Tuesday, March 5, 2024

ADITYAHRDAYAM-SLOKAM-24


 


 




 ఆదిత్యహృదయము-శ్లోకము-24


 **********************


  ప్రార్థన


  ********


 " జయతు జయతు సూర్యం  సప్తలోకైక దీపం


   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం


   అరుణకిరణ  గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం


   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి"




  పూర్వరంగము


  **********



  సూర్య ఆరాధనము వలన ఏ విధముగా స్థితప్రజ్ఞత అనుగ్రహింపబడుతుందో వివరించిన తదుపరి,ఆరాధనము ఏవిధమైన లక్షణములను కలిగియుండాలి అన్న అంశములను వివరిస్తున్నారు.పరమాత్మ "దేవదేవుడు.జగత్పతి.

    అని పరమాత్మను కీర్తిస్తూ,


 త్రిగుణితం-అన్న పదమునకు మూడుసార్లు అని సంఖ్యాపరముగాను,


 మూడు గుణములతో అని స్వభావ పరముగాను


మూడు శభ్దమును "అనంత పరముగా 'విశ్లేషిస్తారు.


 కనుకనే సహజకవిపోతన,


 ముగురమ్మల మూలపుటమ్మగా -పరాశక్తిని ప్రస్తుతించారు.


 అదే విషయమును అగస్త్య భగవానుడు సైతము ప్రస్తుత స్తోత్రములో,


 " ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-సివ-స్కంద-ప్రజాపతి-మహేంద్రో-ధనదః-కాలః-యమః-సూర్యః" అంటూ తెలియచేసారు.


  త్రిగుణితము అన్న పదమునకు అనంతత్త్వమును అనుసంధానించుకుంటూ,శ్లోకములోనికి ప్రవేశిద్దాము.

   శ్లోకము

    *****

" పూజయస్వైంచం ఏకాగ్రో దేవదేవం జగత్పతిం


  ఏతత్ త్రిగుణితం జప్త్యా యుద్ధేషు విజయిష్యతి."


 ప్రస్తుత శ్లోకము లో,



 1.పరమాత్మ


 2.ప్రార్థన


 3.ఫలితము 


 అన్న మూడు అంశములను వివరిస్తున్నది.


 పరమాత్మ పతి

.


 పతి అంటే పడిపోకుండా రక్షించువాడు/రక్షించు పరాశక్తి.


 స్త్రీ మూర్తిగా భావించుకుంటూ మనము,


 సామాంపాతు సరస్వతీ భగవతీ అని స్తుతిస్తాము.


 తండ్రిగా  ,


 నీవే నా పతియు-గతియు నిజముగ కృష్ణా.అని ప్రార్థిస్తాము.



 పతతి-అనగా పడిపోవటం.మనలను మనము ఉద్ధరించుకోలేని వాస్తవము.


 వస్తు ప్రపంచములో జరిగే విధానము వాస్తవము.


  వస్తుస్థితిని దాటి జరిగేది-శాశ్వతముగాఉండేది సత్యము.


 ప్రపంచము-వాస్తవము(తాత్కాలికము)


 పరమాత్మ-సత్యము(నిత్యము)


   శాశ్వతమైన  శక్తి కరుణయే "పతి" శబ్దముగా చెప్పబడినది.


 తమిళములో సైతము "ఉంపార్వై" అంటూ భగవంతుని దయను గుర్తిస్తారు.


 అంటే సూర్యనారాయణుడు " జగత్పతి"


  జగము యొక్క పతి.


 జగము అంటే,


 జాయతే-పుడుతుంది-గచ్ఛతే-నశిస్తుంది.ఇతి జగతి.


 జగత్పతి శబ్దము పంచకృట్యముల సంకేతము.


  దేవ శబ్దము ఆ కృత్యములు  నిర్వహించు మహాద్భుత శక్తి.



  పూర్వ శ్లోకములలో జ్యోతిర్గణాంపతి-దినాధిపతి-జ్యోతిషాం పతి అని సంబోధించిన  మహర్షి అవి మాత్రమే కాదు సర్వమునకు-సకలమునకు పతి అని స్పష్టము చేస్తున్నారు.


  సర్వదేవాత్మకో హ్యేష అని ముందు చెప్పి,


 ఆదిదేవం నమస్తుభ్యం "ప్రసీద మమ "భాస్కరునిగా,దేవదేవత్వమును వివరించారు.



 ఇంకొక ముఖ్యమైనవిషయము ఏంటంటే,


 తేన అరీ సర్వాన్ సమరేవిజయిష్యతీ అని ప్రారంభదశలో రాముని మానసిక చింతనము కలిగించిన చిత్తవృత్తులను ప్రస్తావించిన మహర్షి,అవి తొలిగిన సమయమున,


 " జప్యాం యుద్ధేషు విజయిష్యతి" అని  బాహ్య యుద్ధవిజయమును ఆశీర్వదించారు.


  పరోక్షముగా మన చిత్తవృత్తులప్రభావమును(సమరమును) అధిగమించిన తరువాతనే సంసారమనే యుద్ధములో ,త్రిగుణముల గమనమును మరల్చుకుని,గమ్యమును,మానవ జన్మ సార్థకతను పొందగలమని ఉపదేశించున్న సమయమున,


 తం  సూర్యం  ప్రణమామ్యహం.





TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...