పాలన్న వణ్నత్తున్ పాంజశన్నియమే 2.పెరుంపఱయే 3.పల్లాండుఇసైప్పారే 4.కోళవిళక్కే 5.కొడియే 6.వితానమే అని, ఆరు వస్తువులను(దివ్యమైనవి) అభ్యర్థిస్తూ,సనాతనమును సత్కరించిన, అమ్మ ఆండాళ్ కు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురము లోనికి ప్రవేశిద్దాము.


   పాశురము

*********************

మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడు వాన్
మేలైయార్ సేవననగళ్ వేండువన కేట్టియేన్
ఞాలాత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తున్ పాంజశన్నియమే
పోలవన శంగంగళ్ పోయ్ ప్పాడు డయనవే
శాలప్పెరుం పరయే, పల్లాండు ఇశైప్పారే,
కోళ విళక్కే,కొడియే,వితానమే
ఆలిన్ ఇలైయాం! అరుళ్ ఏలోరెంబావాయ్!

" వనమాలి గదీశార్ఞీ శంఖీ చక్రీచ నందకీ
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు."

ఆశ్రిత వాత్సల్య ఫలప్రదాయనమః
*****************************

స్వామి అనుగ్రహముతో గోదమ్మతో పాటుగా వ్రతమును చేయుచున్న గోపికలు సామీప్య సంభాషణ భాగ్యమును పొందినారు.వారి మనసులు స్వామితో సారూప్యతకై ఎదురుచున్నవి.

కనుకనే వారు మీకు పఱ కావాల/నేను మీ వ్రతమునకు రావాలా? అని ప్రశ్నించి ,నేను వస్తుంటే మీకు పఱతోఏమిపని? అని అనగానే వారు వినయముతో మీరు మా నోమును ఆవిష్కరించుట ఆనందదాయకము.

మా పెద్దలు ఈ నోమును తాము నోచుకొనుట వలననె,

మేలైయార్ సేవనగళ్-వర్షములను పొంది సుభిక్షువులై యున్నారని చెప్పగా విన్నాము.
స్వామి మేమును ఈ నోము వలన నీ అనురాగ-అనుగ్రహ వర్షములో మునిగి సుభిక్షువులమవుతున్నాము.

మా కింతటి అద్భుత అవకాశమును కల్పించిన నోమును చేయుట మరిచిన మేము నోము చేసిన మేలును మరిచిన కృతఘ్నులమవుతాము.అది మాయెడల ధర్మముకాదు. మిమ్ములను మాకు పరిచయముచేసిన-ప్రసాదించిన ఆ నోమును యథావిధిగా సత్కరించుకుంటాము అని వినయముతో చెప్పారు.

వారి కృతజ్ఞతావిష్కారమునకు
మురిసిన స్వామి,

సరే! అయితే మీకేమి వస్తువులు కావాలో చెప్పండి.అనుగ్రహించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.

వెంటనే వారు నీ సమర్థత మాకు నీ వటపత్రశాయిగా ఆవిష్కరింపబడినపుడే/అవతరించినపుడే అర్థమైనది.నీవు సర్వసమర్థుడవు.

ఇదిగో మేము పట్టికను ఇస్తున్నాము.శ్రధ్ధగా,

కేట్టిలియె-వినండి అంటు విన్నవించారు.

ఆచార్యులు , వీరు స్వామిని అడిగినవి బాహ్యమునకు వ్రత విధానమునకు అడిగినవే అయినప్పటికిని,అంతరార్థమును గమనిస్తే వారును వాటిగా మారి శాశ్వత సామీప్య సాయుజ్యములను నర్మగర్భముగా అర్థిస్తున్నట్లుంటుందని చెబుతారు.

1. శంఖములు కావాలి అని మొదట కోరారు.
ఆ శంఖముల రూప స్వభావములను వివరించారు.

అవి పాలరంగు వంటి స్వచ్చమైన తెల్లదనముతో తేజరిల్లుతుండాలి.

"పాలన్న వణ్ణత్తిన్ పాంచశన్నియమె"

శుధ్ధసత్వ శోభితమై యుండాలి అది సజ్జనుల దగ్గర.
అంతే కాదు,

దానిని ఊదినపుడు దాని,
మురల్వన-శబ్దము,
ఞాలత్తై ఎల్లాం-ప్రపంచమంతా
నడుంగ-భయముతో గజగజ వణికేలా ఉండాలి.(శత్రువులకు) మిగతా సమయములో దాని ఓంకారము/ప్రనవము నినదిస్తుండాలి.

