Monday, November 13, 2023

KADAA TVAAM PAsYAEYAM-02




   కదా  త్వాం పశ్యేయం-02

   ******************

  " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.


   నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".


  ' స్తవై బ్రహ్మాదీనాం జయజయ వచోభిర్నియమినా

    గణానాం కేళీభిర్మదకల మహోక్ష్స్య కకుది"


    బ్రహ్మాదులు-నియమపాలితులైనమునులు-పరవస్త్స్తున్న ప్రమథగణములు - అంబా సమేతముగా తనపై నున్న స్వామి అనుగ్రహమును వహిస్తూ నందీశ్వరుడు చేయుచున్న జయ-జయ-జయ-జయ ధ్వానములను మనోఫలకముపై ముద్రించుకుని,ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.

  "జయ జయ జయ పార్వతీ పరమేశ్వరా" నమో నమః.


    


     


 కొంచము సేపు విశ్రాంతి తీసుకుని మార్గబంధు సహాయముతో పయనము ప్రారంభించారు శంకరయ్య-శివయ్య.

  మౌనముగా వారి పాదాలుకదులుతున్నాయి.కాని శంకరయ్య మనసులోని పదాలు మాత్రం పరుగులు తీస్తున్నాయి.

 ఇదేనేమో 

  "గురోస్తు మౌనంవ్యాఖ్యానం-

          శిష్యాస్తు ఛ్చిన్న సంశయా అంటే"


   పొరబడుతున్న శంకరయ్య మనసు ప్రత్యర్థి         వివరాలు           అడగటానికి తడబడుతోంది.కాని ఇప్పుడు శివయ్య మౌనముగా ఉండతలచుకోలేదు.మరలించాలి కదా మనసైన వాడిని తనదారిలోనికి.అసలు తాను వచ్చింది అందుకేగా.


    శంకరయ్యకు శివయ్య తప్ప వాని గురించి చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూలేరు.(ఎక్కడున్నకూడా)

 కాని అడగటానికి అహం అడ్దు వస్తోంది.అడ్డగోడ కడుతోంది.శివయ్య కరుణా కెరటము దానిని కూల్చివేస్తున్నది.

 " ఒకవైపు అనుమాన లహరి-మరొకవైపు అనుగ్రహలహరి "      పోటీ      పడుతు ప్రవహిస్తున్నాయి ఇరువురి హృదయాలలో.. "నమః శివాయ"


    అడగటం తప్పేమి కాదులే అనుకున్నాడు శంకరయ్య.

    నీకు తప్పేది కాదులే అనుకున్నాడు శివయ్య.

  ఇరువురు ఒక్క క్షణం ఒకరినొకరు చూసుకున్నారు

    అవ్యాజ కరుణతో ఆ మహాదేవుడు ఏమైయింది శంకరయ్య గారు?అడుగుల  వడి తగ్గింది.ఏదో ఆలోచిస్త్లున్నారు...... కొంచము సేపు ఆగి,

  ఇలా అయితే మనము వాడిని చూసేది ఎప్పుడు.గట్టిగా పట్టుకునేది ఎప్పుడు?.మోసాలను అరికట్టేది....

  మీరు నా పక్కనే ఉన్నారన్న ధైర్యముతో నేను మీతో వస్తున్నాను.ఆలస్యమైతే  అందకుండా పారిపోతా..డేమో

  పోనీ వెనుకకు మరలిపోదామా..

  నేను నా తిప్పలు పడతాను.మీకసలు వాడి అవసరమే లేదుకదా.చిలిపిగా చూస్తూ అడిగాడు శివయ్య.

 నీ కా శంక ఎందుకు వచ్చింది శివయ్యా?

 నేను ఆడిన మాటను తప్పి ఓటమిని ఒప్పుకునే వాడను కాదు.నువ్వు నాకొక చిన్న...-చిన్న మాట సహాయంచేస్తే చాలు..మనపని   అయిపోతుంది.  నువ్వు సందేహం పెట్టుకోకు అన్నాడు.

   మాటసాయ0   ఇప్పుడే-ఇక్కడే చేస్తాను   అడగండి     శంకరయ్యగారు అనగానే,వెంటనే

   నువ్వు నీకు ఎవరో అతని గురించిచెబితే నీ కష్టాలు పోగొట్టాలని అడగటానికి వస్తున్నవు కదా,  వాళ్ళు....

