Posts

Showing posts from October 22, 2017

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)

Image
" జానక్యా: కమలాంజలి పుటేయా: పద్మరాగయితా: న్యస్తా రాఘవ మస్తకేన విలసత్లుంద ప్రసునాయతా: స్రస్తా శ్యామల మస్తకాంతి కలితా యాఇంద్ర నీలాయుతా: ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం" అప్పా,  రామభక్తి ఎంతో గొప్పరా !!! ********************************** స్వస్తి శ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి, బుధవారము పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న సీతారామ కళ్యాణములో తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు ఇంతలో మంగళ హారతినిస్తూ, మంగళ స్నానాలకై పదపదమని వారిని పంపింది పరవళ్ళ గోదావరి మగపెళ్ళివారము మేము అంటూ అహల్య పరమ పావనపాదము అనుచు పారాణిని అద్దింది రఘువంశ తిలకుడు అని కళ్యాణ తిలకమును దిద్దింది రామచంద్రుడీతడని బుగ్గ చుక్క పెట్టింది ఆడ పెళ్ళివారము మేము అంటూ మొల్ల వేదవతి పాదము అని పారాణిని అద్దింది పతివ్రతా తిలకము అని కళ్యాణ తిలకమును దిద్దింద...

Raara Maa Intidaaka Raama (రారా మా ఇంటి దాక రామ)

Image
"రారా మాఇంటి దాక" రామా ************************** "జానక్యా కమలాంజలి పుటే: యా పద్మరాగాయిత-న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయతే శ్రస్త శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్ర నీలాయిత-ముక్తస్థ శుభద భవంతు భవతం శ్రీ రామ వైవాహికం" స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి,శుక్రవారం పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న , ****************************** ********* అసమాన శివ ధనుర్భంగము గావించిన వానికి అగ్ని పునీత వేదవతి,అయోనిజ సీతను ఇచ్చి విదేహ మహారాజు చేయుచున్న ముదావహ "కన్యాదానము"లో " వరుడు" ఆ సూర్య వంశములో అగ్ని ప్రసాదముగా జన్మించిన వాడు ఆ కౌశికునికి అగ్నికార్య రక్షణము కావించిన వాడు అహమును తొలగించిన వాడు అహల్య పాలిట దేవుడు గురు వాక్య పాలకుడు,సుగుణాభి రాముడు ఆ లోక కళ్యాణములో ********************** "నిధి చాల సుఖమా రాముని సన్నిధి కన్నా" కాదని తరలినాడు భద్రుడు తాను పెళ్ళి వేదికగా అర్ఘ్య పాద్యాలు,మంగళ స్నానాలకు పరవళ్ళు తొక్కింది పదమని గోదావరి విభీషణుని మృదు సంభాషణల వ్యాఖ్యాన...