Wednesday, December 4, 2024

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17  

  *******************

 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"


     మహాదేవుని కరుణను మరింత స్పష్టము చేస్తూ నీలపంకజకాంతులు  ముచ్చతగొలుపుతున్నాయి తమ చల్లదనముతో.అంటే స్వామి గళమున నల్లగా అమరియున్నది కాలకూట విషమనుకున్న రావణుడు ఇప్పుడు ఆ నల్లతనమును చల్లదనమునందించుచున్న నల్లకలువల మాలగా దర్శించగలుగుతున్నాడు.


 " ఇప్పటి దాకా నీ-నా సంబంధము

   ఎప్పటిదో చెప్పలేనుగానీ"

     ఓ పరమేశ్వరా! నీ కరుణను

 " కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది(ఈ ఉపాధి)

   ఇప్పటికైనను ఎరుకను ఈయరాద ఏమి?"

     అని అడిగిన రావణుని భాగ్యమే భాగ్యము.


  స్వామి అనుగ్రహము నిత్యానిత్య వివేకమును కలిగిస్తున్నది విశ్వదర్శనమును చేయిస్తున్నది ఒక నాటక రంగస్థలమై.

 1. ఆ జీవితనాటక రంగస్థలము నందు ప్రారంభముగా వచ్చాడు . స్మరుడు(మన్మథుడు).తన పంచబాణ ప్రయోగముతో ప్రపంచమనే వేదికను సృష్టించాడు.వసంత ఋతువు మామిడి చిగుల్లతో-కోకిలారవములతో,పచ్చదనముతో పరవశింపచేస్తున్నది ప్రాణులను..మావి చిగురులు మనోహరముగా కోకిలలను పిలుస్తున్నాయి.పిల్లతెమ్మెరలు అల్లరులు చేస్తున్నాయి.పువ్వులలోని తేనియలు తుమ్మెదలను స్వాగతిస్తున్నాయి. తమవంతుగా సృష్టి వికసనమును విస్తరింపచేస్తూ.

2.ఆహా!

 అత్యద్భుతము.మన్మథలీల మూడు శరీరముల ఉపాధుల ఉద్భవమునకు కారణమైనది.త్రిపురాసురులను త్రిగుణములతో స్థూల-సూక్ష్మ-కారణశరీరములతో-జాగ్రత్-స్వప్న-సుషుప్తి అను మూడు అవస్థలతో ఎన్నో జీవులు సృజియించబడి పాత్రధారులై ఆ రంగస్థలిని చేరుకున్నాయి స్వామి ఆడించినట్లు ఆడటానికి.

3.ఇంకేముంది వాటికి పదహారు సంస్కారములు జరుగుతూ సంసారమనే కూపములో(సాగరములో) పడి మునకలు వేస్తున్నవి.

4.ఆ సంసారము సారహీనమైనదని, ఎరుకలేని, గ్రహించే శక్తిని కలిగియుండలేక వారు అనుభవిస్తున్న ప్రతి సుఖమునకు కారణము తమ సామర్థయే (దక్షతయే) అన్న అహంభావమును పెంపొందించుకున్నాయి.పూజలు-పునస్కార  


ములు-యజ్ఞములు-యాగములు తమ ప్రతిభను చెప్పుకొనుటకే కాని ఈశ్వరానుగ్రహమునకు కాదు కనుక నిరీశ్వర సిద్ధాంతమును బలపరచుకొని-తదనుగుణముగా ప్రవర్తించసాగాయి.

5.కన్ను-మిన్ను గానని మదముతో చేయకూడని పనులను చేస్తూ అరిషడ్వర్గములకు దాసోహమైనవి.యుక్తాయుక్త విచక్షణము తన స్థానమును కానరాక అంతర్ధానమయినదా అన్నట్లు.

6.కన్నులోని లోదృష్టి (అంతర్ముఖము)




 కనుమరుగైనది.పరమాత్మకనిపించని,.ప్రకాశమును గుర్తించలేని గుడ్డితనమది.అంధకత్వమునకు అసలైన చిరునామా.ఆదిదేవుని ఊహ సైతము అనుభవములోనికి రానీయనిది


.

   (సామవేదం వారి శిపదం)

 " నడుమ వచ్చిన-వచ్చి వంచించిన

   నానా లౌల్యములలో పడిన నన్ను

   ఇడుములువచ్చి ఇంకా వంచించిన వేళ"

    కాలకంఠునికరుణ కలువమాలగా కనపడి,

  ఆదిదేవుని అర్థింపచేస్తున్నది ఆ నాటకములో పాత్రధారులనే జీవులను పశ్చాత్తాప ప్రాయశ్చిత్తులుగా మారుస్తూ.

  ప్రేక్షకులు పరవశులై కాదుకాదు  పరమేశ్వరానుగ్రహవశులై చూస్తున్నారు.కన్నీరు కారుస్తున్నారు.పాత్రధారులతో పాటుగా తాము సైతము,

 " శివ నామమా! నీకు చేతులారామొక్కి

   సరనంటినో తల్లీ! వరకల్పవల్లీ"

     అంటూ నామికి-నామమునకు అభేదమును చాటుతున్నారు.

 చేతులారాశివుని పూజిస్తున్నారు.

   నోరు నొవ్వంగ  అహ 

   రంగస్థలమే కాదు-ప్రాంగణమంతా

       అహ

   ప్రాంగణమంతానే కాదు-ప్రపంచమతా

       శరనుఘోషగా 

 " నా కంఠ ఘంటిక్


అను నదియించు శబ్దమా

   నా నాల్కపై దివ్య నర్తనల వాగ్దేవి"

     అదో అనిర్వచనీయమైన దివ్యానుభూతి.

  ఎన్నో జీవుల కాలము చెల్లిందంటూ-వారిని తన పాశముతో బంధించాలని వచ్చిన అంతకుడు(యముడు) చేసేదిలేక వెనుదిరినాడు.

  

  తెరలను జరుపుతున్నాడు భక్తవశంకరుడు

  మదనాంతకుడు మనల మరుజన్మహరుడు

    కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

      

  భజ శివమేవ నిరంతరం.

     ఏక బిల్వం  శివార్పణం..

   


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...