 అడగండి శంకరయ్య గారు

 వాళ్ళు వాని ముఠాలో షుమారు ఎంతమంది ఉండవచ్చని చెప్పారు? అడిగేశాడు.

 ఓ అదా...ముప్పది మూడు కోట్ల మంది అంట.

   ఏమిటి అంతమందిని వశపరచుకున్నాడా ఆ ...

  వాళ్లందరు కలిసి ఈ అమాయక జనాలను మోసం చేస్తునా....

   కాదండి.

 వాళ్లందరు ఆయనను సేవిస్తుంటారటండి.ఆయన ఏది చెబితే అది వాళ్ళు చేస్తారట.పైగా 

 "శివ శాసనము-శిలా శాసనము కన్నా గొప్పది" అన్నారండి

  ఒక్కొక మాటతో ఎంచక్కని బాటను వేయడం ప్రారంభించాడు శివయ్య.

  వాడు అమ్మలాంటి అయ్య అట-అయ్యలాంటి అమ్మ అట.

  సరేలే కాని శివయా..

 మిగతా వాళ్ళలో కొందరిపేర్లైన చెప్పారా నీకు? వాళ్ళు అసలు ఏం    చేస్తుంటారట         నాకు తెలీక అడుగుతాను.పనిలేనివాళ్ళు పనికిమాలిని వానిని చేరి---పాపం పాపం-ఉపశమించునుగాక.

 మాచిన్నప్పుడు మా పక్కింటి బామ్మగారు ఎప్పుడు ఇదే పాట పాడేది.నన్ను పాడమంటారా శంకరయ్యగారు.

 ఇప్పుడు వద్దంటే విషయములను సేకరించలేననుకుంటూ వినిపించు త్వరగా అన్నాడు అసహనంగా శంకరయ్య.


 "వస్త్రోద్ధూత విధౌ సహస్ర కరతా,పుష్పార్చబే విష్ణుతా

  గంధే గంధ వహాత్మతాన్నపచే బహిర్ముఖాధ్యక్షతా

  పాత్రే కాంచన గర్భితాస్తి మయిచేత్ బాలేందు చూడామణి

  శుశ్రూషాం కరవాణితే ..........స్వామిః..గురో"

  చిన్నప్పుడు రోజు వినేవాడినికదండీ నోటికి వచ్చేసింది.  ఆవులిస్తూ నాకు నిద్దరవస్తోంది శంకరయ్యగారు రేపు మాట్లాడుకుందాం 


అని అంటున్న శివయ్యను తెల్లబోయి చూస్తున్నాడు శంకరయ్య,

   కదిలేవి కథలు-కదలనిది కరుణ.

  .

 'తన్మై మనః శివ సంకల్పమస్తు


  వాచే మమశివపంచాక్షరస్తు


  మనసే మమ శివభావాత్మ మస్తు".


   కదిలేవికథలు-కదలనిది కరుణ.


    పాహిమాం పరమేశ్వరా.




    (ఏక బిల్వం  శివార్పణం) 


  



KADAA TVAAM PASYAEM-01


    
   కదా త్వాంపశ్యేయం-01
   **********************
 " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.

   నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".
  ప్రపంచ పదార్థములను గుర్తించగలిగి-ప్రకటించకలగటమును ఐహిక జ్ఞానముగాను,అవ్యక్త చైతన్య ఉనికిని గుర్తించి-దర్శించి ధన్యత చెందగలిగేది ఆధ్యాత్మిక జ్ఞానము.అదిలేనిది అజ్ఞానము.ఒక వస్తువును మరొకటిగా భావించి-భాషించుట అన్యథా జ్ఞానము.అన్యథా జ్ఞానము అజ్ఞానము కన్న అనర్థదాయకమని దానిని తొలగించుకొనుట అతి కష్టమని పెద్దలు అనుభవముతో చెబుతారు.

 ఈనాటి బిల్వార్చనము లో సదాశివుడు,
    మనకు అజ్ఞానమును-అన్యథా జ్ఞానమును పరిచయము చేస్తూ పదములను కదిలిస్తున్నాడు  రెండు ఆట బొమ్మలతో మాట్లాడిస్తూ..నమామి పరమేశ్వరా.



