Tuesday, July 9, 2019

DASAMAHAVIDYA-MAHAKALI.

 

    శ్రీమాత్రే నమః
    **************
 " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
   భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
   బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
   ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."

   నమామి మహాకాళి విద్యాం నిరంతరం.
 ************

  " యుగాది సమయే దేవీ శివం పరగుణోత్తమం
   తదిఛ్చా నిర్గుణం శాంతం సచ్చిదానంద విగ్రహం
   శాశ్వతం సుందరం శుక్లం సర్వదేవయుతం వరం
   ఆదినాథం గుణాతీతం కాళ్యా సంయుతం ఈశ్వరం."


  ఆవిర్భావ కారణము.
 ***************

 "" యా చిన్మయీ పరాదేవీ త్రిపురా త్రివిధా భవత్
    దేవకార్య సుసిధ్ధ్ర్యర్ధం అసురాణాం వధాయచ
    మహత్యాపది సంప్రాప్తే దేవా సంతుష్టువుర్భృశం
    తదాసా చిన్మయీ శక్తిః కాళీరూపా బభూవహ"

     దేవకార్యసిధ్ధి కోసము పరాశక్తి అయిన త్రిపురసుందరి కాళీ-లక్ష్మీ-సరస్వతీ రూపాలుగా ఆవిర్భవించినది
         త్రిశక్త్యైకరూపిణీ నమో నమః.

ఆవిర్భావ విధానము
***************

 కాళీమాత అవతరణ విషయమై దేవీ సప్తశతిలో రెండు విధములైన అభిప్రాయములున్నవి.

 మొదటిది మథుకైటభ రాక్ష వధకై బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థించగా,విష్ణువు యొక్క నేత్రములు-నాసిక-కర్ణములు-బాహువులు-హృదయము-వక్షస్థలము నుండి తేజరిల్లిన మహాశక్తియే కాళివిద్య యని భావిస్తారు.

  రెండవ విషయమునకు వస్తే చండ-ముండ రాక్షస వధకై అంబిక యొక్క కనుబొమల మధ్యనుండి ఆవిర్భవించిన శక్తియే కాళి అని భావిస్తారు.

  దక్షిణే కాళికా పాతు ఘ్రాణయుగ్మమ్మహేశ్వరి.

 శ్రీ కావ్యకంఠగణపతి ముని కాళిశక్తిని పరిణామశక్తిగాను,కాలశక్తిగాను క్రియాశక్తిగాను,అండ-పిండ-బ్రహ్మాండ సంహారశక్తిగాను ఆరాధించి,తరించినారు.నమోనమః.


  కదలకున్నట్టి శక్తియే ఘనుడు శివుడు
  కదలి వచ్చిన కాళి జగద్వ్యవస్థ
  ద్వైతభావమ్ము లేదెల్ల చేతనమ్మె
  సకలమన్నను నదియె నిష్కలయు నదియె
 
  అని తెలియచేసినారు విజ్ఞులు.మూలశక్తి సమయ సందర్భములను అనుసరించి అనేక రూపములను,ధర్మములను అనుసరిస్తు,ధర్మరక్షణ ను కొనసాగిస్తుంది అనుట నిర్వివాదము. కాళి శక్తి ఆవిర్భావమునకు ఇక్కడ రెండు సందర్భములను స్మరించుకుందాము.( నా ప్రయత్నము మేరకు).

 


  ఆవిర్భావము.
  ************

   శివుడు పగటికి ప్రతీక.ఒక్కొక్క మహావిద్య రాత్రియై,శివతేజమును కలుపుకొని,రాత్రిందివ సమ్మేళనాన్ని సంపూర్ణము చేస్తుంది.కాళికాదేవి అవతరణము వైదికమే.ఆ దేవి ప్రళయరాత్రిని సూచిస్తుంది.సమస్త భూత సృష్టిని తన రూపములో లీనము చేసుకునే శక్తిని కాళరాత్రి అనికూడా కీర్తిస్తారు.శివశక్తైకరూపిణి నమో నమః.. మమనామసహస్రంచ మయాపూర్వం వినిర్మితం
 మత్స్వరూపంకకారాద్యం మహాసామ్రాజ్యనామకం.-----

 కృష్ణమూర్తి కాళి అన్నారు పెద్దలు.