అవి ఒకటి/రెండు కాదు.మా అందరికి కావాలి.
( నీ చేతిలో ఒదిగి-నీ పెదవుల స్పర్శతో పులకిస్తు ప్రనవ-ప్రళయ నాదములను నీ ఆజ్ఞానుసారముగా చేసే భాగ్యమును ప్రసాదించు తండ్రి అన్నారు
దానికి స్వామి మందహాసముతో నాదగ్గర ఒకేఒక శంఖమున్నదికదా.నేను గోవులను మేపుటకు వెళ్ళేటప్పుడు ఆటగా తీసుకెళ్ళే శంఖాలను మీకే ఇస్తానులే అన్నాడు.

మాధవా మేము చీకటిలో యమునలో మార్గళి స్నానమునకు వెళుతున్నప్పుడు చీకటిగా ఉంటుంది కదా అందుకు నీవు నీ సుదర్శన చక్రము వంటి చక్రములను మాకు ఇస్తే వాటి సాయముతో మార్గలిస్నానమును చేస్తాము అని చక్రములను అడిగారు.తాము సంసారమనే చీకటిలో చిక్కుకు పోకుండ పక్కనే ఉన్న చక్రము మాకు వెలుగును చూపిస్తుంటే వ్రతమును చేసుకోగలము త్రికరణ శుధ్ధిగా.అందులకు అంగీకరించాడు స్వామి.

శంఖ-చక్రముల తరువాత వారు స్వామిని అనుగ్రహించమనినది,

" శాలప్పెరుం పరయే"

పెరుం-పెద్దదయిన,
శాలపెరుంపరయే-చాలా పెద్ద పఱ కావాలి స్వామి.అదియును చాలా పెద్దది.

ఇక్కడ మనము పెద్దలు చెప్పిన శ్రీకృష్ణుని కుంభ నృత్యమును ఒక్కసారి స్మరించి-తరిద్దాము.

స్వామి నడుమునకు పఱను కట్టుకుని,కుండలను ఎగురవేసి,దానిని పట్టుకునే లోపల ఒక్కసారి పరవాయిద్యమును చేసి పైనుంచి వచ్చే కుండను పట్టుకునేవాడట.

స్వామి వారితో నేను రామావతారములో నున్నప్పుడు ఒక్కసారి.కృష్ణావతారములో నున్నప్పుడు నేను చేస్తున్న ధర్మసంస్థాపనకు సంతోషిస్తు,నా చుట్టు తిరుగుతు పఱను వాయిస్తు అభినందించేవాడు.జాంవంతుని అడిగి మీకు పరలను అనుగ్రహిస్తాను అనగానే,
వారు మరింత సంతోషముతో మాకు సంకీర్తనముకై,

" పల్లాండిశై పారే" భాగవతులు కావాలన్నారు.వారి మనోభావములను గ్రహించి స్వామి "నమ్మాళ్వారుని" పల్లాండ్లు పాడుటకు పంపిస్తానన్నాడు.

ఇంకా స్వామి వంక ఆశగా చూస్తున్నారు వారు.ఎందుకంటే,స్వామి,

రూపము-మణివణ్ణా!
మణిప్రకాశముతో అంటే పారదర్శకతతో వారిని అనుగ్రహించుటకు ఎన్నైనా సిధ్ధముగా నున్నాడన్న విషయము/స్వామికి వారి మీద వ్యాపించిన అనుగ్రహ వ్యామోహము అవకాశము మీద అవకాశ
ములనిస్తున్నది.ఎందుకంటే స్వామి,
మాలే-అనుగ్రహవ్యామోహితుడు.వారు ఆరాధన వ్యామోహితులు.

ఇంకా ఏమైన కావాలంటే కోరుకోండి అని కనుసన్న చేసాడేమో స్వామి-వారు,
ధ్వజము అనగానే-గరుత్మంతుడు వస్తాడు,
వితానము( షామియాన) నా పీతాంబరము మారుతుంది.
కొడియె-నా భక్తులు వస్తారు
కొళివిళక్కే-ప్రకాశవంతమైన దీపములు అనగానే,
కట్టలు తెంచుకుంది స్వామికి వారిపై అనురాగము, అర సెకను కూడ ఆలస్యము చేయకుండా సాక్షాత్ జగన్మాత లక్ష్మీదేవిని దీపముగా వ్రతమునకు పంపించుటకు అనుగ్రహించాడు ఆ పరమాత్మ.

అపరిమిత ఆనందముతో నున్న గోపికలను నడిపిస్తున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనము కూడ నోమునకు సిధ్ధమగుదాము.

ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...