   అటుగా వెళుతున్న  శంకరయ్య-శివయ్యలకు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటూ-వారు పోట్లాడుకుంటున్నారా అనిపించేటట్లు కనిపించారు.చాలా సేపటికిందనే  వాదన ప్రారంభమైనట్లున్నది.గొంతులు రాచుకుంటున్నాయి.మధ్యలో ఆపి దాహమును తీర్చుకుంటున్నారు.కండువాతో నుదుటిమీద పట్టిన తుడుచుకుంటున్నారు.కాని,

 ఎవరు వెనుకకు తగ్గటములేదు.ఎదుటివారి మాటను అంగీకరించుట లేదు.ఏమైనదా అని ఆరా తీస్తే,



   వారిద్దరికి ఒక వస్తువు కనిపించింది తళతళమెరుస్తూ.

 వెండిముక్క అంటున్నాడు ఒకడు.

 కాదు  గాజుముక్క అంటున్నాడు మరొకడు.

 

 అంతటితో ఆగక మొదటివాడు నీవు చూసిన వస్తువును గుర్తుపట్టలేకపోతున్నావు  అంటూ

 తన పక్క నున్న మరొక   దానిని చూపిస్తూ ఇప్పుడు చెప్పు ఇది ఏమిటి? అని అడిగాడు.దానికి రెండవ వాడు ఓ! నాకు తెలుసు. ఇది ,మణి అన్నాడు నిశ్చయముగా.మణికాదు ఇది రాయి.మన పక్కనే ఉన్నది కదా అన్నాడు 

 మణి అంటున్నాడు ఒకడు.

 కాదు రాయి అంటున్నాడు మరొకడు.

 తన మాటను రూఢి చేయాలని సూర్యకిరణ కాంతిపడి మెరుస్తున్నది అది మణికాదు అంటున్నాడు.
 
 కానేకాదని తలను అడ్దంగా తిప్పుతున్నాడు అలిసిపోయి. 

  అదేదారిలో ఒక విప్రుడు,

 "యథా బుద్ధిశ్శుక్తా రజతమితి కాచష్మకమణిః

  జలేపైష్టీక్షీరం భవతి మృగతృష్ణాతు  సలిలం

  తథా "దేవభ్రాంత్యా" భజతి భవదన్యం జడజనం

  మహాదేవేశ త్వాం మనసిచ నమత్వా పశుపతే."

 

  అదే సమయములో ఒక కారు సైతము  హారను శబ్దము చేస్తూ అటుగా వెళ్ళింది.



 


 " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం  ప్రార్థితం.

   నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.".







  మనకు అజ్ఞానమును-అన్యథా జ్ఞానమును పరిచయము చేస్తూ పదములను కదిలిస్తున్నాడు పరమేశ్వరుడు రెండు ఆట బొమ్మలతో మాట్లాడిస్తూ..నమామి పరమేశ్వరా.



 అటుగా వెళుతున్న  శంకరయ్య-శివయ్యలకు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటూ-వారు పోట్లాడుకుంటున్నారా అనిపించేటట్లు కనిపించారు.చాలా సేపటికిందనే  వాదన ప్రారంభమైనట్లున్నది.గొంతులు రాచుకుంటున్నాయి.మధ్యలో ఆపి దాహమును తీర్చుకుంటున్నారు.కండువాతో నుదుటిమీద పట్తిన చెమటను తుడుచుకుంటున్నారు.కాని,

 ఎవరు వెనుకకు తగ్గటములేదు.ఎదుటివారి మాటను అంగీకరించుట లేదు.ఏమైనదా అని ఆరా తీస్తే,



   వారిద్దరికి ఒక వస్తువు కనిపించింది తళతళమెరుస్తూ.

 వెండిముక్క అంటున్నాడు ఒకడు.

 కాదు  గాజుముక్క అంటున్నాడు మరొకడు.

 

 అంతటితో ఆగక మొదటివాడు నీవు చూసిన వస్తువును గుర్తుపట్తలేక యున్నావు అంటూ

 తన పక్క నున్న  దానిని చూపిస్తూ ఇప్పుడు చెప్పు ఇది ఏమిటి? అని అడిగాడు.దానికి రెండవ వాడు ఓ నాకు తెలుసు ఇది మణి అన్నాడు నిశ్చయముగా.మణికాదు ఇది రాయి.మన పక్కనే ఉన్నది కదా అన్నాడు 

 మణి అంటున్నాడు ఒకడు.