స్వరూపము
*********

 " శివారూఢాం మహాభీమాం ఘోరదం ష్ట్రాం వరప్రదాం
    హాస్యయుక్తాం త్రినేత్రాంచ కపాల కర్త్రికా కరాం
    ముక్తకేశీంలలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః
    చతుర్బాహుయుతాం దేవీం వరాభయరాంస్మరేత్."


 సాకార-నిరాకార కాళిస్వరూపములను గురించి పరికిస్తే కాళిమాత అరూపతను తమస్సుగాను,అగ్నిగాను,నిష్కల బ్రహ్మము గాను విజ్ఞులు భావిస్తారు.

 "భక్త ప్రాణప్రియా దేవీమహాశ్రీచక్ర నాయికా
  తత్రబిందౌ పరం రూపం సుందరంసుమనోహరం."

కాళిమాత నల్లనివర్ణమును కలిగియుంటుంది.అవర్ణత్వశక్తి దీని అంతరార్థము.అనగా తననుండి అన్నిరంగులను సృష్టించే శక్తికలది.మాంసము ఎండిపోయి,అస్థిపంజరము వంటి శరీరముతో కనిపిస్తుంటుంది.ముఖము విశాలముగా ఉంటుంది కాని ముఖములోని నాలుక విలవిల్లాడుతు కొట్టుకుంటు ఉంటుంది.ఎర్రని లోతైన కళ్ళతో ఉగ్రశక్తియై ఉంటుంది.దశదిశలను భయకంపితులను చేసే వికటాట్టహాసము చేస్తూ ఉంటుంది.పదిచేతులు-పది కాళ్ళు,ముండమాలను ధరించి పచ్చిమాంసమును తింటు-పచ్చినెత్తురు తాగుతుంటుంది.

ఆయుధములు
***********
 " ఖడ్గినీ మాలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా
   శంఖినీ చాపినీ బాణా భుశుండీ పరిగాయుధా."


   ఖడ్గము-బాణము-శూలము గద శంఖము-చక్రముపరిగె,ధనువు మొదలగువానిని ధరిస్తుంది.సమయ-సందర్భములను బట్టి మంత్రస్వరూపములైన ఆయుధములను ప్రయోగించి దుష్ట్వమును దునుమాడుతుంటుంది.

 స్వభావము
 ***********
" కాలరాత్రిః మహారాత్రిః మోహరాత్రిశ్చ దారుణా
   త్వం శ్రీస్త్వం ఇశ్వరీత్వం హ్రీస్త్వం బుధ్ధిః బోధలక్షణాః"

  మహావిద్యా మహామాయా మహామేథా మహాస్మృతిః
  మహామోహాచ భవతీ మహాదేవీ మహాసురీ

   ప్రకృతిస్త్వంచ సర్వస్య  గుణత్రయ విభానినీ."

 ఆశ్వయుజ కృష్ణపక్ష తిథిని ఇష్టపడుతుంది.కాలబంధనములు లేని సర్వజ్ఞ.కాలాతీత-గుణాతీత సర్వశక్తిమంతము.సూక్షముగా సకలజీవుల దేహాలలోను,స్థూలముగా జగద్దేహములోను కుం డలినీశక్తిగా కదలాడుతుంటుంది.ఉత్తర దిక్కును కాళి-తార శక్తుల దిక్కుగా భావిస్తారు.


 కృష్ణ-రక్త వర్ణభేదాలతో కాళికాదేవి రెండు విధములుగా ఉంటుందట.కృష్ణవర్ణ పేరు దక్షిణ అని,రక్తవర్ణ పేరు సుందరి అని బృహన్నీలతంత్రము తెలియచేస్తున్నది.కాళీమాత క్రియాశక్తికి ప్రతీక.తన భక్తులను అనుగ్రహించే ఉదారస్వభావము కలది.దయాంతరంగ.సామర్థ్యముకలది-దాక్షిణ్యము కలది కనుక తల్లి దక్షిణగా కీర్తింపబడుతోంది.


