ADIVO-ALLADIVO -tirumariSai ALwar
అదివో అల్లదివో-తిరుమళిశై ఆళ్వార్ సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరి ఆయుధములు ధర్మ సంస్థాపనయే లక్ష్యమైన మన ఆళ్వారులు తిరుమళిశై నగరములో కనకాంగి-భార్గవ మునికి చిరు మాంసపు ముద్దయాయె శ్రీ హరి సుదర్శనము లక్ష్మి-నారాయణుల అనుగ్రహము లక్షణ బాలుని సేయగ పంకజవల్లి-తిరువాలన్ దత్త పుత్రుడాయె ధర్మమై వృద్ధ దంపతులను కరుణించగ క్షీరమును సేవించి కణి కృష్ణుని అనుగ్రహించె ఆనందమును కలిగించె భక్తిసారుడు అనుపేర భగవత్తత్త్వమును చాటగ తన మూడవ కన్నుతో ముక్కంటితో తలపడెగ నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని పరమార్థము చాటిన తిరుమశై ఆళ్వార్ పూజనీయుడాయెనుగ.