 కాదు రాయి అంటున్నాడు మరొకడు.

 తన మాటను రూఢి చేయాలని సూర్యకిరణ కాంతిపడి మెరుస్తున్నది అది మణికాదు అంటున్నాడు.

 కానేకాదని తలనూడ్దంగా తిప్పుతున్నాడు అలిసిపోయి. 







 అదేదారిలో ఒక విప్రుడు,

 "యథా బుద్ధిశ్శుక్తా రజతమితి కాచష్మకమణిః

  జలేపైష్టీక్షీరం భవతి మృగత్రుష్ణాతు సలిలం

  తథా "దేవభ్రాంత్యా" భజతి భవదన్యంజడజనం

  మహాదేవేశ త్వాం మనసిచ నమత్వా పశుపతే."

 

  అదే సమయములో ఒక కారు సైతము  హారను శబ్దము చేస్తూ అటుగా వెళ్ళింది.



 "మనము అణువంత పరతత్త్వమును అర్థము చేసుకునే లోపుగా  ఆకాశమంత మాయను కప్పేస్తుంటాడు ఆ అడ్డనామాలవాడు".



  శంకరయ్యకు ఒకచక్కటి ఆలోచన తళుక్కున మెరిసింది.శివయ్యకు ఆ శ్లోక భావమునుచెప్పి,వివరముగా చెప్పి,వెనుకకు పంపించాలనిపించింది.

 శివయ్యా మనము కాసేపు ఆ రచ్చబండ మీద విశ్రాంతి తీసుకుని మన ప్రయాణమును చేద్దాము.

  చిరునవ్వుతో తలపంకించాడు శివయ్య."తనకు కావలిసినదికూడా అదేగా".

 అమాయకముగా   వచ్చి కూర్చున్నాడు పక్కన.

 ఆ విప్రుడు చదివిన శ్లోకము అర్థము -మనము చూసిన వారి చేష్టలు ఒక్కటిగా లేవూ అని ఉత్సాహముగా   అన్నాడు

శంకరయ్య.

  నాకు సదువురాదుకదా.అర్థమవ్వలేదు.వారేమో ఒకటే వస్తువును పట్టుకుని దాని పేరు తెలియక కొట్లాడుకుంటున్నారు అన్నాడు  మరింత అమాయకముగా.
  నేను నీకు అర్థము అయ్యేలా చెబుతాను.కంగారుపడి దూరంజరుగకు.నీకు  కనుక భావం బోధ పడిందా మన కథ అడ్దం తిరగటంఖాయం అంటూ,గొంతును సవరించుకుని,గంభీరముగా

 1.జడజనః-(చైతన్యమును దుర్తించలేని) మూర్ఖ జనులు

 2.భ్రాంత్యా-భ్రమలో ఉన్నారయ్యా.

    అంటే దగ్గరగా జరిగి మరీ అడిగాడు శివయ్య.

 అంటే,నేను నీతో చెప్పానే దేవుడు లేడనేవిషయము

  కాని ఉన్నాడని అందరు అనుకుంటున్నారని,వానిని 

3,నమత్వా-నిజమని/ఉన్నాడని తలుస్తూ

4.భజతి-భజిస్తున్నారు.

   లేనివాడిని ఉన్నాడనుకొని భజిస్తున్నారు ఈ మూర్ఖ జనులు.నీతోపాటు వారికి త్వరలోనే కనువిప్పు కలుగుతుందిలే

  మనసులోనే నవ్వుకున్నాడు మహాదేవుడు.

'యథా బుద్ధిః భవతి-తథా భాష్యతి ఇంద్రియం"

 అయితే నేను మా ఊరికి తిరిగి వెళ్ళిపోనా అని శివయ్య అంటుండగానే ,

 శ్లోకం చదువుతూ వెళ్ళిన విప్రుడు తన పక్కనున్న వానికి అన్యదేవతాం భజతి అని చెబుతూ వెళుతున్నాడు.
 