 దేవిభాగవత కథనముప్రకారము తల్లి మథుకైటభ రాక్ష సంహారి అని స్తుతించుచున్నప్పటికిని,జీవులలోని నాది-నా వాళ్ళు అనే మాయయే మథువు.దాని చుట్టు తిరుగు ఆలోచనలే కైటభము అదేనండి తుమ్మెద.భ్రమ చుట్టు తిరిగేది భ్రమరము.నాది అను మాయను తొలగించే పరాత్పరి మహాకాళి.
నివాసము
*****

రక్తము సదా ప్రవహించే అనాహతచక్రము కాళి నివాసము.గుండెలోని నాళాలు తల్లి నాలుకలు.నిత్యము గుండెలో మునిగిరక్తాన్ని పీల్చి-విడుస్తు ,ఊపిరిగా మారుస్తు ఉంటుంది రక్తకాళి.మనలో రక్తప్రసరణ చేయుచున్న క్రియా శక్తి.

దేవాలయములు
**************

ఉజ్జయినిలో,కలకత్తాలో,చంద్రాపూరులో,వరంగల్లులో ఇంకా అనేకానేక పవిత్ర క్షేత్రములలో తల్లి కొలువై,కొలిచినవారికి కొంగుబంగారమవుతోంది.
అంతరార్థము
 *************


 నిశితముగా పరిశీలిస్తే గతి-స్థితి రెండు తల్లి లీలలే.గతి అంటే చలనము,స్థితి అంతే స్థిరముగా మనమూన్వయించుకుంటే జగత్తును నిలిపేదే ప్రళయాంధకారములో సమస్త ఆకారములు సమానముగా మారి,గుప్తస్థితిని (గుర్తించలేని) పొందుటనిష్కల బ్రహ్మమగుట అనివార్యము.ఇంకొక విధముగా అన్వయిస్తే గతి అంటే ఆకర్షణ.స్థితి అంటే సంసారచక్రము.దీనివైపుకు ఆకర్షితులమై సత్యము కనుగొనలేని చీకటిలో గుప్తస్థితిని పొందిన సమయమున తల్లిరెండిటికి తాను బిందువై సమ్న్వయ పరుస్తు,సదా ఆశీర్వదిస్తుంటుంది.



 నిశితముగా పరిశీలిస్తే గతి-స్థితి రెండు తల్లి లీలలే.గతి అంటే చలనము,స్థితి అంతే స్థిరముగా మనమూన్వయించుకుంటే జగత్తును నిలిపేదే ప్రళయాంధకారములో సమస్త ఆకారములు సమానముగా మారి,గుప్తస్థితిని (గుర్తించలేని) పొందుటనిష్కల బ్రహ్మమగుట అనివార్యము.ఇంకొక విధముగా అన్వయిస్తే గతి అంటే ఆకర్షణ.స్థితి అంటే సంసారచక్రము.దీనివైపుకు ఆకర్షితులమై సత్యము కనుగొనలేని చీకటిలో గుప్తస్థితిని పొందిన సమయమున తల్లిరెండిటికి తాను బిందువై సమ్న్వయ పరుస్తు,సదా ఆశీర్వదిస్తుంటుంది.

  ఫలసిధ్ధి.
 **********
 " ప్రథమ దశమహాశక్తి,శ్రీమాత దక్షిణపార్శ్వ రక్షకురాలు యైన కాళి భక్తులు,

  "శూన్యాగారే శ్మశానేనా ప్రావరే జలమధ్యతః
   వహ్ని మధ్యేచ సంగ్రామే తథా ప్రాణస్య సంశయే" నున్నను తల్లి వారిని వెన్నంటి కాపాడుటయే కాక,  శ్రీ మహాకాళి ఆరాధన సకల వ్యాధులనుండి,బాధల నుండి విముక్తులను చేస్తుంది.దీర్ఘాయువు,శత్రునాశనము,సకలలోక పూజనీయతను అనుగ్రహిస్తుంది.

 " కాలికా తస్య గేహేచ సంస్థా కురుతే సదా."

" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.





  " కాళీ కపాలినీ కాంతా కామదా కామసుందరీ
    కాలరాత్రీ కాళికాచ కాలభైరవ పూజితాః"

  యాదేవీ సర్వభూతానాం కాళిరూపేణ  సంస్థితాం,
  నమస్తస్త్యై  నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.



   ( శ్రీకాళిమాత చరణారవిందార్పణమస్తు.)































TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...