Thursday, October 3, 2019

PADISAKTULA PARAMAARTHAMU-edAVAsAKTI-DHOOMAVATI.

 పదిశక్తుల పరమార్థము- ఏడవశక్తి-ధూమవతి.
 ***********************************

 " ఏకం సత్ " విప్రా బహుదా వదంతి.

   ఒకే పరమాత్మ.విప్రులు అనగా ఒక కులము అనికాదు.విశేష పాండిత్యము గలవారు.వారు తమ జ్ఞానమునకు బుధ్ధిని జోడించి అమ్మదయతో దాని స్వరూప-స్వభావములను తమదైన రీతిలో మనకు అందిస్తున్నారు.

  ధూమవతి తల్లి ఏకంసత్ కనుకజీవిపుట్టుక ముందు మరణము తరువాత స్థితి అంటున్నారు.జనన మరణములు రెండు మానవప్రవృత్తులు.త్యజించవలసిని తనువు గలిగినవన్నీ (మరణించవలసిన) మానవులే సకలజీవరాశులు.

   గుర్రము లేని రథము లో తల్లి కూర్చుంటుంది.అంటే మనసనే పరుగులు దానిని నియంత్రించవలసిన పగ్గములు అవసరములేనిది.స్థితి-గతులకు అతీతమైన సమాధిస్థితి.

  అసురుల పచ్చిమాస భక్షణము మనలో అసురీభావములను మొగ్గలోనే తుంచివేయు కారుణ్యము.

   తల్లిచేతిలోని చేటతో తేలిపోవు ఇహములను పొట్టును చెరిగివేసి,శాశ్వతాన0దము మనకు చేటలో చూపించుట.చెరుగుట నిత్య-నిశ్చల సాధన అను క్రియాశీలత.

  దాగి ఉన్న నిప్పును పరిచయము చేసేది పొగ..అదే ఈ తల్లి తత్త్వము.స్వయం ప్రకాశక తల్లి మనముందు మాయ అనే పొగను మనముందుంచుతుంది.పొగ వాయు సహాయముతో మంటగా మారి ద్యోతకమగునట్లు,నిశ్చలమను పొగగొట్టమును పట్టుకొని నిరంతర సాధన అను గాలిని ప0పుతుంటే పొగ తన రూపును మార్చుకొని అగ్నిని చూపిస్తుంది.అదే విధముగా ధూమవతి పొగచే కప్పబడినట్లు కనిపిస్తు,దానికి మూలమైన అగ్నిని మూలశక్తిని (బిందువును) చూపించటానికి సహాయపడుతుంది.

  అమ్మ దయతో ఈ రోజు మనము తత్త్వము అర్థము చేసికొనుటకు ప్రయత్నిద్దాము.

  ధూమవతి తల్లిమనకు అద్వయము-అఖండము-అనంతము అను మూడు   ముఖ్యాంశములకు తానేఉదాహరణగా మారి వివరించుచున్నది.ద్వైత భావనిర్మూలనము  కలిగిస్తున్నది.

1.అద్వయము
  *******
 నిజమునకు సుందరము-వికారము అను రెండు రూపములు లేవు.డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్- అట్టను చూసి పుస్తక విలువను తెలుసుకోలేవు.కాకి-ముసలితనము-పొగ రంగు అన్ని బాహ్యములే.హంస-పడుచు-బంగరు మేని రంగు వేరుగా తోచుచున్నప్పటికిని వాటిలోని ప్రాణశక్తి ఒకటే.తారతమ్యములు లేనిది.జ్ఞాన చక్షువు తెరిచిచూస్తే కానరావు వికారములు.

 2.అఖండము.
***********

  ప్రారంభములో మనము ఏకానేక రూపములు దేవి క్రీడలు అని చెప్పుకున్నాము.పరాశక్తి తనను తాను రెండురూపములుగా విభజించుకొని,వాటికి స్త్రీ-పురుష రూపములుగా ప్రకటించినది.ఉదాహరణకు కాళి-కాళుడు.ఇది సత్యమైనపుడు గౌరి తనకు ఆకలివేసినదని,శివుని మింగివేసినదని,పురుష సంపర్కము లేని స్త్రీమూర్తి కనుక విధవ గా భావించుటకు కారణము మన అవగాహన లోపమే కాని అన్యము కాదు.తంతు అనగా దారము లేక బంధము.సర్వమంగళ తన లీలగ తననుండి తాను వేరుచేసిన శివరూపమును తనలో కలిపివేసి అఖండము చేసినది.ఈ ప్రక్రియలో ఏది అశుభము? ఎవరు వితంతువు?ద్వంద్వము నిర్ద్వంద్వమైనది అంతే.

3.మూడవ పాఠము ఆవరణ-నిక్షేపము

  మొదటిది దాచివేయుట.ఉదాహరణకు మర్రిచెట్టి రూపమును విత్తులో దాచినట్లు తల్లి తన సర్వ మంగళరూపమును ధూమవతి రూపములో దాచినది.సమయమాసన్నమైనపుడు విత్తు చెట్టుగా మారినట్లు తల్లి పెద్దముత్తైదువుగా మనలకు దర్శనమిస్తుంది.

  మనకు ఏకత్వ పరిజ్ఞానమును కలిగించుటకు సోదాహరణమైన ధూమవతి చరణారవిందార్పణమస్తు.







PADISAKTULA PARAMAARTHAMU-CHINNAMASTAKA

   పదిశక్తుల పరమార్థము-ఆరవ శక్తి-ఛిన్నమస్తక.
   ************************************

  అమ్మ అనుగ్రహముతో మనము ఆరవశక్తియైన ఛిన్నమస్త తత్త్వమును అర్థముచేసుకొనుటకు ప్రయత్నిద్దాము.ఇక్కడ మనము ముచ్చటించుకొనవలసిన విషయములు మూడు. అవి తల్లి మనకు పరిచయము చేసినవి.