 విన్న శంకరయ్య  ఖంగుతున్నాడు.అంటే-అంటే ఆ మోసగాడు వాడొక్కడే కాదా?ఇంకా చాలామందిని తన జట్టులో కలుపుకున్నాడా ఇందాక ఈ దేవశబ్దము నాకు వినబడలేదే ,గొణుగుకుంటున్న శంకరయ్యను మరింత మురిపెముగా చూస్తూ ,ఆ కారు హారను శబ్దము కారణమేమొనండి అన్నాడు అమాయకముగా.శివయ్య,

 "నీలోని నామీద కోపం 
  వెలుగనీయదు జ్ఞానదీపం" 
    అంతలోనే తేరుకుని,

    శివయ్యా ఎంతమంది ఉన్నాసరే నా ప్రయత్నము ఆపను.ప్రయాణము ఆపను.వాడు నా కళ్లపడేవరకు,ఎప్పుడు చూస్తానో,
  " కదా   త్వాంపశ్యేయం" అని  అంటున్న శంకరయ్య ఏమిచేస్తాడో-శివయ్య ఏమిచేయించ దలిచాడో రేపటి బిల్వార్చనలో తెలుసుకుందాము.

 'తన్మై మనః శివ సంకల్పమస్తు

  వాచే మమశివపంచాక్షరస్తు

  మనసే మమ శివభావాత్మ మస్తు".

   కదిలేవికథలు-కదలనిది కరుణ.

    పాహిమాం పరమేశ్వరా.



    (ఏక బిల్వం  శివార్పణం) 

  

  

  

KADAA TVAAM PASYAEM-INTRODUCTION



  

  

 




  

  

 

  


 శివస్వరూపులారా! 

   అగ్ని స్వరూప నక్షత్ర కృత్తికా /కార్తిక మాసమున సత్యము-శివము-సుందరమైన అంబాసమేతముగా ,

 "కలాభ్యాం-చూడాలంకృత శశికలాభ్యాం' అంటూ  వచ్చేశాడు.అశేషఫలములను అందిస్తానంటున్న వారిరువురిని అంతఃకరణ శుద్ధితో  ఆహ్వానించేద్దాము.



    


  ' ఐంకార-హ్రీంకార-రహస్య యుక్త


    శ్రీంకార-గూఢార్థ-మహా విభూత్యా


    ఓంకార-మర్మ-ప్రతిపాదినీభ్యాం


    నమో నమః శ్రీ గురుపాదికాభ్యాం" 




  గుడివైపుగా మెల్లగా నడచి వెళుతున్న సాంబయ్య చెవిని పడింది శ్లోకం చిత్తవృత్తులను చిత్రముగా మలుస్తూ. నేనసలే నాస్తికుడిని.దేవుడే లేడు కదా.నాకెందుకు వాళ్ళేమి చెప్పుకుంటే అంటూ ముందుకు సాగాడు.మనిషి కంటె వేగముగా మనసు ముందుకు సాగుతోంది.అసలు మనసును మభ్యపెట్టి ఆటలాడుచున్న ఆ "టక్కరి" నాకు కనిపించాలేకాని,........పళ్ళునూరుతున్నాడు.


  శివుని కరుణ అర్థము కానిది


     కాని


  శివుని కరుణ అద్భుతమైనది.


 " క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం-క్రీడా మృగాస్తే జనాః"


 విలాసముగా ప్రపంచమనె క్రీడామైదానమును సృజించి,క్రీడాకారులుగా జనులను భ్రమింపచేస్తున్న పరమాత్మ,

 లీలామానుషధారియై కొత్త నామరూపములతో శంకరయ్యను సమీపించి,వినయముగా


 శంకరయ్యగారు నమస్కారము.ఎక్కడికో ..ఏదో-అత్యంత అవసరమైన పనిమీద వెళుతున్నట్లున్నారు.నేను  ఆ దారినే వెళుతున్నా నాపనిమీద.కలిసి వెళదామా కబుర్లాడుకుంటూ అన్నాడు.


 అదేనయ్యా శివయ్యా! ఆ దొంగవేషాలువేస్తూ అందరి మనసులు దోచుకుంటూ  ఆటలాడువానిని పట్టుకుని             మోసముచేవ్యుట సరికాదని తెలియచేద్దామని వెళుతున్నాను.


 వాడు నాకు కనపడాలేకాని-వానిని చూడగలగాలేకాని...అయినా వాడిని నేను


  "కదా త్వాం పశ్యేయం" 


   ఎప్పుడుచూస్తానో కాని కనపడేదాకా వెతుకుతూనే ఉంటాను అన్నాడు పట్టుదలగా..