1.నాడీవ్యవస్థ.

  భైరవితత్త్వములో జాగృతమైన కుండలినీశక్తి సహస్రారముదాక సుషుమ్న అను నాడిద్వారా చేరుతోంది.అదియే కాక అమ్మకు ఇరువైపుల నున్న శక్తులను ఇడ-పింగళ నాడులుగా వివరిస్తున్నారు.వీటిలో సుషుమ్న ఆహారశక్తియై మూడువిభాగములుగా మారి రక్తధారలను అందించుచున్నది.


2.తల్లి మనకు నాడీమండలమును పరిచయము చేస్తూ,దానిని మనలోని సత్వ-రజో-తమోగుణ ప్రతీకలుగా వివరిస్తున్నది.కోపమును తెలియచేయు ఇడానాడిని రజోగుణముగా,అజ్ఞానమును తెలుపు నల్లని నాడిని తమోగుణ సంకేతముగా ప్రకటిస్తున్నది.ఆరెంటిని పోషించుతు తనకు తాను పోషించుకోగల స్వయంపోషకశక్తిగా,సత్వగుణ ప్రకాశిగా సుషుమ్నానాడిని చూపిస్తోంది.

3.నాడీమండలములోని మూడునాడులను-త్రిగుణములను పరికరములుగా మలచి,అమ్మ మధువిద్యా తత్త్వమును మనకు చెప్పుచున్నది.శుధ్ధసత్వస్థితిని రజో-తమో గుణములు ఏ మాత్రము ప్రభావితము చేయలేవు.ఏవిధముగా ఇహలోక మొండెం-పరమును చాటు తల విడివడినను మరణమును పొందలేదు.కాని ఇక్కడ మనము ఒక విషయమును గమనించాలి.మధువిద్య ద్వారా అమ్మ ముక్తసంగులకు ఆదర్శమైనది.మన నేటి ప్రవక్తలు మహానుభావులు సంసార ధర్మమును అనుసరిస్తూనే ఆధ్యాత్మిక మార్గములో పురోగమిస్తున్నారు.సత్వగుణకు సన్నిహితులగుచున్నారు.

 ఇప్పటివరకు పరిచయము గావింపబడిన దశేంద్రియములు-త్రిగుణములు-వాటికి తోడుగా అరిషడ్వర్గములను తెచ్చుకున్నవి అనుటకు ఉదాహరణయే తల్లి నిలబడిన రతీ-మన్మధ మైధున స్థితి.తల్లి దానిని సృష్టించి పరస్పరాకార్షణతో
జీవులను విస్తరిస్తూనే,హద్దులు దాటనీయకుండ దానిపై నిలబడి నియంత్రిస్తున్నది.లిమిటేషన్ ఎవాఇడ్స్ లిటిగేషన్ అని కదా ఆర్యోక్తి.జగన్మాత దానిని తెలియచేయుటకు తానే ఉదాహరణగా ,రజోపూరిత ఆలోచనలు గల రక్తప్రసరణమును శిరమునుఖండించి,దానిని విషయవాసనలు అనే మొండెం నుండి వేరు చేసి , శుధ్ధసత్వ నిధిగా చేస్తున్నది.ఇక్కడ అమ్మ చేస్తున్నది సవరణే కాని సంహారము కాదు అనుటకు అమ్మ చేతిలోని మస్తకము జీవించియే ఉన్నది.

 పంకములో నున్నను దానిప్రభావములేని జ్ఞాన పంకజము ఛిన్నమస్తాతత్త్వము.

  ఛిన్నమస్తా పాదారవిందార్పణమస్తు.

PADISAKTULA PARAMARTHAMU-BHAIRAVI

*********************
అమ్మ అనుగ్రహముతో ఈ రోజు మనము భైరవీతత్త్వమును అర్థము చేసుకొనుటకు ప్రయత్నిద్దాము.
మొట్టమొదట అమ్మ నివాసము మూలాధారము.అంటే ఆ ప్రదేశములో కుండలినీ శక్తి తటస్థముగా నిద్రపోతుంటుంది.అంతా చీకటి.జంతుతతుల వెన్నెముక అడ్డముగా నుండుట వలన అవి నిటారుగా లేచి నిలబడలేనట్లు,మన మనసులలోని చైతన్యము తటస్థముగా ఉంటుంది.దానికి ఎటువంటి ఆశలు-ఆశయాలు-ఆచరణలు ఉండవు.నల్లమబ్బు కమ్ముకొనిన ఆకాశము వలె ఉంటుంది.అప్పుడు మనలను అనుగ్రహించేది భైరవీశక్తి.
శబ్ద-ప్రకాశ (ఉత్కృష్ట) సంకేతములతో నల్లమబ్బులను చెల్లాచెదరుచేసి ప్రకటింపబడు అందమైన మెరుపు వంటి (ఇక్కడ మెరుపు జ్ఞానము.రూపము కాదు) మనసుకు-శరీరమును అనుసంధానము చేస్తూ,మనకు దశేంద్రియ జ్ఞానమును ప్రసాదిస్తుంది.అవే కన్ను-ముక్కు-నాలుక-చెవి-చర్మము వాటిని శక్తివంతము చేయు శబ్ద రూప స్పర్శ రస గంధాదులు.
భైరవీ మాత ఈ పది ఇంద్రియములను పనిముట్లగా మలచి ఆత్మతత్త్వమును అర్థముచేసుకొను అభ్యాసమును ప్రారంభించమంటుంది.
భైరవీమాతా చరణారవిందార్పణమస్తు.

LikeShow more reactions

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...