  నేను అంతే శంకరయ్య గారు,అందరు నాకష్టాలను చూసి జాలితో వాని పాదాలు పట్టుకుంటే పాపాలు పోతాయట.పోయి పట్టుకో అంటే బయలుదేరాను.మరి నాకు సైతము/నేను సైతము,మీ లాగ బెదిరించలేకపోయినా-బతిమాలి  బంధవిముక్తుణ్ణి చేయమని అడగాలనుకుంటున్నాను.ఎప్పుడో వాడిని నేను సైతం చూసేది.


 "కదా త్వాం పశ్యేయం" అన్నాడు  విచారముగా. 



  వెంటనే ,అదేమిటయ్యా!


   నేనంటే భయము కనుక దాక్కుంటాడు.నువ్వు దీనుడనని చెబుతున్నావు.నీకు కూడా ఎప్పుడు వానినిచూడగలుగుతానన్న సందేహమేనా? అన్నాడు శంకరయ్య ఆశ్చర్యముగా.


  అవునండి!


   మీరు నన్ను అడగవచ్చు.ఎవరో తెలియదు.ఎక్కడుంటాడో తెలియదు.కోరికలను తీరుస్తాడో/కోరికలను లేకుండా చేస్తాడో అసలు తెలియదు.అట్టి వానికై నా వెతుకులాట మీకు వెక్కిరింతగా ఉంటుందేమో.


   నిన్న పంతులుగారుశివయ్యా!

నేనెప్పుడు నిన్ను చూస్తానో అని అంటుంటే సరిపోదురా అబ్బాయి  నువ్వెప్పుడు నన్ను చూస్తావో-  నేనెప్పుడు చూస్తానో అని లంకె వేసి  అంటుంటే   ఉబ్బులింగడు తబ్బిబ్బై నీ ముందుంటాడు.


 "కదా త్వం దృష్ట్వా"? అంటుంటే నీముందుంటాడు.వెంటనే 


  " కదా మద్రక్షాం వహసి_" అని అడగమన్నారండి.


  అందుకే ఆ మూడు వాక్యాలను ,




 1.కదా త్వాం  పశ్యేయం?


 2.కదా త్వం  దృష్ట్వా?


 3.కదా వా  మద్రక్షాం వహసి?


   అన్న వాక్యాలను మనమము చేస్తున్నానండి.మరసిపోతే ఎలా? అన్నాడు అమాయకంగా.


  విన్న శంకరయ్య నవ్వుతూ నీకు కనబడాలంటే,వాడు నిన్ను చూడాలా ముందుగా -బహు బాగా చెప్పావు.వాడికి నీ రక్షణాభారం 


అప్పగిస్తానన్నావు. వినేవుంటాడు.ఇంకెందుకు దొరుకుతాడు.


 వాడిని నేను పట్టి  తెచ్చి నీ ముందుంచుతానులే అన్నాడు శంకరయ్య ఠీవిగా.నాదం తనుమనిశం శంకరం.నమామి మనసా-శిరసా,


  బాహ్యదృష్టికి కార్యము-భావనా దృష్టికి కారణము గోచరమగుతాయి.


 స్వప్రయత్నమునకు సానుకూలతనందించగలిగేది కేవలము స్వామి అనుగ్రహము.

    అన్న మాట నిలబెట్టుకున్నాడా శంకరయ్య .ఆమహాదేవుడు ఎవరికి కనిపించాడు? ఏమనిపించాడు అన్న విశేషములను శివుని డమరుకము అనుగ్రహించినంతమేరకు మీతో పంచుకుంటూ బిల్వార్చనను చేసుకుందాము.


  ఇది, మహాదేవుడు నా ముచ్చట తీర్చుటకై నా చేతిని పట్టుకుని తనకు తానే వ్రాసుకుంటున్న అనుగ్రహము.అది సహించలేని నా ఉపాధి ఉక్కిరిబిక్కిరై కప్పలతక్కెడగా తప్పులను చేరుస్తూ తనపని తాను చేసుకుంటుంది.శివ స్వరూపులు ఆదిశంకరుల అనుగ్రహమైన శివానందలహరి స్తోత్రము అర్థము చేసుకునే నా ప్రయత్నముగా .భావించి నన్ను ఆశీర్వదించండి.


   కదిలేవికథలు-కదలనిది కరుణ.


     పాహిమాం పరమేశ్వరా.


    (ఏక బిల్వం  శివార్పణం)





  


  


 


  




 


  

  


 

  

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...